న‌టాషాతో బ్రేక‌ప్ కార‌ణం చెప్పిన‌ మాజీ ప్రియుడు

బుల్లితెర ప్ర‌ముఖుడు అలీ గోని - నటాసా స్టాంకోవిక్ డేటింగ్ చేశారన్నది ప‌రిశ్ర‌మ‌లో రహస్యం కాదు.

Update: 2024-08-29 14:30 GMT

బుల్లితెర ప్ర‌ముఖుడు అలీ గోని - నటాసా స్టాంకోవిక్ డేటింగ్ చేశారన్నది ప‌రిశ్ర‌మ‌లో రహస్యం కాదు. వారు `నాచ్ బలియే` 9వ సీజన్‌లో కూడా కలిసి కనిపించారు. కానీ షో ముగిసిన వెంటనే విడిపోయారు. అసలు వారు ఎందుకు విడిపోయారో ఎవరికీ తెలియదు... కానీ ఇంత‌కాలానికి అలీ చివరకు దాని గురించి పెద్ద హింట్ ఇచ్చేసాడు.

భారతీ సింగ్ - హర్ష్ లింబాచియా పోడ్‌కాస్ట్‌లో అలీ గోని ఈ హింట్ ఇవ్వ‌డం చ‌ర్చనీయాంశ‌మైంది. అలీగోని నిజానికి నటాషా పేరు రివీల్ చేయ‌నప్పటికీ ఆమె తన కుటుంబంతో కలిసి జీవించకూడదనుకోవడం వల్ల తాము విడిపోయామ‌ని పేర్కొన్నాడు. నా మునుపటి రిలేష‌న్‌షిప్ చాలా సీరియస్ గా సాగింది.. కానీ మేం విడిపోవడానికి కారణం .. మ‌నం విడిగా జీవిస్తాం! అని ఆమె చెప్పింది.. కానీ నేను దానికి అంగీకరించలేదు! అని అలీ గోనీ త‌న ప్రియురాలు న‌టాషా స్టాంకోవిక్ గురించి మ‌న‌సు విప్పి మాట్లాడాడు.

ప్రస్తుతం `లాఫ్టర్ చెఫ్స్‌` షోలో కనిపిస్తున్న అలీ గోని తాను ఫ్యామిలీ మ్యాన్‌ని అని కుటుంబం నుంచి దూరంగా, విడిగా జీవించడం ఇష్టం లేదని పేర్కొన్నాడు. నేను ఎక్కడికి వెళ్లినా నా కుటుంబాన్ని తీసుకెళ్తాను. నేను నా కుటుంబం నుండి విడిపోలేను. నేను వారిని విడిచిపెట్టలేను.. ఏది వచ్చినా రాక‌పోయినా..! అని వ్యాఖ్యానించారు.

అలీ గోని ప్రస్తుతం జాస్మిన్ భాసిన్‌తో రిలేష‌న్‌లో ఉండగా, నటాసా స్టాంకోవిచ్ ఇటీవల తన క్రికెటర్ భర్త హార్దిక్ పాండ్యా నుండి విడిపోయింది. మే 2020లో పెళ్లి చేసుకున్న వీరిద్దరూ ఫిబ్రవరి 2023లో హిందూ క్రిస్టియన్ ఆచారాల ప్రకారం తమ వివాహ ప్రమాణాలను పునరుద్ధరించుకున్నారు. జూలై 2024లో తమ విడిపోవడాన్ని ధృవీకరించారు. వారు తమ కుమారుడు అగస్త్య సహ-తల్లిదండ్రులుగా కొనసాగుతామ‌ని తెలిపారు. పాండ్యా నుంచి విడిపోయిన తరువాత నటాషా తన 4 ఏళ్ల కుమారుడు అగస్త్యతో కలిసి తన స్వస్థలమైన సెర్బియాకు వెళ్లింది. మరోవైపు హార్దిక్ గాయని జాస్మిన్ వాలియాతో డేటింగ్ చేస్తున్నట్లు పుకార్లు వచ్చాయి.

Tags:    

Similar News