గ్యాప్ లో మరో డైరెక్టర్ తో బన్నీ

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 షూటింగ్ తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

Update: 2023-12-11 10:53 GMT

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 షూటింగ్ తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇటీవల హైదరాబాద్ లో ప్రత్యేక సెట్ లో జాతర సాంగ్ ని షూట్ చేశారు. ఇదిలా ఉంటే తాజాగా బన్నీ పుష్ప 2 షూటింగ్ పక్కన పెట్టి మరీ హరీశ్ శంకర్ డైరెక్షన్లో యాక్ట్ చేసేందుకు రెడీ అవ్వడం సర్వత్రా ఆసక్తికరంగా మారింది. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే..

హరిష్ శంకర్ డైరెక్షన్ లో అల్లు అర్జున్ తాజాగా ఓ యాడ్ షూట్ లో పాల్గొన్నారు. హైదరాబాద్లోని అన్నపూర్ణ స్టూడియోస్ లో ఈ యాడ్ షూట్ జరిగింది. అందుకు సంబంధించిన ఓ ఫోటో ఇప్పుడు నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. డైరెక్టర్ హరీష్ శంకర్ స్వయంగా ఈ ఫోటోను తన సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. దీంతో ఈసారి బన్నీ ఎలాంటి యాడ్ చేస్తున్నాడనే ఆసక్తి ఫ్యాన్స్ లో నెలకొంది. గతంలో హరిష్ శంకర్ దర్శకత్వంలో బన్నీ కొన్ని యాడ్స్ చేసిన విషయం తెలిసిందే.

ఇప్పటికే వీరి కాంబోలో వచ్చిన యాడ్స్ ఫ్యాన్స్ ని ఆకట్టుకున్నాయి. త్వరలోనే ఈ లేటెస్ట్ యాడ్ కి సంబంధించి పూర్తి వివరాలు బయటకు రానున్నాయి. ఇక అల్లు అర్జున్ సినిమాలు తో పాటు వరుస యాడ్స్ చేస్తున్న విషయం తెలిసిందే. టాలీవుడ్ లో మహేష్ బాబు తర్వాత ఎక్కువ వాణిజ్య ప్రకటనల్లో నటిస్తున్న హీరో బన్నీ కావడం విశేషం. ప్రతి యాడ్లో తన డిఫరెంట్ మేకవర్ తో ఆకట్టుకుంటున్న బన్నీ. ఈసారి ఎలాంటి లుక్ తో వస్తాడో చూడాలి.

కాగా హరీష్ శంకర్ దర్శకత్వంలో అల్లు అర్జున్ 'దువ్వాడ జగన్నాథం' అనే సినిమా చేసిన విషయం తెలిసిందే. భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా కమర్షియల్ గా సక్సెస్ సాధించలేకపోయింది. ప్రస్తుతం హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ తో 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి కొన్ని షెడ్యూల్ కంప్లీట్ చేశారు.

గత కొద్ది రోజులుగా పవన్ కళ్యాణ్ రాజకీయాలతో బిజీగా ఉండడంతో షూటింగ్ వాయిదా వేశారు. దీంతో ఈ గ్యాప్ లో హరీష్ శంకర్ బన్నీతో యాడ్ షూట్ చేయడం గమనార్హం. ఇక 'పుష్ప2' విషయానికొస్తే.. డిసెంబర్ 13 నుంచి కొత్త షెడ్యూల్ ని మొదలు పెట్టబోతున్నారు. ఈ షెడ్యూల్లోనే రష్మిక మందన షూటింగ్లో జాయిన్ కానుంది. ఇందులో బన్నీ రష్మికలపై పలు కీలక సన్నివేశాలను షూట్ చేయనున్నారు.

Tags:    

Similar News