నేను తగ్గేది లే - బన్నీ

ఇక సపోర్ట్ చేసిన విషయంలో అయితే బన్నీ 'తగ్గేదే లే' అన్నట్లు.. సంకేతాలు ఇస్తున్నట్లు ఓ వర్గం వారు మాట్లాడుకుంటున్నారు.

Update: 2024-08-22 04:44 GMT

అల్లు అర్జున్ ఎలాంటి స్పీచ్ ఇచ్చినా అందులో ఏదో ఒక విషయం హాట్ టాపిక్ అయ్యేలా ఉంటుంది. . పుష్ప 2 సినిమాతో చాలా బిజీగా ఉన్న బన్నీ నిన్న  మారుతీ నగర్ సుబ్రహ్మణ్యం అనే సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్నాడు. సుకుమార్ భార్య తబితా సమర్పకురాలిగా ఉండడంతో ఆమె పీలవగానే వేడుకకు హాజరయ్యారని బన్నీ తెలిపారు.

అయితే వేడుకలో బన్నీ చేసిన కొన్ని కామెంట్స్ మరింత హాట్ టాపిక్ గా మారాయి. ముందుగా తన ఫ్యాన్స్ పై ప్రేమను కురిపించేలా మాట్లాడిన బన్నీ ఆ తరువాత 'ఇష్టమైన వారిపై ప్రేమను చూపించాలి.. నాకు ఇష్టమైతే వస్తా.. నా మనసుకు నచ్చితే వస్తా.. అని అన్నాడు.' బన్నీ ఈ విధంగా మాట్లాడడంతో పొలిటికల్ హీట్ మళ్ళీ పెరిగినట్లు అనిపిస్తోంది.

బన్నీ మాట్లాడిన సందర్భం తబితా కోసమే అయినా ఇంతకుముందు వివాదంకు అర్థం చెబుతున్నట్లు ఉందని సోషల్ మీడియాలో టాక్ మొదలైంది. నా మనసుకు నచ్చితే వస్తా.. అనే లైన్ లో ఇప్పుడు శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి గురించే అనే చర్చ మొదలైంది. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సమయంలో అల్లు అర్జున్ మరియు జనసేన మద్దతుదారుల మధ్య వివాదం చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే.

ఎన్నికల ప్రచారంలో అల్లు అర్జున్ వైసీపీ అభ్యర్థి శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డిని మద్దతు ఇవ్వడం వివాదానికి కారణమైంది. ఈ చర్య జనసేన అభిమానులను, ప్రత్యేకంగా మెగా ఫ్యాన్స్ ను తీవ్రంగా నిరాశ పరిచింది. సోషల్ మీడియాలో ఈ ప్రచారం తర్వాత భారీ స్థాయిలో విమర్శలు వస్తూనే ఉన్నాయి. వీటికి సంబంధించిన మరో కీలక అంశం నాగబాబు చేసిన ఇన్ డైరెక్ట్ ట్వీట్. నాగబాబు చేసిన ఈ ట్వీట్ వివాదాన్ని మరింత పెంచింది, కానీ అది కొన్ని గంటల తర్వాత తొలగించారు.

అప్పటి నుంచి మెగా ఫ్యాన్స్, బన్నీ ఆర్మీ మధ్య వాగ్వాదం కొనసాగుతూనే ఉంది. పుష్ప 2 వాయిదా పడడానికి కూడా ఈ వివాదం ఒక కారణం అనేలా ఇండస్ట్రీలో టాక్ వచ్చింది. కానీ మేకర్స్ మాత్రం షూటింగ్ ఆలస్యం కావడం వల్లే అని చెప్పింది. ఇక అంత జరిగినా బన్నీ మాత్రం మౌనంగానే ఉన్నాడు. పైగా బన్నీ సపోర్ట్ ఇచ్చిన శిల్పా రవి ఓటమి చెందాడు. ఇక సపోర్ట్ చేసిన విషయంలో అయితే బన్నీ 'తగ్గేదే లే' అన్నట్లు.. సంకేతాలు ఇస్తున్నట్లు ఓ వర్గం వారు మాట్లాడుకుంటున్నారు.

అయితే ఈ విషయంలో బన్నీ భవిష్యత్తులో డైరెక్ట్ గా స్పందించాల్సిన పరిస్థితి తప్పకుండా ఎదురవుతుంది. పుష్ప 2 ప్రమోషన్ చేసే క్రమంలో పొలిటికల్ ప్రశ్నలు రాకుండా ఉండవు. ముందుగానే బన్నీ ఒక సంకేతం ఇచ్చినట్లు అనిపిస్తోంది. మరి ప్రమోషన్స్ సమయంలో ఈ వివాదంను బన్నీ ఎలా డీల్ చేస్తాడో చూడాలి.

Tags:    

Similar News