రష్మిక మాటల వెనుక ఉద్దేశం నాకు తెలియదు

ఆనంద్ దేవరకొండ తాజా చిత్రం గంగం గణేశా. ఈ సినిమా ను రేపు ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు.

Update: 2024-05-30 06:30 GMT

ఆనంద్ దేవరకొండ తాజా చిత్రం గంగం గణేశా. ఈ సినిమా ను రేపు ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. విభిన్న చిత్రాలను చేస్తూ తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ను సొంతం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్న హీరో ఆనంద్ దేవరకొండ మరోసారి కమర్షియల్‌ కోణంలో ఈ సినిమాను చేసినట్లు పేర్కొన్నాడు.

తాజాగా సినిమా ప్రమోషనల్ ఇంటర్వ్యూలో భాగంగా మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలపై స్పందించాడు. అదే సమయంలో రష్మిక మళ్లీ మళ్లీ తన సినిమాల యొక్క ప్రమోషన్‌ కార్యక్రమాలకు హాజరు అవ్వడం మరియు ఫ్యామిలీతో కలవడం వంటి విషయాలపై స్పందించాడు.

రష్మిక మాకు ఫ్యామిలీ ఫ్రెండ్‌. ఆమె మా ఫ్యామిలీ వేడుకలు అన్నింటిలో కూడా పాల్గొంటుంది. ఇంట్లో అందరితో కూడా చాలా సన్నిహితంగా ఉంటుంది. ఆ సన్నిహిత్యంతోనే నా సినిమాల ప్రమోషన్‌ కోసం రష్మిక వచ్చింది. అయిన రష్మిక మళ్లీ మళ్లీ నా సినిమా వేడుకలకు రాలేదు. ఆమె కేవలం వచ్చింది రెండు సార్లు మాత్రమే అన్నాడు.

ఫ్యామిలీ ఫ్రెండ్‌ అవ్వడం వల్లే మనం ఒక ఫ్యామిలీ అంది. అయితే నాపై ప్రతి విషయానికి ఆధారపడుతాను అంటూ రష్మిక ఎందుకు అన్నది, ఆమె ఏ ఉద్దేశ్యంతో అన్నది మాత్రం నాకు తెలియదు. రష్మిక మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా చాలా మంచి స్నేహితురాలు అన్నట్లుగా ఆనంద్‌ దేవరకొండ చెప్పుకొచ్చాడు.

గత కొంత కాలంగా విజయ్ దేవరకొండ తో రష్మిక మందన్న ప్రేమలో ఉంది అనే వార్తలు వస్తున్నాయి. వాటికి బలం చేకూర్చే విధంగా అప్పుడప్పుడు రష్మిక నోరు జారుతూ ఉంటుంది. అలాగే గంగం గణేశా సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో కూడా ఆనంద్‌ దేవరకొండతో మనం ఒక ఫ్యామిలీ అనేసింది అంటూ సోషల్‌ మీడియాలో రచ్చ జరుగుతోంది.

Tags:    

Similar News