అంబానీ బ్రాండ్ ఆ బ్యాండ్ తోనా?
వాళ్ల కోసం అక్కడ ఏర్పాటు చేసిన బస దగ్గర నుంచి తినే ఆహారం వరకూ ఎంటర్ టైన్ మెంట్ ప్రతీది ఎంతో ప్రత్యేకంగా ప్లాన్ చేసి ప్రపంచమే మాట్లాడుకునేంత గొప్పగా చేసారు.
అనంత్ అంబానీ-రాధికా మర్చట్ మూడు రోజుల ప్రీవెడ్డింగ్ వేడుక ఘనంగా ముగిసిన సంగతి తెలిసిందే. ఈ వేడుకకు ప్రపంచ కుబేరులతో పాటు సినీ..రాజకీయ ప్రముఖులు ఎంతో మంది పాల్గొన్నారు. బాలీవుడ్ నుంచి టాలీవుడ్ నుంచి సైతం ఎంతో మంది మంది సెలబ్రిటీలు హాజరయ్యారు. మూడు రోజుల వేడు కను అంతా బాగా ఎంజాయ్ చేసారు. మునుపెన్నడు చూడని ఓ కొత్త అనుభవాన్ని అంబానీ ఫ్యామిలీ అతిధులకు అందించింది. వాళ్ల కోసం అక్కడ ఏర్పాటు చేసిన బస దగ్గర నుంచి తినే ఆహారం వరకూ ఎంటర్ టైన్ మెంట్ ప్రతీది ఎంతో ప్రత్యేకంగా ప్లాన్ చేసి ప్రపంచమే మాట్లాడుకునేంత గొప్పగా చేసారు.
జామ్ నగర్ అనే చిన్న నగరం లోనే అప్పటికప్పుడు 5 స్టార్ హోటల్ రేంజ్ లో గుడారాలను ఏర్పాటు చేసి అతిధులు ఎక్కడా అసౌకర్యా నికి గురి కాకుండా ఓ కొత్త నేచురల్ అనుభవాన్ని అందించారు. ఇదంతా ఎంతో ప్రీ ప్లాన్ డ్ గా నీతా అంబానీ ప్లాన్ చేయడంతోనే సాధ్యమైంది. ఇక ఈ వేడుకకు వచ్చిన అతిధుల్లో కొందరికి మణికట్టుపై ఓ బ్యాండ్ కామన్ గా కనిపించింది. అందరూ లోపలికి ప్రవేశించిన అనంతరం ఓ ఐడెంటిటీగా ఈ బ్యాండ్ చేతికి వేసారు.
కరీనా కపూర్..స్మృతి ఇరానీ బ్యాండ్ ధరించిన ఫోటోలు కొన్ని లీక్ అవ్వడంతోనే ఈ సంగతి బయటకు పొక్కింది. మరి ఈ బ్యాండ్ వేడుకకు విచ్చేసిన అతిధులందరికీ వేసారా? లేక కొందరికే వేసారా? అన్నది తెలియాలి. ఏది ఏమైనా ఈ బ్యాండ్ తో అంబానీ ఇంట అతిధి అయినా..వ్యక్తి అయినా సరే తమ రూల్స్ పాటించా ల్సిందే అన్న విషయం స్పష్టమవుతుంది. సాధారణంగా ఇలాంటి వేడుకల్లో ఎలాంటి బ్యాండ్లు వేయరు. పబ్ ల్లో కి వెళ్లే ముందు చేతిపై గుర్తుగా ఎంట్రీ గేట్ వద్ద సీల్ వేస్తుంటారు.
అనంతరం లోపలికి పంపిస్తుంటారు. మరి ఈ బ్యాండ్ వెనుక అలాంటి విషయం ఏదైనా ఉందా? అన్నది తెలియాలి. మరి ఆ బ్యాండ్ తో పాటు అందుఓ అంబానీ రేంజ్ ఇది అని ఏమైనా డైమండ్ లాంటి గిప్ట్ తో సర్ ప్రైజ్ చేసారేమో చూడాలి.