ప్రీ వెడ్డింగ్ వేడుకపై లెజెండ్ మనసులో మాట!
ఓ కొత్త వాతావ రణాన్ని ఏర్పాటు చేసి...మునుపెన్నడు చూడని సరికొత్త రుచుల్ని పరిచయం చేసారు
అంబానీ ఇంట ప్రీ వెడ్డింగ్ వేడుక ఏ రేంజ్ లో జరిగిందో తెలిసిందే. మూడు రోజుల పాటు విచ్చేసిన అతిరధ మహారధులందరికీ అంబానీ ఇంట వేడుక అంటే ఎలా ఉంటుందో చూపించారు. ఓ కొత్త వాతావ రణాన్ని ఏర్పాటు చేసి...మునుపెన్నడు చూడని సరికొత్త రుచుల్ని పరిచయం చేసారు. జామ్ నగర్ జామ్ అయ్యేలో వేడుక ఎంతో వైభవంగా జరిగింది. ప్రపంచ పారిశ్రామిక వేత్తలతో పాటు..సెలబ్రిటీలతో జామ్ నగర్ కి ఓ సరికొత్త కళ వచ్చేసింది.
పెళ్లి చేసుకుంటే ఈ రేంజ్ లో చేసుకోవాలని ప్రపంచానికే అంబానీ తొలసారి పరిచయం చేసాడు. ఇదే వేడుకకు బాలీవుడ్ దిగ్గజం అమితాబచ్చన్ కుటుంబంతో పాటు హజరయ్యారు. వేడుక ముగించుకుని తిరిగి ముంబైకి వెళ్తోన్న సందర్భంగా తన బ్లాగ్ లో ఆసక్తికర పోస్ట్ పెట్టారు. అట్టహాసంగా నిర్వహించిన వేడుకలతో పాటు..వంతారా ఏర్పాటు చేయాలన్న ఆలోచన ప్రశంసనీయం. ఈ వేడుకలో భాగమైనందుకు సంతోషంగా ఉంది.
వంతార సమగ్ర జంతు సంరక్షణ. పునరావాస కేంద్ర. గాయపడిన జంతువుల్ని కాపాడటం.. చికిత్స అందించి వాటికి పునరావాసం ఏర్పాటు చేయాలన్న ముఖ్య ఉద్దేశంతో ఏర్పాటు చేసారు. కృతిమ అడవిని ఏర్పాటు చేసి వన్యప్రాణుల్ని కాపాడాలన్నది మంచి ఆలోచన. మీరందరూ దీనిని సందర్శించాలి. ఇదో గొప్ప అనుభవం` అని రాసుకొచ్చారు. వంతారా అన్నది అనంత్ అంబానీ ఆలోచన. అనంత్ పెద్ద జంతు ప్రేమికుడు.
చిన్న నాటి నుంచి ఆసక్తి ఎక్కువే. ఈ నేపత్యంలో కుమారుడిపై ఇష్టంతో వంతారని అంబానీ ఏర్పాటు చే సారు. ఆ తర్వాత వంతార పనులన్నింటిని అనంత్ దగ్గరుండి చూసుకుంటున్నారు. అక్కడే ఉండటం అంటే అనంత్ అంబానీ ఎంతో ఇష్టం. జామ్ నగర్ లో ప్రీ వెడ్డింగ్ వేడుక కూడా చేయాలని అనంత్ అంబా నీ పట్టుబట్టడంతోనే అక్కడ నిర్వాహించారు. ఆ రకంగా ప్రపంచ దిగ్గజాల్ని అందర్నీ ఒకే చోటకి అంబానీ రప్పించారు. అదీ అంబానీ రేంజ్.