అమితాబ్.. కల్కి రిలీజ్ ముందు కీలక నిర్ణయం!
బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్.. లాంగ్ గ్యాప్ తర్వాత తెలుగు సినీ ప్రియులను అలరించనున్నారు
బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్.. లాంగ్ గ్యాప్ తర్వాత తెలుగు సినీ ప్రియులను అలరించనున్నారు. డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వస్తున్న కల్కి మూవీలో అమితాబ్ కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే మేకర్స్ రిలీజ్ చేసిన ప్రమోషనల్ కంటెంట్ ద్వారా అమితాబ్ అశ్వత్థామ పాత్రలో కనిపించనున్నట్లు క్లారిటీ వచ్చేసింది. సెకండ్ ట్రైలర్ లో ప్రభాస్, అమితాబ్ మధ్య యాక్షన్ సీక్వెన్స్ వేరే లెవెల్ లో ఉంది. అందరినీ ఆకట్టుకుంది.
అమితాబ్ సినిమాలో నటించడమే కాదు.. ప్రమోషన్స్ లో కూడా యాక్టివ్ గా పాల్గొన్నారు. రీసెంట్ గా ముంబైలో జరిగిన ప్రీ లాంఛ్ ఈవెంట్ లో ఓ రేంజ్ లో సందడి చేశారు. ప్రభాస్ ను ఆటపట్టించి నవ్వులు పూయించారు. కల్కి నిర్మాత అశ్వనీదత్ కాళ్లకు నమస్కారం చేసి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచారు. ఇటీవల ఇంటర్వ్యూలో కల్కిలో తాను చేసిన పాత్ర.. తన కెరీర్ లో బెస్ట్ క్యారెక్టర్ అని చెప్పారు. సినిమాలో ప్రభాస్ ను కొట్టినందుకు ఫ్యాన్స్ నుంచి క్షమాపణలు కోరారు.
అయితే కల్కి రిలీజ్ కు ముందు అమితాబ్ బచ్చన్ అరుదైన నిర్ణయం తీసుకున్నారు. రామచరిత మానస్ ను చదువుతున్నట్లు సోషల్ మీడియాలో వెల్లడించారు. అయితే వాల్మీకి రచించిన రామాయణాన్ని సామాన్య ప్రజలు కూడా చదవడానికి వీలుగా హిందీలో అనువదించాడు తులసీదాసు. దీనికి శ్రీరామచరిత మానస్ గా తులసీదాసు నామకరణం చేశాడు. ఈ మహాగ్రంథం రచనా కార్యక్రమాన్ని అయోధ్యలో చేపట్టాడు. ఇప్పుడు దీన్నే అమితాబ్ చదువుతున్నారు.
రామచరిత మానస్ లో ఒక శ్లోకాన్ని కూడా పంచుకున్నారు బిగ్ బి. అది సినిమాలో అమితాబ్ పోషించిన అశ్వత్థామ రోల్ ను ప్రతిబింబిస్తుంది. అయితే అమితాబ్ రోల్ ను మహాభారతం నుంచి రిఫరెన్స్ గా నాగి తీసుకున్నట్లు క్లియర్ గా అర్థమవుతుంది. పురాణాల ప్రకారం.. అశ్వత్థామకు మరణం ఉండదు, ఆకలి ఉండదు. కానీ శ్రీకృష్ణుడి శాపం వల్ల అనేక రోగాలతో కలియుగం అంతమయ్యే వరకు ఉంటాడు. దీంతో ఆ రోల్ ను ఊహించుకుని నాగ్ అశ్విన్ స్ర్కిప్ట్ రాసుకున్నారు.
ఇక అమితాబ్ ను ఈ సినిమాలో అద్భుతంగా చూపించారు నాగ్ అశ్విన్. ఆర్టిఫీషియల్ ఇంటెలిజన్స్ సహాయంతో వయసు తక్కువ చేసి చూపించారు నాగి. అయితే అమితాబ్ మేకప్ వేసుకోవడానికి మూడు గంటలు పట్టేదట. మేకప్ తీయడానికి గంటన్నర పట్టేదని ఇటీవల ఇంటర్వ్యూలో తెలిపారు. సిల్వర్ స్క్రీన్ పై చూశాక రోల్ వెనుక కష్టం తెలుస్తుందని చెప్పారు. మరి సినిమా రిలీజ్ అయ్యాక.. అమితాబ్ ఎలాంటి ప్రశంసలు అందుకుంటారో చూడాలి.