ఈ వారం థియేటర్, ఓటీటీ లిస్ట్.. హై వోల్టేజ్ ఎంటర్టైన్మెంట్

వారం వారం బిగ్ స్క్రీన్ తో పాటు డిజిటల్ ఓటీటీ ఛానల్స్ లో కావాల్సినన్ని సినిమాలు, వెబ్ సిరీస్ లు ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాయి.

Update: 2024-12-23 07:13 GMT

వారం వారం బిగ్ స్క్రీన్ తో పాటు డిజిటల్ ఓటీటీ ఛానల్స్ లో కావాల్సినన్ని సినిమాలు, వెబ్ సిరీస్ లు ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాయి. ఆడియన్స్ కి బోలెడంత వినోదం లభించబోతోంది. ఎవరికి నచ్చిన జోనర్ సినిమాలు, సిరీస్ లు వారు చూసుకునే సౌలభ్యం ఓటీటీలో ఉంది. ఆడియన్స్ ఇంటరెస్ట్ ని దృష్టిలో ఉంచుకొని ఓటీటీ ఛానల్స్ డిఫరెంట్ జోనర్ కంటెంట్ ని రెగ్యులర్ గా అందిస్తోంది.

ఈ వారం థియేటర్స్ లోకి రాబోయే సినిమాల సంగతి చూసుకుంటే మలయాళీ సూపర్ స్టార్ మోహన్ లాల్ హీరోగా స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ‘బరోజ్’ త్రీడీ డిసెంబర్ 25న పాన్ ఇండియా లెవల్ లో విడుదల అవుతోంది. ఇప్పటికే వచ్చిన ట్రైలర్ అందరిని ఆకట్టుకుంది. ‘బరోజ్’ తో సరికొత్త ప్రపంచంలోకి ఆడియన్స్ ని తీసుకొని వెళ్ళబోతున్నారు. ‘గార్డియన్‌ ఆఫ్‌ డి గామాస్‌ ట్రెజర్‌’ అనే ఓ నవలను ఆధారంగా ఈ మూవీ తెరకెక్కింది.

ఇక వెన్నెల కిషోర్ హీరోగా రైటర్ మోహన్ దర్శకత్వంలో ‘శ్రీకాకుళం షెర్లాక్‌హోమ్స్‌’ డిసెంబర్ 25న తెలుగులో రిలీజ్ అవుతోంది. శ్రీకాకుళం బ్యాక్ డ్రాప్ లో కామెడీ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ గా ఈ మూవీ ఉండబోతోంది. కిచ్చా సుదీప్ హీరోగా కన్నడంలో తెరకెక్కిన ‘మ్యాక్స్’ మూవీ డిసెంబర్ 27న తెలుగు ప్రేక్షకుల ముందుకొస్తోంది. పవర్ ఫుల్ యాక్షన్ ప్యాక్డ్ చిత్రంగా ఈ సినిమా తెరకెక్కింది.

హిందీలో వరుణ్ ధావన్, కీర్తి సురేష్ జోడీగా తెరకెక్కిన ‘బేబీ జాన్’ డిసెంబర్ 25న థియేటర్స్ లోకి వస్తోంది. ఈ సినిమాపై బాలీవుడ్ లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. థియేటర్స్ లో రిలీజ్ అవుతోన్న ఈ సినిమాలతో పాటు ఓటీటీలో కూడా సినిమాలు, వెబ్ సిరీస్ లు ఈవారం గట్టిగానే ప్రేక్షకుల ముందుకొస్తున్నాయి. అవేంటో ఓ సారి చూసుకుంటే

అమెజాన్‌ ప్రైమ్‌

సింగం అగైన్‌ (హిందీ మూవీ) - డిసెంబరు 27

థానర (మలయాళం మూవీ) - డిసెంబరు 27

నెట్‌ఫ్లిక్స్‌

ది ఫోర్జ్‌ (హాలీవుడ్‌ మూవీ) - డిసెంబరు 22

ఓరిజిన్‌ (హాలీవుడ్‌ మూవీ) - డిసెంబరు 25

స్క్విడ్ గేమ్ 2 (కొరియన్ సిరీస్) - డిసెంబర్ 26

సార్గవాసల్‌ (తమిళ) - డిసెంబరు 27

భూల్‌ భూలయ్య3 (హిందీ మూవీ) - డిసెంబరు 27

జీ5

ఖోజ్‌ (హిందీ) - డిసెంబరు 27

జియో సినిమా

డాక్టర్స్‌ (హిందీ సిరీస్‌) - డిసెంబరు 27

డిస్నీ+హాట్‌స్టార్‌

వాట్‌ ఇఫ్‌? 3 (యానిమేషన్‌ సిరీస్‌) - డిసెంబరు 22

డాక్టర్‌ వూ (హాలీవుడ్‌ మూవీ) - డిసెంబరు 26

మనోరమా మ్యాక్స్‌

ఐయామ్‌ కథలన్‌ (మలయాళం) - డిసెంబరు 25

పంచాయత్‌ జెట్టీ (మలయాళ చిత్రం) - డిసెంబరు 24

లయన్స్‌ గేట్‌ ప్లే

మదర్స్‌ ఇన్‌స్టింక్‌ (హాలీవుడ్‌) - డిసెంబరు 27

డిస్కవరీ ప్లస్‌

హ్యారీపోటర్‌ విజడ్జ్‌ ఆఫ్‌ బేకింగ్‌ (వెబ్‌సిరీస్‌) - డిసెంబరు 25

Tags:    

Similar News