బన్నీ ఓ మెట్టు ఎక్కేశాడు..!

అందుకే ఇప్పుడు పుష్ప సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో తన స్టామినా చూపిస్తున్నాడు.

Update: 2024-10-15 09:14 GMT

స్టార్ హీరోల్లో అల్లు అర్జున్ పంథా సెపరేట్ గా ఉంటుంది. నిర్మాత కొడుకుగా స్టార్ హీరోలతో సినిమాలు చేసే అవకాశం ఉన్నా తన సొంత టాలెంట్ ను నమ్ముకుని ఒళ్ళు హూనం చేసుకుని మరీ సినిమా సినిమాకు తన రేంజ్ పెంచుకుంటూ వచ్చాడు. అందుకే ఇప్పుడు పుష్ప సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో తన స్టామినా చూపిస్తున్నాడు. పుష్ప 2 కోసం తెలుగు ఆడియన్స్ తో ఈక్వల్ గా బీ టౌన్ ఆడియన్స్ ఎదురుచూస్తున్నారు అంటే అది వేరే లెవెల్ అని చెప్పొచ్చు.

ఇదిలాఉంటే తన సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా వేరే వాళ్ల సినిమాలను ఎంకరేజ్ చేయడంలో కూడా అల్లు అర్జున్ ముందుంటాడు. ఏదైనా ఒక సాంగ్ సూపర్ హిట్ అయినా.. ఒక సినిమా నచ్చినా సరే ఆ టీం కు తన తరపున విషెస్ అందిస్తాడు అల్లు అర్జున్. నాని చేస్తున్న ప్రతి సినిమాకు అల్లు అర్జున్ తన రివ్యూ ఇస్తూ అతని సక్సెస్ కు తన బూస్టింగ్ అందిస్తున్నాడు.

ఇక ఇప్పుడు యువ హీరో కిరణ్ అబ్బవరం కు తన సపోర్ట్ అందిస్తూ మరో మెట్టు ఎక్కేశాడు మన పుష్పరాజ్. యువ హీరోల్లో వెరైటీ సినిమాలు చేస్తూ తన టాలెంట్ చూపిస్తున్న కిరణ్ అబ్బవరం లేటెస్ట్ గా క అంటూ ఒక పాన్ ఇండియా అటెంప్ట్ చేస్తున్నాడు. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా అల్లు అర్జున్ చెప్పిన మాటలను గుర్తు చేసుకున్నాడు కిరణ్ అబ్బవరం. క సినిమా తొలి రోజు షూటింగ్ జరుగుతున్న టైం లోనే సారధి స్టూడియోస్ లో పుష్ప 2 షూటింగ్ జరుగుతుంది. అల్లు అర్జున్ మా సెట్స్ కు వచ్చి యూనిట్ కి తన విషెస్ అందించారు.

ఆయన నాతో కిరణ్ నువ్వు ఈసారి గట్టిగా కొట్టాలి అని అన్నారని చెప్పుకొచ్చారు. అల్లు అర్జున్ లాంటి పెద్ద స్టార్ వచ్చి తనని ఎంకరేజ్ చేయడం చాలా సంతోషంగా అనిపించిందని అన్నారు కిరణ్ అబ్బవరం. సినిమా తొలి రోజే కాదు చివరి రోజు షూటింగ్ టైం లో కూడా అల్లు అర్జున్ మా సెట్స్ కు వచ్చారని చెప్పారు కిరణ్ అబ్బవరం.

కేవలం తన సినిమా తానే అన్నట్టు కాకుండా ఇండస్ట్రీ బాగుండేలా యువ హీరోలను ఎంకరేజ్ చేసేలా మాట్లాడటం వారిని ప్రోత్సహించడం చూసి అల్లు అర్జున్ తో పాటు ఆయన ఫ్యాన్స్ కూడా ఖుషి అవుతున్నారు. కిరణ్ అబ్బవరం క సినిమా ఈ నెల 31న రిలీజ్ లాక్ చేశారు. తెలుగుతో పాటు పాన్ ఇండియా లెవెల్ లో ఈ సినిమా భారీగా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాను వంశీ నందిపాటి రిలీజ్ చేస్తున్నారు. మలయాళంలో క సినిమాను దుల్కర్ సల్మాన్ రిలీజ్ చేయడం విశేషం.

Tags:    

Similar News