సీక్రెట్‌గా స్టార్ హీరోకి నిద్రమాత్రలు మింగించిన భార్య
అది విన్న బర్జాత్య అతడికి కొంత మత్తు మందు ఇచ్చి నిదురపుచ్చాలని సూచించాడు. అతడి సూచన మేరకు దొంగచాటుగా అమృత సైఫ్‌కి మత్తు మందు ఇచ్చింది.
ఏదైనా సన్నివేశంలో నటించేప్పుడు పర్ఫెక్షన్ కుదరకపోతే ఆ నటుడు లేదా నటి ఏం చేయాలి? అంతో ఇంతో ప్రయోగం చేయాలి. అలాంటి ఒక ప్రయోగం చేశారు బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్‌పై. విడుదలైన దశాబ్దాల తర్వాత కూడా 'హమ్ సాథ్-సాథ్ హైన్' ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్న కల్ట్ క్లాసిక్ చిత్రాలలో ఒకటిగా నిలిచింది. సల్మాన్ ఖాన్, సైఫ్ అలీ ఖాన్, కరిష్మా కపూర్, టబు, సోనాలి బింద్రే, మొహ్నిష్ బహ్ల్ లాంటి తారాగణంతో సూరజ్ బర్జాత్యా ఒక కళాఖండాన్ని సృష్టించాడు.
అయితే ఈ సినిమాలో ఒక సీన్ కోసం ఎంత ట్రై చేసినా సైఫ్ ఖాన్ మూడ్ ని క్యారీ చేయలేకపోయాడట. దీంతో అతడి భార్య అమృతా సింగ్ అతడికి మత్తు మందు బిళ్లలు ఇవ్వాల్సి వచ్చిందని దర్శకుడు సూరజ్ వెల్లడించాడు. హమ్ సాథ్-సాథ్ హైన్‌లో వన్ టేక్ షాట్ పూర్తి చేసేందుకు సైఫ్ అలీ ఖాన్‌కి మత్తు మందు ఇచ్చారు. హమ్ సాథ్-సాథ్ హై గురించి కొన్ని అద్భుతమైన జ్ఞాపకాలను షేర్ చేసిన దర్శకుడు సూరజ్ బర్జాత్యా దీనిని వెల్లడించారు. ఈ చిత్రం కోసం 'సునోజీ దుల్హన్..' పాటను చిత్రీకరిస్తున్నప్పుడు సైఫ్ అలీ ఖాన్ పై చాలా రీటేక్‌లు చేయాల్సి వచ్చిందని ఆయన వెల్లడించారు. సైఫ్ సహజమైన నటుడని.. కానీ కామెడీ సీన్ మొత్తం ఒకే సారి చేయాల్సి ఉంది కాబట్టి.. సైఫ్ పై చాలా రీటేక్ లు చేయాల్సి వచ్చింది... ఎంత చేసినా సరిగా కుదరలేదు. దాంతో అతడు సైఫ్ ఖాన్ అప్పటి భార్య అమృతా సింగ్‌తో మాట్లాడాడు. సైఫ్ రాత్రంతా మేల్కొని ఉంటాడని, అతడు తన డైలాగులు వల్లిస్తూ.. తన పాత్రను ఎలా మెరుగుపరచాలో ఆలోచిస్తాడని అమృత వెల్లడించింది.
అది విన్న బర్జాత్య అతడికి కొంత మత్తు మందు ఇచ్చి నిదురపుచ్చాలని సూచించాడు. అతడి సూచన మేరకు దొంగచాటుగా అమృత సైఫ్‌కి మత్తు మందు ఇచ్చింది. అతడు ఫుల్‌గా నిద్రపోయాడు.. మరుసటి రోజు అతడు ఒకే టేక్‌లో షాట్‌ను పూర్తి చేసాడు. ఆ తర్వాత సైఫ్ దీని గురించి దర్శకుడిని ప్రశ్నించాడు.. ''ఇది ఒక్కసారిగా ఎలా జరిగింది?''అనడిగాడు. దానికి సూరజ్ భర్జాత్యా జవాబిస్తూ.. ''నువ్వు సహజ నటుడివి.. దయచేసి సరిగ్గా నిద్రపో.. అప్పుడు మాత్రమే ఇలాంటి మ్యాజిక్ జరుగుతుంది..'' అన్నారట.
భారీ తారాగణంతో తెరకెక్కిన 'హమ్ సాథ్-సాథ్ హై' షూటింగ్ సమయంలో సైఫ్ అలీ ఖాన్ చాలా ఉద్వేగానికి లోనయ్యాడని కూడా సూరజ్ బర్జాత్యా తెలిపారు. అదే ఇంటర్వ్యూలో సెట్స్ లో సైఫ్ మూడీగా ఉండేవాడని చెప్పాడు. అతడు తన హిట్ చిత్రం 'దిల్ చాహ్తా హై'కి ముందు కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద పెద్దగా ప్రభావం చూపకపోవడంతో నిరాశలో ఉన్న దశను ప్రస్తావించాడు. అలాగే పెద్ద తారల సరసన పెద్ద పాత్ర చేయడం అదే మొదటిసారి కాబట్టి సైఫ్ చాలా ఒత్తిడికి లోనయ్యాడు. అయితే అతడు చాలా కష్టపడి తన డైలాగ్‌లను తరచుగా రిహార్సల్ చేసేవాడు.. అని కూడా సూరజ్ వెల్లడించారు.
కెరీర్ మ్యాటర్ కి వస్తే.. సైఫ్ అలీ ఖాన్ తదుపరి దేవరలో జూనియర్ N.T.R తో కలిసి కనిపించనున్నారు. జాన్వీ కపూర్ ఇందులో కథానాయికగా నటిస్తోంది. ఆదిపురుష్ తర్వాత సైఫ్ ఖాన్ సౌత్ లో వరుసగా భారీ చిత్రాలకు కమిటవుతున్న సంగతి తెలిసిందే.