ఎమీజాక్సన్ మళ్లీ ఫ్రెగ్నెంట్.. ఇవిగో ఫోటోలు
ఈ జంట పెళ్లికి సంబంధించిన ఫోటోలు వీడియోలు ఇప్పటికే వైరల్ అయ్యాయి.
రజనీకాంత్ 2.0, విక్రమ్ ఐ, రామ్ చరణ్ ఎవడు, ఆర్య సుబ్రమణ్యపురం వంటి చిత్రాల్లో నటించింది ఎమీ జాక్సన్. బాలీవుడ్ సహా సౌత్ లో అగ్ర కథానాయికగా నటించింది. కానీ కెరీర్ పీక్స్ లో ఉండగానే లండన్ బిజినెస్ మేన్ జార్జి పనాయటౌని ప్రేమించి పెళ్లాడేందుకు సిద్ధమైంది. కానీ అతడు ఒక బిడ్డను కన్న తర్వాత తనకు బ్రేకప్ చెప్పాడు. ఆ తర్వాతా రెండోసారి నటుడు కం మోడల్ ఎడ్ వెస్ట్ విక్ తో ప్రేమలో పడిన ఎమీ ఇటీవలే అతడిని పెళ్లాడింది. ఈ జంట పెళ్లికి సంబంధించిన ఫోటోలు వీడియోలు ఇప్పటికే వైరల్ అయ్యాయి.
ఇంతలోనే ఈ జంట ఇప్పుడు గుడ్ న్యూస్ చెప్పారు. తాను తల్లిని కాబోతున్నానని ఎమీజాక్సన్ ప్రకటించింది.నటి అమీ ఇప్పటికే తన ఐదేళ్ల కొడుకు ఆండ్రియాస్ పనాయోటౌకు తల్లిగా పోషణ బాధ్యతలు చేపట్టింది. ఆమె తన మాజీ భాగస్వామి జార్జ్ పనాయోటౌ నుంచి దూరమయ్యాక ఆండ్రియాస్ ని అల్లారు ముద్దుగా పెంచుకుంది. ఇప్పుడు ఎడ్ వెస్ట్ విక్ తోను బిడ్డను కంటోంది. ఈ జంట శుభవార్త చెప్పినందుకు సహచరులంతా శుభాకాంక్షలు తెలిపారు.
ఎడ్ వెస్ట్ విక్ అమీ కొడుకుతో చాలా సన్నిహిత సంబంధాన్ని కలిగి ఉన్నాడు. ఇది సూపర్ గర్ల్ స్టార్ అమీ జాక్సన్ వారి సంబంధంలో ఒక ప్రాథమిక భాగమని చెప్పింది. ఆండ్రియాస్కి అతని జీవితాంతం ఎడ్ తెలుసు. అతను ఎడ్కి పరిచయమైనప్పుడు రెండు సంవత్సరాలు. మేము చాలా మంచి స్నేహితులం. కాబట్టి నేను ఎడ్ను అంతగా ప్రేమించడానికి ఇది ఒక కారణమని నేను భావిస్తున్నాను. ఆండ్రియాస్తో అతనికి ఉన్న సంబంధం, తల్లిగా వర్కింగ్ మమ్గా అతను నాకు ఎంతో మద్దతుగా ఉన్నాడు అని తెలిపింది.