మండే ఎండలో దించింది.. హీరోయిన్ పై విమర్శలు

పైగా అక్కడ కింది స్థాయి టెక్నీషియన్స్ మరియు జూనియర్‌ యాక్టర్స్ కి చాలా అవమానాలు జరుగుతూ ఉంటాయి.

Update: 2024-06-28 11:30 GMT

సినిమా అనేది రంగుల ప్రపంచం. అక్కడ అనుకున్నంత సాఫీగా కింది స్థాయి వారి జీవితాలు సాగవు. వారు చేసే పనికి, తీసుకునే పారితోషికం కి సంబంధం ఉండదు అన్నట్లుగా పరిస్థితి ఉంటుంది. పైగా అక్కడ కింది స్థాయి టెక్నీషియన్స్ మరియు జూనియర్‌ యాక్టర్స్ కి చాలా అవమానాలు జరుగుతూ ఉంటాయి.

ఏ చిన్న తప్పు చేసినా కూడా అందరి ముందు తిట్టడం చేస్తారని, కొన్ని సార్లు చేయి కూడా చేసుకుంటారు అంటూ టెక్నీషియన్స్ ఎంతో మంది ఇంటర్వ్యూల్లో చెబుతూ ఉంటారు. తాజాగా హెయిర్‌ డ్రెస్సర్ కమ్‌ మేకప్ ఆర్టిస్ట్‌ అయిన హేమ తన కెరీర్‌ లో ఎదుర్కొన్న చేదు అనుభవాల గురించి ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.

చిన్న చిన్న టెక్నీషియన్స్‌ ఔట్‌ డోర్ షూటింగ్‌ సమయంలో చాలా ఇబ్బందులు పడుతారు. నేను ఒక సారి చెన్నైలో అమలాపాల్‌ నటిస్తున్న ఒక సినిమా షూటింగ్‌ కు వెళ్లాను. ఆ షూటింగ్‌ మండే ఎండలో జరుగుతుంది. కూర్చోవడానికి కనీసం చెట్టు కూడా లేదు. దాంతో నేను మరి కొందరు టెక్నీషియన్స్ కలిసి వ్యానిటీ వ్యాన్ లోకి ఎక్కాం.

ఆ వ్యాన్‌ లో రెండు భాగాలు ఉన్నాయి. ఒక భాగంలో హీరోయిన్‌ అమలా పాల్‌ కూర్చుని ఉన్నారు. రెండో భాగంలో నేను ఇంకొంత మంది ఉన్నారు. మేము కూర్చుంటే ఆమెకు ఇబ్బందిగా ఉందని, మేనేజర్‌ తో చెప్పి మమ్ములను వానిటీ వ్యాన్‌ నుంచి కిందకి దింపింది.

మండే ఎండలో ఎక్కడ నిలబడాలో కూడా తెలియక చాలా ఇబ్బంది పడ్డాం. సినిమా ఔట్‌ డోర్ షూటింగ్స్ కు వెళ్లినప్పుడు ఇలాంటివి చాలానే జరుగుతాయి. అన్ని సినిమాల్లో పని చేసే కింది స్థాయి టెక్నీషియన్స్ ను కూడా తక్కువగానే చూస్తారు అంటూ హేమ చెప్పుకొచ్చింది. హేమ వ్యాఖ్యలతో హీరోయిన్‌ అమలాపాల్‌ పై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

Tags:    

Similar News