అమీర్ ఖాన్ కుమార్తె ఎంగేజ్ మెంట్..పెళ్లి తేదిలివే

దీంతో న‌వంబ‌ర్ 18న నిశ్చితార్దం.. వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి 3న పెళ్లి చేయ‌బోతున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

Update: 2023-10-11 12:14 GMT

మిస్ట‌ర్ ప‌ర్పెక్ట్ నిస్ట్ అమీర్ ఖాన్ ఇంట పెళ్లి భాజాలు మ్రోగ‌నున్నాయా? కుమార్తె ఐరాఖాన్ పెళ్లి తేది..నిశ్చితార్దం తేదీ ఫిక్సైందా? అంటే అవున‌నే తెలుస్తోంది. ఈ విష‌యాన్ని స్వ‌యంగా అమీర్ ఖాన్ వెల్ల‌డించారు. ఐరాఖాన్- నుపుర్ శిఖ‌రే కొంత కాలంగా ప్రేమించుకుంటోన్న సంగ‌తి తెలిసిందే. నుపుర్ సెల‌బ్రిటీ ఫిట్నెస్ ట్రైన‌ర్. ఐరాఖాన్ కి కూడా అలాగే ప‌రిచ‌యం. అలా మొద‌లైన ప‌రిచ‌యం..స్నేహం...ఆ త‌ర్వాత ప్రేమ‌గా మారాయి.

ఈ విష‌యాన్ని ఐరాఖాన్ త‌ల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లింది. అందుకు వాళ్లు అంగీక‌రించారు. ఫిట్నెస్ ట్రైన‌ర్ అయినా కుమార్తె ప్రేమ‌కి అది ఎలాంటి అడ్డంకి కాద‌ని భావించి స్టార్ హీరో అమీర్ ఖాన్ ముందుకెళ్తున్నారు. ఈ నేప‌థ్యంలో ప్రేమికులిద్ద‌రు వీలైనంత త్వ‌ర‌గా పెళ్లి చేయాల‌ని అమీర్ భావిస్తున్నారు. దీంతో న‌వంబ‌ర్ 18న నిశ్చితార్దం.. వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి 3న పెళ్లి చేయ‌బోతున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

ఈ విష‌యాన్ని అమీర్ ఖాన్ స్వ‌యంగా మీడియాకి తెలిపారు. ఐరాఖాన్ డిప్రెష‌న్ లో ఉన్న‌ప్పుడు నుపుర్ ఎంతో స‌హాయం చేసాడ‌ని...అన్ని ర‌కాలుగా ఐరాఖాన్ కి అత‌డు స‌రితూగు తాడ‌ని...జీవితాంతం ఆమెని బాగా చూసుకుంటాడు అన్న న‌మ్మ‌కం తో ఇరుకుటుంబ స‌భ్యులు ముందు కెళ్తున్న‌ట్లు తెలిపారు. అమీర్ ఖాన్ ఇప్పుడు మామ‌గా మార‌పోతున్నారు. కుమార్తెను పుట్టినింటి నుంచి మెట్టి నింటికి పంపించ‌బో తున్నారు.

ఐరాఖాన్ అంటే అమీర్ కి ఎంతో ఇష్టం. ఖాళీ స‌మ‌యం దొరికితే ఐరాఖాన్ తోనే స‌మ‌యాన్ని ఎక్కువ‌గా గ‌డుపుతారు. కుమార్తెతో క‌లిసి వెకేష‌న్ల‌కు వెళ్తారు. అమీర్‌ఖాన్ మాజీ భార్య రీనా ద‌త్తాకు ఐరాఖాన్ జ‌న్మించారు. రీనా-అమీర్ భార్య‌భ‌ర్త‌లుగా విడిపోయిన ఐరాఖాన్ కోసం స్నేహితులుగా అప్పుడ‌ప్పుడు క‌లుస్తుంటారు. తాజాగా కుమార్తె పెళ్లి మాజీ భార్య‌భ‌ర్త చేతుల మీదుగా జ‌ర‌గ‌బోతుంది.

Tags:    

Similar News