బాలీవుడ్ కు దగ్గరయ్యేలా బన్నీ పాత మాట

చాలా కాలంగా ఇండియన్ మూవీ ఇండస్ట్రీలో సౌత్ సినిమా, నార్త్ సినిమా అనే వేరియేషన్ ఉంది

Update: 2024-08-22 09:43 GMT

చాలా కాలంగా ఇండియన్ మూవీ ఇండస్ట్రీలో సౌత్ సినిమా, నార్త్ సినిమా అనే వేరియేషన్ ఉంది. నార్త్ వైపు బాలీవుడ్ ఉంటే సౌత్ వైపు తెలుగు, తమిళ్, మలయాళీ, కన్నడ భాష సినిమాలు ఉండేవి. సౌత్ సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చే మూవీస్ కి అటు వైపు నుంచి పెద్దగా గుర్తింపు లభించేది కాదు. కాని బాహుబలి తర్వాత ట్రెండ్ మారింది. సౌత్ సినిమాలు హిందీలో డబ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ అవుతున్నాయి. ముఖ్యంగా సౌత్ దర్శకులు చెప్పే కథలని నార్త్ ఇండియన్ ఆడియన్స్ చాలా ఇష్టపడి చూస్తున్నారు.

ఇదే సమయంలో బాలీవుడ్ సినిమాలకి నార్త్ లో ఆదరణ తగ్గింది. అక్కడ స్టార్ హీరోల సినిమాలు కూడా కమర్షియల్ గా డిజాస్టర్ అవుతున్నాయి. సౌత్ ఇండియన్ డైరెక్టర్స్ అందరూ కథలని మన మూలాలలోకి వెళ్లి చెబితే బాలీవుడ్ దర్శకులు మాత్రం పాశ్చాత్య ధోరణిలో, మోడ్రనైజ్ కథలని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అయితే సౌత్ సినిమాల ఆధిపత్యాన్ని బాలీవుడ్ స్టార్స్ అంత ఈజీగా అంగీకరించలేకపోతున్నారని సినీ విశ్లేషకులు అంటున్న మాట.

అందుకే అవకాశం దొరికిన ప్రతిసారి అక్కడ సెలబ్రిటీలు సౌత్ సినిమాలపై, అందులో క్యారెక్టర్స్ పైన విమర్శలు చేస్తూ ఉంటారనేది అభిప్రాయం చాలా మందిలో ఉంది. కొద్దిరోజుల క్రితం బాలీవుడ్ యాక్టర్ అర్షద్ వార్షి కల్కిలో ప్రభాస్ క్యారెక్టర్ జోకర్ లా ఉందంటూ విమర్శలు చేశారు. దీనిపై తెలుగు హీరోలు చాలా మంది రియాక్ట్ అయ్యారు. సిద్దు జొన్నలగడ్డ, నాని కామెంట్స్ వైరల్ అయ్యాయి. అలాగే నిర్మాత అభిషేక్ అగర్వాల్ కూడా అర్షద్ వార్షికి కౌంటర్ ఇచ్చారు.

రీసెంట్ గా కాంతారా హీరో, దర్శకుడు రిషబ్ శెట్టి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ బాలీవుడ్ సినిమాలు ఇండియాని తక్కువ చేసి, అవమానకరంగా చూపిస్తున్నాయని విమర్శలు చేశారు. భారతీయ సంస్కృతిని కించపరుస్తున్నాయని అన్నారు. ఈ వ్యాఖ్యలపై బాలీవుడ్ సినీ అభిమానులు రియాక్ట్ అయ్యి రిషబ్ శెట్టిపై విమర్శలు చేస్తున్నారు. ఈ వ్యవహారం ఇలా నడుస్తూ ఉంటే గతంలో అల్లు అర్జున్ బాలీవుడ్ పై చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి.

ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీ గడ్డు పరిస్థుతులు ఎదుర్కోవచ్చు కాని గత ఆరు దశాబ్దాలుగా ఇండియన్ సినిమా ఇండస్ట్రీకి హిందీ పరిశ్రమ ఎన్నో గొప్ప సినిమాలని అందించింది. కచ్చితంగా ఈ విషయంలో బాలీవుడ్ ని గౌరవించాల్సిందే అని గతంలో అన్నారు. ఈ వ్యాఖ్యలతో బాలీవుడ్ సినీ అభిమానుల మనషులని అల్లు అర్జున్ గెలుచుకున్నాడు. అతను నిజమైన పాన్ ఇండియా స్టార్ అంటూ సోషల్ మీడియాలో బాలీవుడ్ సినీ ప్రియులు కామెంట్స్ చేస్తున్నారు. రిషబ్ శెట్టి వ్యాఖ్యలతో కాంతారా2కి బాలీవుడ్ లో ఇంబ్బదులు ఎదురైనా అల్లు అర్జున్ మాత్రం పుష్ప 2తో అందరికి చేరువ అవుతాడని భావిస్తున్నారు.

Tags:    

Similar News