ధాబాలో బన్నీ ఫ్యామిలీ లంచ్!
షూటింగ్ కోసం వెళ్తోన్న సమయంలో ఆన్ ది వేలో రోడ్డు పక్కనే ఉన్న చిన్న హోటల్ లో మార్నింగ్ బ్రేక్ పాస్ట్ చేసారు.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సింప్లిసిటీ గురించి చెప్పాల్సిన పనిలేదు. చూడటానికి స్టైలిష్ గా ఉంటాడు కానీ బన్నీ జీవితం మాత్రం ఎంతో నిరాడంబరంగా ఉంటుంది. సెట్స్ కి వెళ్లాలన్నా..బయట తిరగలన్నా ఖరీదైన లగ్జరీ కార్లే అవసరం లేదు. ఆ సమయంలో ఏకారు అందుబాటులో ఉంటే అదే కారులు వెళ్లిపోతారు. `పుష్ప` షూటింగ్ సమయంలో బన్నీ నిరాడంబరత గురించి అందరికీ తెలిసింది. షూటింగ్ కోసం వెళ్తోన్న సమయంలో ఆన్ ది వేలో రోడ్డు పక్కనే ఉన్న చిన్న హోటల్ లో మార్నింగ్ బ్రేక్ పాస్ట్ చేసారు.
ఆ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. అప్పుడే బన్నీ ఇంత సింపుల్ గా ఉంటాడా? అన్న సంగతి అందరికీ అర్దమైంది. అప్పటి నుంచి బన్నీ అంటే అభిమానుల్లో అభిమానం రెట్టింపు అయింది. తాజాగా బన్నీ నిరాడంబరత మరోసారి బయట పడింది. భార్య స్నేహతో కలిసి రోడ్డు పక్కన ఉనన ధాబాలో భోజనం చేస్తోన్న కొన్ని ఫోటోలు నెట్టింట వైరల్ అయ్యాయి. ఇటీవలే ఇద్దరు కలిసి నంద్యాల వెళ్లిన సంగతి తెలిసిందే.
ఆ సమయంలో తిరుగు ప్రయాణంలో భాగంగా ఇద్దరు కలిసి ధాబా వద్ద ఆగి అక్కడ పుడ్ రుచి చూసినట్లు వినిపి స్తుంది. వారిద్దరు భోజనం చేస్తోన్న సమయంలో ధాబా ఖాళీగా ఉంది. బన్నీ..స్నేహ రావడంతో వాళ్లకి అసౌకర్యం కలగకుండా హోటల్ సిబ్బంది తగు జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. మరోసారి అభిమానులు బన్నీ సింప్లిసిటీ చూసి ఆశ్చర్యపోతున్నారు. అంత పెద్ద స్టార్ అయినా తనకేలాంటి భేషజాలం లేకుండా ఉండటం గ్రేట్ అంటూ పొగిడేస్తున్నారు. అయితే ఈ విషయాన్ని బన్నీ సన్నిహిత వర్గాలు ధృవీకరించాల్సి ఉంది.
ప్రస్తుతం అల్లు అర్జున్ `పుష్ప-2` లో నటిస్తోన్న సంగతి తెలిసిందే. సుకుమార్ దర్శకత్వం వహిస్తోన్న చిత్రం షూటింగ్ శర వేగంగా జరుగుతోంది. మరో నెల రోజుల్లో షూటింగ్ పూర్తవుతుందని సమాచారం. మరో వైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా అంతే వేగంగా పూర్తి చేయాలని యూనిట్ సన్నాహాలు చేస్తోంది. అన్ని పనులు పూర్తి చేసి ఆగస్ట్ 15 న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని సన్నాహాలు చేస్తున్నారు.