అల్లు వారమ్మాయి చెస్ ఛాంపియన్ గా!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కుమార్తె అర్హ గురించి చెప్పాల్సిన పనిలేదు. బన్నీ-అర్హ బాండింగ్ గురించైతే ఎన్నోసార్లు ప్రూవ్ అయింది
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కుమార్తె అర్హ గురించి చెప్పాల్సిన పనిలేదు. బన్నీ-అర్హ బాండింగ్ గురించైతే ఎన్నోసార్లు ప్రూవ్ అయింది. కూతురు దగ్గరుంది అంటే? బన్నీ చిన్నపిల్లాడిగా మారిపోతాడు. అర్హతో కలిసి ఆడుకుంటాడు. సమయమే తెలియనంతగా కుమార్తె లోకంలో మునిగిపోతాడు. అర్హ నాన్న కూచీ అనడంలో సందేహమే లేదు. బన్నీ ఒక్కడే కాదు తాతయ్య అల్లు అరవింద్ అయినా..బాబాయ్ శిరీష్ తో అయినా అర్హ అంతే సరదాగా ఉంటుంది.
ఆ వీడియోలు అభిమానుల్ని ఎంతగానో అలరిస్తాయి. అర్హ గురించి అభిమానులకు ఇంతే తెలుసు. కానీ అర్హ ఎంత తెలివైన పిల్ల అన్నది తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. అవును అర్హకి చెస్ అంటే చాలి ఇష్టమట. నాలుగేళ్ల వయసు నుంచే చెల్ లో ట్రైనింగ్ తీసుకుంటుంది. తన ట్రైనింగ్ 50మందికి కూడా చెస్ నేర్పించిందిట. అందుకు గాను నోబెల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్స్డ్ లోనూ యంగెస్ట్ చెస్ ట్రైనర్ గా పేరు నమోదైంది అన్న సంగతి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఈ విషయాలన్నీ అర్హ స్వంయగా వెల్లడించింది. `అలా నమోదైన రోజు నాన్న ఆనందానికి అవుల్లేవ్ అంది. కుటుంబ సభ్యులంతా నన్ను వస పిట్ట అంటారు. నాన్న ఇంట్లో ఉంటే తనతో ఆడుకుంటా. పొట్లాడుతా.మాటలు సరిగ్గా రాక ముందే పొడుపు కథలు, సామెతలు చెప్పి తెలుగు స్పష్టంగా నేర్పించారు. శాకుంతలం డబ్బింగ్ చెప్పేటప్పుడు ఇబ్బంది ఎదురవ్వలేదు అంటే కారణం తెలుగు అంతలా నేర్చుకోవడం వల్లే.
ఆ సినిమా షూటింగ్ సమయంలో నాన్న ఎంతో ఇష్టపడి కొనుకున్న కార్వాన్ ని నా కోసం డైలీ షూటింగ్ కి పంపిచేవారు. ప్రతీ క్షణం నా గురించే ఆలోచిస్తారు. నాన్న లో నాకు బాగా నచ్చేది ఏంటంటే? ఎంత కష్టమైన పని అయినా చకా చకా పూర్తిచేసేస్తారు. తన నుంచి నేను నేర్చుకున్నది అదే` అని తెలిపింది.