పుష్ప 2 కోసం పవర్ స్టార్ ని తెస్తారా..?

ఐతే పుష్ప 2 సినిమాకు ఇప్పటివరకు ఉన్న బజ్ బాగానే ఉన్నా మెగా ఫ్యాన్స్ ఈ సినిమాకు సపోర్ట్ చేస్తారా అన్న డౌట్ కొడుతుంది.

Update: 2024-06-06 05:44 GMT

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 ఆగష్టు 15న రిలీజ్ లాక్ చేసిన విషయం తెలిసిందే. పుష్ప 1 తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఈ టీం పార్ట్ 2 తో అంతకుమించి అనిపించేలా చూస్తున్నారు. ఐతే పుష్ప 2 సినిమాకు ఇప్పటివరకు ఉన్న బజ్ బాగానే ఉన్నా మెగా ఫ్యాన్స్ ఈ సినిమాకు సపోర్ట్ చేస్తారా అన్న డౌట్ కొడుతుంది. మెగా ఫ్యామిలీ హీరో అయిన అల్లు అర్జున్ ఓ పక్క తన ఫుల్ సపోర్ట్ పవన్ కళ్యాణ్ కే అంటూ పవన్ గెలుపు కోసం ట్విట్టర్ లో కామెంట్ పెట్టినా తన ఫ్రెండ్ వేరే పార్టీ తరపున పోటీ చేస్తుంటే వెళ్లి అతనికి సపోర్ట్ చేశాడు. ఈ విషయంపై నాగ బాబు మనవాడు, పరాయివాడు అనే ట్వీట్ కూడా సంచలనం రేపిన విషయం తెలిసిందే.

అల్లు అర్జున్ చేసిన ఈ పని వల్ల మెగా పవర్ స్టార్ ఫ్యాన్స్ అంతా కూడా కాస్త అసంతృప్తిగా ఉన్నారు. అసలే ఏపీలో పవన్ గెలిచి ఫ్యాన్స్ అంతా ఒక రేంజ్ హంగామా చేస్తున్నారు. పుష్ప 2 సినిమా విషయంలో మెగా ఫ్యాన్స్ యాంటీ అవ్వకుండా చూడాలని చూస్తున్నారు. పవన్ గెలవగానే అల్లు అర్జున్ మళ్లీ ట్విట్టర్ లో విష్ చేసిన విషయం తెలిసిందే. అల్లు అర్జున్ చేసిన ఈ పనికి రివర్స్ కౌంటర్ ఇచ్చేలా పుష్ప 2 మీద చూపించాలని ఫిక్స్ అయ్యారు మెగా ఫ్యాన్స్. ఐతే ఇప్పుడు ఈ ఇష్యూపై అల్లు అరవింద్ రంగంలోకి దిగి సాల్వ్ చేసేలా చూస్తున్నారట.

అందుకే పుష్ప 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ కి పిఠాపురం ఎమ్మెల్యే అదే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని తీసుకు రావాలని చూస్తున్నారట. అల్లు అర్జున్ తన ఫ్రెండ్ కోసం నో చెప్పలేక నంద్యాల వెళ్లాడు కానీ అల్లు ఫ్యామిలీ సపోర్ట్ కూడా పవన్ కళ్యాణ్ కే ఉంది. ఇది మరింత బలంగా చెప్పేందుకే అల్లు అర్జున్ నుంచి మెగా ఫ్యాన్స్ ని వేరు చేయకుండా ఉండేందుకు పుష్ప 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ కి పవన్ కళ్యాణ్ ని తీసుకొచ్చేలా ప్లాన్ చేస్తున్నారట.

ఒకవేళ పవన్ కళ్యాణ్ ఏదైనా పని ఉండి రాకపోతే మెగాస్టార్ చిరంజీవిని ప్రీ రిలీజ్ ఈవెంట్ కి గెస్ట్ గా పిలుస్తారని తెలుస్తుంది. పవన్ వచ్చి అల్లు అర్జున్ కూడా మనోడే అని చెబితే ఇక ఈ ఇష్యూ అక్కడితో ఆగిపోతుంది. పవన్ కానీ చిరంజీవి కానీ రాకుండా బెట్టు చేస్తే మాత్రం పుష్ప 2 కి ఊహించని కష్టాలు మొదలైనట్టే లెక్క. మరి పుష్ప 2 సినిమా విషయంలో అల్లు మెగా ఫ్యామిలీల స్టెప్ ఎలా ఉంటుంది అన్నది చూడాలి.

Tags:    

Similar News