మెగాస్టార్‌ గురించి ఈ విషయాలు తెలుసా?

నేడు బాలీవుడ్‌ బిగ్‌ బి అమితాబ్‌ బచ్చన్‌ పుట్టిన రోజు. ఈ సందర్భంగా సోషల్‌ మీడియా మొత్తం ఆయనకు ప్రముఖుల నుంచి ఫ్యాన్స్ వరకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ సందడి చేస్తూ ఉన్నారు.

Update: 2024-10-11 07:44 GMT

బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌ ఎనిమిది పదుల వయసులోనూ వరుస సినిమాలు చేస్తూ ఉన్నారు. ఈ మధ్య కాలంలో సౌత్‌ సినిమాల్లోనూ నటిస్తున్న విషయం తెల్సిందే. తెలుగు లో ప్రభాస్ హీరోగా వచ్చిన కల్కి సినిమాలో అమితాబ్‌ బచ్చన్‌ పోషించిన పాత్రకు మంచి స్పందన వచ్చింది. ఇక రజినీకాంత్‌ నటించిన వేట్టయన్‌ సినిమాలోనూ మిస్టర్ బచ్చన్‌ కీలక పాత్రలో నటించారు. ముందు ముందు పలు సౌత్‌ సినిమాల్లో నటిస్తానంటూ ఆయన ఆ మధ్య ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. అమితాబచ్చన్‌ నటించిన ప్రతి సినిమాకు మినిమం గ్యారెంటీ అన్నట్లుగా పాజిటివ్‌ రెస్పాన్స్ వస్తూనే ఉంది.

నేడు బాలీవుడ్‌ బిగ్‌ బి అమితాబ్‌ బచ్చన్‌ పుట్టిన రోజు. ఈ సందర్భంగా సోషల్‌ మీడియా మొత్తం ఆయనకు ప్రముఖుల నుంచి ఫ్యాన్స్ వరకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ సందడి చేస్తూ ఉన్నారు. ఈ సమయంలో ఆయనతో అనుబంధం ఉన్న వారు, ఆయన ఇండస్ట్రీలో సాధించిన విజయాలను గురించి తెలిసిన వారు సోషల్‌ మీడియా ద్వారా పలు విషయాలను షేర్ చేయడం జరిగింది. కొందరు బచ్చన్‌ జీ కి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను షేర్ చేయడం జరిగింది. బాలీవుడ్‌ మెగాస్టార్‌ గా కీర్తించడబుతున్న అమితాబ్‌ బచ్చన్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు ఇప్పుడు చూద్దాం.

అమితాబ్‌ మొదటి సినిమా సౌత్‌ హిందూస్థానీ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ సినిమాతో ఏకంగా జాతీయ అవార్డును సొంతం చేసుకున్నారు. మొదటి సినిమా హిట్ అయినా ఆ తర్వాత నుంచి ఏకంగా 12 సినిమాలు బాక్సాఫీస్ వద్ద నిరాశ పరిచాయి. ఆయన కెరీర్ ఖతం అనుకుంటున్న సమయంలో హిట్‌ కొట్టి తిరిగి నిలదొక్కుకున్నారు.

జంజీర్ సినిమాతో బాలీవుడ్‌లో యాంగ్రీ యంగ్‌ మన్‌ ట్యాగ్‌ ను సొంతం చేసుకున్న అమితాబ్‌ ఆ సినిమా ఇచ్చిన బూస్ట్‌ తో వరుసగా యాక్షన్ సినిమాలను చేయడం మొదలు పెట్టారు. షోలే సినిమాతో బాలీవుడ్‌ లో అమితాబ్‌ నెం.1 స్థానకుం చేరి పోయారు. సుదీర్ఘమైన సినీ కెరీర్ ను ఆయన కొనసాగించడంలో జంజీర్‌, షోలే సినిమాలు కీలక పాత్ర పోషించాయి.

బాలీవుడ్‌ హీరోల్లో పలువురు హీరోలు డ్యుయెల్‌ రోల్‌ లో నటించారు. అయితే అమితాబ్‌ బచ్చన్ మాత్రం అందరి కంటే ఎక్కువ డ్యుయెల్‌ రోల్‌ సినిమాలు చేశారు. ఆయన డ్యుయెల్‌ రోల్‌ లో నటించిన మెజార్టీ సినిమాలు బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకోవడం జరిగింది.

అమితాబ్ గురించిన మరో ఆసక్తికర విషయం ఏంటంటే... విజయ్‌ అనే పాత్ర పేరుతో ఈయన ఏకంగా 20 సినిమాల్లో నటించారు. పాత్రకు ఆ పేరు కలిసి రావడంతో దర్శక నిర్మాతలు దాన్ని కొనసాగించారు. అమితాబ్ సైతం అందుకు ఓకే చెప్పారు. విజయ్ గా అమితాబ్‌ మొదట జంజీర్ సినిమాలో నటించి హిట్ కొట్టారు.

30 పాటలకు పైగా పాడిన అమితాబ్‌, ఇప్పటి వరకు దాదాపుగా 200 సినిమాలను వివిధ భాషల్లో చేశారు. హిందీతో పాటు తమిళ్‌, తెలుగు సినిమాల్లో నటించడం ద్వారా బాలీవుడ్‌ లో అత్యధిక భాషల్లో నటించిన స్టార్స్ జాబితాలో అమితాబ్‌ నిలిచారు.

అమితాబ్‌ కి కేంద్ర ప్రభుత్వం నుంచి ఇప్పటికే పద్మశ్రీ, పద్మ భూషన్‌, పద్మ విభూషన్‌, దాదా సాహెబ్ పాల్కే అవార్డులు దక్కాయి. ఎన్నో సార్లు జాతీయ స్థాయి ఉత్తమ నటుడి అవార్డును సొంతం చేసుకోవడంతో పాటు, నిర్మాతగా సైతం జాతీయ అవార్డును సొంతం చేసుకున్నారు.

అభిమానులతో పాటు ప్రతి ఒక్కరు అమితాబ్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ మరో పాతిక సంవత్సరాల పాటు సినిమాలు చేయాలని, పూర్తి ఆరోగ్యంతో చాలా ఆనందంగా ఆయన జీవితం సాగాలని కోరుకుంటూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

Tags:    

Similar News