ఎంత ఇచ్చినా అల్లు అర్జున్ ఒప్పుకునేలా లేడు..
అల్లు అర్జున్ నటిస్తున్న "పుష్ప 2" సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతున్న సంగతి తెలిసిందే.
అల్లు అర్జున్ నటిస్తున్న "పుష్ప 2" సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రత్యేకంగా వేసిన సెట్ లో షూటింగ్ చేస్తున్నారు. సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాతో బాక్సాఫీస్ వద్ద 1000 కోట్ల టార్గెట్ ను వేగంగా టచ్ చేయాలని మేకర్స్ గట్టిగానే ప్లాన్ చేస్తున్నారు. ఇక బ్లాక్ బస్టర్ "పుష్ప" మొదటి భాగం ద్వారా అల్లుఅర్జున్ జాతీయ స్థాయిలో పాపులారిటీ పొందిన విషయం అందరికీ తెలిసిందే.
ఈ క్రేజ్ ను మరింత పెంచుతూ, "పుష్ప 2" కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను భారీ బడ్జెట్ తో గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. ఇప్పటికే రెండు సాంగ్స్ రిలీజ్ అయ్యాయి. ఇక త్వరలోనే మరో స్పెషల్ సాంగ్ రిలీజ్ చేయనున్నారు. "పుష్ప 2" చిత్రంను ఆగస్టు 15 న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన క్లైమాక్స్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.
సుకుమార్ ఈ సీక్వెల్ ను మొదటి భాగం కంటే మరింత భారీగా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో అల్లు అర్జున్ మరోసారి తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకోనున్నాడు. ఇక అల్లు అర్జున్ "పుష్ప" సినిమాకు గాను జాతీయ ఉత్తమ నటుడిగా నేషనల్ అవార్డు పొందిన విషయం తెలిసిందే. ఈ సినిమా ద్వారా ఆయన బాడీ లాంగ్వేజ్, నటన హిందీ ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకున్నాయి.
"పుష్ప 2" కోసం బాలీవుడ్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక అల్లు అర్జున్ కు వచ్చిన క్రేజ్ ను ఉపయోగించుకునేందుకు పలు వాణిజ్య సంస్థలు భారీగా ఆఫర్స్ చేస్తున్నాయి. ఇదివరకే కొన్ని హై లెవెల్ ఆఫర్స్ రాగా వాటిలో కొన్నింటిని బన్నీ రిజెక్ట్ చేశాడు. తాజాగా అల్లు అర్జున్ ఒక యాడ్ ఆఫర్ ను తిరస్కరించినట్లు సమాచారం.
ఆ యాడ్ టుబాకో ఉత్పత్తికి సంబంధించినదని తెలిసి, అల్లు అర్జున్ 10 కోట్లు ఆఫర్ వచ్చినా కూడా ఒప్పుకోలేదని సమాచారం. మొత్తానికి, అల్లు అర్జున్ తగిన జాగ్రత్తలు తీసుకుంటూ, తన ఇమేజ్ కు ఏ మాత్రం హాని కలిగించకుండా ముందుకు సాగుతున్నారు. ఇంతకుముందు కూడా ఒక పాన్ మసాలా యాడ్ లో నటించేందుకు ఆఫర్ రాగా బన్నీ దాన్ని రిజెక్ట్ చేశాడు. ఇక ఇప్పుడు అంతకంటే ఎక్కువ ఆఫర్ ఇచ్చినా కూడా ఒప్పుకోలేదు. దీన్ని బట్టి బన్నీ ఏ తరహాలో అడుగులు వేస్తున్నాడో అర్థం చేసుకోవచ్చు.