మాజీ భర్తపైనేనా అమలాపాల్ సెటైర్!?
మాజీ భర్త విజయ్ ని ఉద్దేశించే అమలాపాల్ ఆ పోస్ట్ పెట్టినట్లు ఉందని నెటి జనులు అభిప్రాయపడుతున్నారు.
కోలీవుడ్ డైరెక్టర్ ఏ.ఎల్ విజయ్- నటి అమలాపాల్ ప్రేమించి పెళ్లి చేసుకోవడం విడిపోవడం కూడా జరిగిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఎవరి జీవితాలు వారివి. ఎవరి పనుల్లో వారు బిజీ అయ్యారు. విజయ్ దర్శకుడిగా బిజీ అయితే అమలాపాల్ కొత్త అవకాశాల కోసం వేట సాగించి ముందుకెళ్లింది. ఈ క్రమంలోనే విజయ్ చెన్నైలో వైద్యురాలు ఐశ్వర్యని రెండవ వివాహం చేసుకున్నాడు. అటుపై కొంత కాలానికి అమలాపాల్ కూడా వ్యాపార వేత్త జగత్ దేశాయ్ ని వివాహం చేసుకుంది.
ప్రస్తుతం మాజీలిద్దరు ఎవరి వృత్తి-వ్యక్తిగత జీవితాల్లో సంతోషంగా ఉన్నారు. అయితే తాజాగా అమలాపాల్ చేసిన ఓ కామెంట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. గతంలో నా జీవితంలో కొన్ని తప్పులు జరిగాయి. కానీ వాటికి ఇప్పుడు థాంక్స్ చెబుతున్నా. ఎందుకంటే? ఆ తప్పులు జరగడం వల్లే నా జీవితంలోకి మరొకరు వచ్చారు. ఇక్కడ సేఫ్ గా ఉన్నాను' అని పోస్ట్ పెట్టింది. ఇప్పుడిది వైరల్ గా మారింది. మాజీ భర్త విజయ్ ని ఉద్దేశించే అమలాపాల్ ఆ పోస్ట్ పెట్టినట్లు ఉందని నెటి జనులు అభిప్రాయపడుతున్నారు.
జరిగిన గతం మరువకుండా ఇప్పుడు గుర్తు చేసుకుని మళ్లీ ఇలా పోస్ట్ పెట్టడం వెనుక అర్దం అది కాక? ఇంకేముం టుందని పోస్టులు పెడుతున్నారు. గతాన్ని మర్చి వర్తమానంలో జీవించాలంటూ క్లాస్ పీకుతున్నారు. మరి వీటి గురించి అమ్మడు రిప్లై ఇస్తుందేమో చూడాలి. అమలపాల్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. ఇక్కడ రామ్ చరణ్, అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోలతోనూ నటించిన సంగతి తెలిసిందే.
అమలాపాల్ స్వస్థలం కేరళ. మాలీవుడ్ లోనే కెరీర్ ప్రారంభించింది. అటుపై తమిళ్ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. అక్కడ నుంచి టాలీవుడ్ కి వచ్చింది. ప్రస్తుతం సొంత భాషలోనే సినిమాలు చేస్తోంది. లెవల్ క్రాస్, దివిజ చిత్రాలు ఆన్ సెట్స్ లో ఉన్నాయి.