అఖండ 2.. బోయపాటి ప్లాన్ ఎంతవరకు వచ్చిందంటే..

దైవత్వాన్ని మెయిన్ ఎలిమెంట్ గా తీసుకొని ‘అఖండ’ సినిమాని బోయపాటి తెరకెక్కించడంతో హిందుత్వాన్ని బిలీవ్ చేసేవారందికి మూవీ నచ్చేసింది.

Update: 2024-10-08 13:30 GMT

నందమూరి బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్ లో వచ్చిన ‘అఖండ’ మూవీ ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే. ఈ సినిమాలో బాలకృష్ణ డ్యూయల్ రోల్ లో కనిపించాడు. అందులో అఘోర తరహా క్యారెక్టర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆడియన్స్ ఆ పాత్రకి విపరీతంగా కనెక్ట్ అయిపోయారు. దైవత్వాన్ని మెయిన్ ఎలిమెంట్ గా తీసుకొని ‘అఖండ’ సినిమాని బోయపాటి తెరకెక్కించడంతో హిందుత్వాన్ని బిలీవ్ చేసేవారందికి మూవీ నచ్చేసింది. ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 133.50 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని అందుకుంది.

బాలయ్య కెరియర్ లోనే హైయెస్ట్ కలెక్షన్స్ ‘అఖండ’ సినిమాకి వచ్చాయి. ఇప్పుడు బోయపాటి శ్రీను ‘అఖండ’ సీక్వెల్ ని ప్లాన్ చేస్తున్నారు. ఈ మూవీ స్క్రిప్ట్ వర్క్ ఆల్ మోస్ట్ కంప్లీట్ అయ్యిందంట. ప్రస్తుతం క్యాస్టింగ్ ని ఫైనల్ చేసే పనిలో బోయపాటి ఉన్నారు. 2025 ఆరంభంలో ‘అఖండ 2’ రెగ్యులర్ షూటింగ్ మొదలయ్యే అవకాశం ఉందనే మాట వినిపిస్తోంది. ఈ సీక్వెల్ ని ఏకంగా 150 కోట్ల బడ్జెట్ తో పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా బోయపాటి తెరకెక్కించబోతున్నారు.

కచ్చితంగా మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని నందమూరి అభిమానులు భావిస్తున్నారు. బాలయ్య, బోయపాటి కాంబినేషన్ మీద వారికున్న నమ్మకం అలాంటిది. ‘సింహ’, ‘లెజెండ్’, ‘అఖండ’ తో బాలయ్యకి బోయపాటి మూడు బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చారు. అందుకే ‘అఖండ 2’ కూడా అంచనాలకి మించి ఉంటుందని నమ్ముతున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో బాలయ్య కోసం బోయపాటి భారీ డైలాగ్స్ రాస్తున్నారంట.

ఈ డైలాగ్స్ బాలయ్య చెబితే గూస్ బాంబ్స్ క్రియేట్ అవ్వడం గ్యారెంటీ అనే మాట వినిపిస్తోంది. ఈ చిత్రంలో కూడా బాలయ్య రెండు పాత్రలలోనే కనిపించనున్నట్లు టాక్ నడుస్తోంది. ఈ మూవీలో ప్రతి నాయకుడి పాత్ర కోసం ఈశాన్య రాష్ట్రాలకి లేదంటే చైనాకి చెందిన వ్యక్తి కోసం బోయపాటి చూస్తున్నారు. యూనివర్సల్ అప్పీల్ కోసం చాలా గ్రాండ్ గా అఖండ 2ని బోయపాటి సిల్వర్ స్క్రీన్ పై ఆవిష్కరించనున్నట్లు ప్రచారం నడుస్తోంది.

అలాగే ఓ కీలక పాత్ర కోసం 16 నుంచి 18 ఏళ్ళ వయస్సున్న టీనేజ్ అమ్మాయి కోసం చూస్తున్నారంట. బాబీ దర్శకత్వంలో బాలకృష్ణ చేస్తోన్న మూవీ కంప్లీట్ అయిన వెంటనే ‘అఖండ 2’ సినిమాని స్టార్ట్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే బాలయ్యకి మూడు హిట్స్ ఇచ్చిన బోయపాటి ‘అఖండ 2తో పాన్ ఇండియా రేంజ్ సక్సెస్ ఇస్తాడా లేదా అనేది వేచి చూడాలి.

Tags:    

Similar News