సెల‌బ్రిటీ కిడ్స్ నుంచి అంబానీ స్కూల్ ఫీజుల రేంజ్

ఇషా అంబానీ నేతృత్వంలోని ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ (DAIS) ఇటీవ‌లే వార్షిక దినోత్సవం జరుపుకుంది.

Update: 2024-12-31 17:30 GMT

విద్య వ్యాపారంగా మారింద‌ని విమ‌ర్శ‌లున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో నారాయ‌ణ‌, శ్రీ‌చైత‌న్య స‌హా దేశంలోని చాలా ప్ర‌యివేట్ స్కూల్స్ దోచుకుంటున్నాయ‌ని విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి. అయితే వీట‌న్నిటికీ పెద్ద‌న్న‌గా చెప్పుకుంటున్న ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ (DAIS)లో ఫీజుల మాటేమిటీ? రిల‌య‌న్స్ అంబానీలు పిల్ల‌ల నుంచి అధిక‌మొత్తం ఫీజులు వ‌సూలు చేస్తున్నారా? అన్న‌ది ప‌రిశీలిస్తే....

ఇషా అంబానీ నేతృత్వంలోని ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ (DAIS) ఇటీవ‌లే వార్షిక దినోత్సవం జరుపుకుంది. అత్యంత వైభ‌వంగా జ‌రిగిన ఈ ఈవెంట్ కి చాలా మంది బాలీవుడ్ సెల‌బ్రిటీలు అటెండ‌య్యారు. వేడుక‌లో ఐశ్వ‌ర్యారాయ్- అభిషేక్, గౌరీఖాన్- షారూఖ్‌, మీరా క‌పూర్- షాహిద్, క‌రీనా క‌పూర్ - సైఫ్ ఖాన్ స‌హా చాలా మంది త‌ల్లులు క‌నిపించారు. జాన్వీ క‌పూర్, అన‌న్య పాండే, ఖుషి క‌పూర్ స‌హా చాలా మంది స్టార్ కిడ్స్ ఈ వేదిక వ‌ద్ద అల‌రించారు. ఈవెంట్ నుండి వీడియో క్లిప్‌లు, ఫోటోలు ఇప్ప‌టికే వెబ్ లో వైర‌ల్ అయ్యాయి. అయితే ముంబైలోని ప్రతిష్టాత్మక అంబానీ పాఠశాల నెలకు ఎంత వసూలు చేస్తుందో తెలుసా?

DAISను రిలయన్స్ గ్రూప్‌కు చెందిన నీతా ముఖేష్ అంబానీ 2003లో ప్రపంచ స్థాయి విద్యా అవకాశాలను అందించే ఉద్దేశ్యంతో స్థాపించారు. ఈ స్కూల్ లో అంత‌ర్జాతీయ స్టాండార్డ్ తో స్ట‌డీ ఉంటుంద‌ని ప్ర‌చారం ఉంది. పాఠశాల కిండర్ గార్టెన్ నుండి 12వ తరగతి వరకు ప్రపంచ స్థాయి విద్యను అందిస్తుంది. ఇది ICSE, IGCSE, IBDP ప్రోగ్రామ్‌లను కూడా అందిస్తుంది. కిండర్ గార్టెన్ నుండి 12వ తరగతి వరకు ఫీజులు వివిధ స్థాయిల్లో చూస్తే సుమారు 14ల‌క్ష‌ల నుంచి 20ల‌క్ష‌ల వ‌ర‌కూ ఉన్నాయి.

ఈ పాఠశాల కౌన్సిల్ ఫర్ ది ఇండియన్ స్కూల్ సర్టిఫికేట్ ఎగ్జామినేషన్స్ (సిఐఎస్‌సిఇ) .. కేంబ్రిడ్జ్ అసెస్‌మెంట్ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ (సిఎఐఇ)కి అనుబంధంగా ఉంది. ఇండియన్ సర్టిఫికేట్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (ఐసిఎస్‌ఇ), ఇంటర్నేషనల్ జనరల్ సర్టిఫికేట్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (ఐజిసిఎస్‌ఇ) స్థాయిలో 10వ తరగతి పరీక్షలకు విద్యార్థులను సిద్ధం చేస్తుంది. ఇంట‌ర్ లో 11 , 12వ తరగతికి IB డిప్లొమా ప్రోగ్రామ్‌ను అందించడానికి పాఠశాల IB (ఇంటర్నేషనల్ బాకలారియేట్) నుంచి అధికార హోదాను పొందింది. విద్యాప్ర‌మాణాల‌కు త‌గ్గ‌ట్టే ఖ‌ర్చు ఎక్కువ‌. కిండర్ గార్టెన్ నుండి 12వ తరగతి వరకు ఖరీదైన ఫీజుల‌ను అంబానీ స్కూల్ వ‌సూలు చేస్తుంది.

ప్ర‌ఖ్యాత టైమ్స్ క‌థ‌నం ప్రకారం.. 2023-2024 విద్యా సంవత్సరానికి స్కూల్ ఫీజు , ట్యూషన్ ఫీజు కిండర్ గార్టెన్‌కు రూ. 14,00,000 నుండి గ్రేడ్ 12కి రూ. 2,000,000 వరకు ఉంటుంది. ట్యూషన్ ఫీజులో యూనిఫాం పుస్తకాలు, స్టేషనరీ ఖర్చులు ఉంటాయి. రవాణా, ఇతర సౌకర్యాలు కూడా ఇందులో వ‌ర్తిస్తాయి. DAIS త‌మ విద్యార్థుల‌కు స్కాలర్‌షిప్‌లు, ఇత‌ర‌ ఆర్థిక సహాయాన్ని కూడా అందజేస్తుంది. అర్హులైన విద్యార్థులు ఈ స్కూల్ లో అత్యుత్తమ విద్యా అవకాశాలను పొందే అవ‌కాశం ఉంది.

అంబానీ పాఠశాలలో అత్యంత‌ ధనిక కుటుంబాల పిల్ల‌లు, ప్రభావవంతమైన సెల‌బ్రిటీ కుటుంబాలకు చెందిన పిల్లలు చేరుతుంటారు. షారుఖ్ ఖాన్- గౌరీ ఖాన్ కుమారుడు అబ్రామ్ , సైఫ్ అలీ ఖాన్ - కరీనా కపూర్ ఖాన్ కుమారులు తైమూర్ అలీ ఖాన్ , జెహ్ అలీ ఖాన్, ఐశ్వర్యరాయ్- అభిషేక్ బచ్చన్ కుమార్తె ఆరాధ్య బచ్చన్ రిలయన్స్ గ్రూప్‌లో చదువుతున్న స్టార్ కిడ్స్‌లో ఉన్నారు. సుహానా ఖాన్, ఖుషీ కపూర్, ఇబ్రహీం అలీ ఖాన్, ఆర్యన్ ఖాన్, సారా టెండూల్కర్, నైసా దేవగన్, అనన్య పాండే కూడా డిఐఎఎస్ లో చదువుకున్నారు. పాఠశాల డ‌యాస్పోరా పేరుతో పూర్వ విద్యార్థుల సమావేశాల‌కు వీరంతా అటెండ‌వుతుంటారు.

Tags:    

Similar News