మొనోకినీలో మందాకినీలా అమైరా దస్తూర్

ఈ ఫోటోలలో ఆమె మొనోకినీ ధరించి సాగరంలో బొట్ రైడ్ చేస్తూ ఉంది. వాటర్ బైక్ పై ఎంజాయ్ చేస్తూ హాట్ హాట్ ఫోటోలని ఇన్ స్టాలో షేర్ చేసింది.

Update: 2023-11-28 03:53 GMT

బాలీవుడ్ బ్యూటీస్ సమయం దొరికితే అలా సేదతీరడం కోసం విదేశాలకి ఎగిరిపోతారు. అక్కడ ప్రకృతి అందాలని ఆశ్వాదిస్తూ పరవశించిపోతారు. నిత్యం షూటింగ్ లతో బిజీగా ఉండే లైఫ్ లో అదే కాస్తా ఉపశమనం. అందుకే వెకేషన్ ట్రిప్ లు ప్లాన్ చేస్తూ ఉంటారు. సెలబ్రిటీ లైఫ్ లో ఉన్న అందరూ ఈ వెకేషన్ ట్రిప్స్ కి వెళ్తూ ఉంటారు.


ముఖ్యంగా హీరోయిన్స్ అందరూ మాల్దీవుల్లో విహరించడానికి ఇష్టపడతారు. వారు కూడా సెలబ్రిటీలకి ప్రత్యేకమైన ప్యాకేజీలు ఇవ్వడంతో మాల్దీవుల్లో బీచ్ అందాలని ఆశ్వాదిస్తూ ఫుల్ గా ఎంజాయ్ చేస్తారు. తాజాగా బాలీవుడ్ బ్యూటీ అమైరా దస్తూర్ మాల్దీవుల్లో తన వెకేషన్ ట్రిప్ ఫోటోల ని షేర్ చేసుకుంది. ఈ ఫోటోలలో ఆమె మొనోకినీ ధరించి సాగరంలో బొట్ రైడ్ చేస్తూ ఉంది. వాటర్ బైక్ పై ఎంజాయ్ చేస్తూ హాట్ హాట్ ఫోటోలని ఇన్ స్టాలో షేర్ చేసింది.


ప్రస్తుతం ఈ ఫోటోలు కాస్తా వైరల్ అవుతున్నాయి. బాలీవుడ్ బ్యూటీస్ గ్లామర్ షో చేయడంలో ముందుంటారు. తమని తాము షోకేస్ చేసుకోవడానికి పెద్దగా ఇబ్బంది పడరు. అందుకే బీచ్ లో బికినీ షూట్లతో ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఈ ఫోటోలు వారిని ఫాలో అయ్యే ఫ్యాన్స్ కి మాత్రం కావాల్సినంత ఆనందం ఇస్తాయి. అమైరా ఫోటోలని కూడా ఫ్యాన్స్ ఆశ్వాదిస్తున్నారు.


ఇదిలా ఉంటే అమైరా దస్తూర్ ఇస్సాక్ సినిమాతో బాలీవుడ్ లోకి హీరోయిన్ గా అడుగుపెట్టింది. తరువాత వరుస అవకాశాలు అందుకుంటూ వచ్చింది. తెలుగులో సందీప్ కిషన్ కి జోడీగా మనసుకి నచ్చింది. రాజ్ తరుణ్ తో రాజుగాడు సినిమాలలో హీరోయిన్ గా నటించింది. ఈ రెండు డిజాస్టర్ కావడంతో మళ్ళీ బాలీవుడ్ బాట పట్టింది.

అక్కడ సినిమాలతో పాటుగా వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తోంది. ఇప్పటికే మూడు వెబ్ సిరీస్ లలో అమైరా నటించింది. ఆమె చివరిగా ప్రభుదేవా భగీరా సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ డిజాస్టర్ అయ్యింది. అలాగే బొంబాయ్ మేరా భాయ్ అనే వెబ్ సిరీస్ లో ఈ ఏడాది కనిపించింది.

Tags:    

Similar News