మెగాస్టార్ కి క్లాస్ పీకిన డాడీ ఎందుకో తెలుసా?

అదేంటో ఆయ‌న మాట‌ల్లోనే.. అంద‌రూ రేసు కోర్సును చూడ‌టానికి అల‌వాటు ప‌డుతున్నార‌ని అన్నారు.

Update: 2024-11-27 14:30 GMT

కొడుకుల‌కు తండ్రులు క్లాస్ లు పీక‌డం అన్న‌ది స‌హ‌జ‌మే. ఎదిగే క్ర‌మంలో మంచి చెడులు చెబుతుంటారు. జీవితంలో ఎలా ఉండాలి? ఎలా ఉండ కూడ‌దు? క‌ష్టం..సుఖం రెండింటి గురించి చెబుతుంటారు. బాలీవుడ్ లెజెండ‌రీ న‌టుడు అమితాబ‌చ్చ‌న్ కూడా తండ్రి నుంచి అలాంటి ఫేజ్ ని చూసిన‌వారే. ప్ర‌స్తుతం ఆయ‌న `కౌన్ బ‌నేగా క‌రోడ్ప‌తి` సీజ‌న్-16 హోస్ట్ చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఇందులో ఆయ‌న త‌న రేసు కోర్సు అనుభ‌వం గురించి మాట్లాడారు.


అదేంటో ఆయ‌న మాట‌ల్లోనే.. అంద‌రూ రేసు కోర్సును చూడ‌టానికి అల‌వాటు ప‌డుతున్నార‌ని అన్నారు. ఈ సంద‌ర్భంగానే త‌న అనుభ‌వాన్ని పంచుకున్నారు. `నేను క‌ల‌క‌త్తాలో ప‌నిచేసేట‌ప్పుడు 300-400రూపాయ‌ల మ‌ధ్య‌లో సంపాదించేవాడిని. కానీ ఆ డ‌బ్బు నాకు స‌రిపోయేది కాదు. ఎక్కువ డ‌బ్బు సంపాదించాల‌నే ఆశ‌తో రేసు కోర్సును చూడ‌టానికి వెళ్లేవాడిని. ఒక రోజు ఆ విష‌యాన్ని నేను మా ఇంట్లో చెప్పాను.

వాళ్లు తిడ‌తారు? అనుకున్నాను. కానీ ఏం అన‌లేదు. కానీ మా నాన్న మాత్రం నాకో ఉత్త‌రం రాశారు. అందులో క‌ష్ట‌ప‌డ‌నిదే ఏదీ రాదు. డ‌బ్బు సంపాదించాలంటే? చెమ‌ట చిందే వ‌ర‌కూ క‌ష్ట‌ప‌డాలి. అలా వ‌చ్చిన డ‌బ్బు మాత్ర‌మే మ‌న‌తో శాశ్వ‌తంగా ఉంటుంది. దాన్నే క‌ష్టే ఫ‌లి అంటారు. అలా కాకుండా వ‌చ్చిన డ‌బ్బు మ‌న వ‌ద్ద ఎన్న‌టికీ నిల‌వ‌దు. గుర్తుంచుకో` అని రాసారు.

ఆ క్ష‌ణం మ‌ళ్లీ ఆ రేసు కోర్సుకు వెళ్ల‌కూడ‌ద‌ని నిర్ణ‌యించుకున్నా. అప్ప‌టి నుంచి ఇప్ప‌టివ‌ర‌కూ మళ్లీ అటువైపు చూసింది లేదు. ఆ ఉత్త‌రం నాపై చాలా ప్ర‌భావాన్ని చూపింది. ఆయ‌న ఎందుకు అలా అన్నారో? నన్ను ఎన్నో ఆలోచ‌న‌ల్లో ప‌డేసింది. ఆయ‌న అనుభ‌వంతో చెప్పిన మాట‌ల‌వి. క‌ష్టాన్ని మాత్ర‌మే న‌మ్ముకోవాలని మ‌రింత బ‌లంగా అనుకున్నాను` అని అన్నారు.

Tags:    

Similar News