బాబోయ్.. ఆనంద్ సిక్స్ ప్యాక్ బాడీ చూశారా?

కానీ సాలిడ్ హిట్ అందుకోలేకపోయారు. కరోనా టైమ్ లో మిడిల్‌ క్లాస్‌ మెలొడీస్‌ తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

Update: 2024-05-19 07:03 GMT

టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ తమ్ముడిగా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఆనంద్ దేవరకొండ.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న విషయం తెలిసిందే. దొరసాని మూవీతో హీరోగా మారిన దేవరకొండ బ్రదర్.. తొలి చిత్రంతో మంచి పేరు దక్కించుకున్నారు. కానీ సాలిడ్ హిట్ అందుకోలేకపోయారు. కరోనా టైమ్ లో మిడిల్‌ క్లాస్‌ మెలొడీస్‌ తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

ఆ తర్వాత పుష్పక విమానం, హైవే సినిమాలు చేసినా.. అవి అనుకున్నంత స్థాయిలో ఆడలేదు. ఇక సాయి రాజేష్ దర్శకత్వంలో ఆనంద్ దేవరకొండ చేసిన బేబీ మూవీ ఎలాంటి హిట్ అయిందో తెలిసిందే. యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా.. బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్లు వసూలు చేసి రికార్డు క్రియేట్ చేసింది. ఈ మూవీలో తన నటనతో ఆనంద్ దేవరకొండ అందరినీ ఆకట్టుకున్నారు. క్లైమాక్స్ లో ఎమోషన్ ను ఓ రేంజ్ లో పండించారు.

ఇప్పుడు వరుస సినిమాలతో అలరించేందుకు సిద్ధమవుతున్నారు ఆనంద్ దేవరకొండ. త్వరలోనే ఆయన నటించిన గం గం గణేశా మూవీ రిలీజ్ కానుంది. కొత్త దర్శకుడు ఉదయ్ శెట్టి తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో ప్రగతి శ్రీవాస్తవ, నయన్ సారిక హీరోయిన్స్‌ గా యాక్ట్ చేస్తున్నారు. బ్లాక్ బస్టర్ హిట్ బేబీ తర్వాత ఆనంద్ నుంచి వస్తున్న సినిమా కావడంతో సినీ ప్రియుల్లో మంచి అంచనాలే ఉన్నాయి. ప్రస్తుతం ఈ మూవీ టీమ్ ప్రమోషన్స్ బిజీలో ఉంది.

ఈ నేపథ్యంలో ఆనంద్ దేవరకొండ లేటెస్ట్ సోషల్ మీడియా పోస్ట్ వైరల్ గా మారింది. గం గం గణేశా మూవీ కోసం చాలా కష్టపడ్డానని ఆదివారం ఉదయం ట్వీట్ చేశారు. సినిమా కోసం నిజంగా కండలు పెంచానంటూ తన సిక్స్ ప్యాక్ బాడీ పిక్ ను షేర్ చేశారు. సినిమాలో ఫుల్ యాక్షన్ సీన్స్ ఉన్నాయని, అందుకే ఈ సిక్స్ ప్యాక్ బాడీని పెంచినట్లు తెలిపారు. దీంతో నెటిజన్లు ఆనంద్ సిక్స్ ప్యాక్ బాడీ అదిరిపోయిందని కామెంట్లు పెడుతున్నారు.

ఈ సినిమాతో పాటు సిక్స్ ప్యాక్ బాడీ కోసం ఆనంద్ బాగా కష్టపడినట్లు ఉన్నారని నెటిజన్లు చెబుతున్నారు. ఆనంద్ హార్డ్ వర్క్ పట్ల ప్రశంసలు కురిపిస్తున్నారు. మే 31వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న గం గం గణేశా మూవీ ట్రైలర్.. రేపు సాయంత్రం విడుదల కానుంది. ఇప్పటికే లిరికల్ సాంగ్స్ అండ్ ప్రమోషనల్ కంటెంట్ ద్వారా మంచి బజ్ క్రియేట్ చేసుకున్న గం గం గణేశా సినిమా ఎలాంటి హిట్ అవుతుందో వేచి చూడాలి.

Tags:    

Similar News