బంగారం..వెండితో అంబానీ ఇంట పెళ్లి కార్డు!
దేశ చరిత్రలోనే నిలిచిపోయే గొప్ప పెళ్లిగా ఖ్యాతి కెక్కబోతుంది.
అంబానీ ఇంట ప్రీవెడ్డింగ్ వేడుకలు ఏ రేంజ్ లో జరిగియో తెలిసిందే. ఇండియాలో అయితే నేమీ... విదేశా ల్లో అయితే నేమీ ఎక్కడైనా నా బ్రాండ్ ఉండాల్సిందేని అంబానీ మరోసారి ప్రూవ్ చేసారు. జులై 12న జరిగే వివాహానికి ముంభై అంగరంగ వైభవంగా ముస్తాబవుతుంది. దేశ చరిత్రలోనే నిలిచిపోయే గొప్ప పెళ్లిగా ఖ్యాతి కెక్కబోతుంది. తాజాగా వివాహా ఆహ్వాన పత్రిక చూస్తే స్టన్ అవ్వాల్సిందే.
పెళ్లికి ముందు వెడ్డింగ్ కార్డే చరిత్రని రాసేసింది. ప్రస్తుతం ఆ వెడ్డింగ్ కార్డు నెట్టింట వైరల్ అవుతుంది. వెడ్డింగ్ కార్డుని ఇలా కూడా ఇస్తారా? అని అంతా ఆశ్చర్యపోవాల్సిన పరిస్థితి. దాని ధర అక్షరాలా రూ. 6.5 లక్షలు. వెడ్డింగ్ కార్డుని బంగారం- వెండి తో తయారు చేసారు. వెండితో చేసిన చిన్న గుడి లాంటి పెట్టె. పెట్టె తెరవగానే బ్యాక్ గ్రౌండ్‌లో హిందీలో విష్ణు సహస్రనామం వినిపిస్తోంది. పెట్టె లోపల 24 క్యారెట్‌ల బంగారు విగ్రహాలు ఉన్నాయి.
వెండి కార్డు బ్యాక్ గ్రౌండ్‌లో మంత్రాలు ప్లే చేయబడిన పురాతన దేవాలయం ప్రధాన ద్వారంలా కనిపిస్తుంది. కార్డులో మొదట గణేష్, విష్ణువు, లక్ష్మీదేవి, రాధా-కృష్ణ, దుర్గాదేవి వంటి అనేక హిందూ దేవతల బంగారు చిత్రాలు ఉన్నాయి.పెట్టెను తెరిచినప్పుడు, దానిలో ఓం అని ఎంబ్రాయిడ్ చేయబడిన ఒక శాలువ, నెట్ హాంకీ ఉన్నాయి. ఆ పెట్టెలో బంగారంతో అలంకరించబడిన వివిధ హిందూ విగ్రహాలు కూడా ఉన్నాయి.
ఆహ్వాన పత్రిక ఇలా ఉండటం చూసి అంతా స్టన్ అయిపోతున్నారు. అంబానీ తన స్థాయికి ఏమాత్రం తగ్గకుండా ఆహ్వాన పత్రిక ఉందంటూ నెట్టింట నెటి జనులు కామెంట్లు పెడుతున్నారు. ఈ వెడ్డింగ్ కార్డులను వీవీఐపీలకు అంబానీ కుటుంబం స్వయంగా అందజేసింది. వీటిలో చాలా కార్డులను పెళ్లి కుమారుడు అనంత అంబానీ స్వయంగా అందించాడు. గతంలో అంబానీ కుమార్తె ఇషా అంబానీ వెడ్డింగ్ కార్డుకి కూడా మూడు లక్షలు ఖర్చు చేసారు.