'లైగ‌ర్' బ్యూటీ కిల్ చేస్తోందిగా

లైగ‌ర్ చిత్రంతో ద‌క్షిణాదికి సుప‌రిచిత‌మైన అన‌న్య పాండే, ఇటీవ‌ల సినిమాల‌తో కంటే ప్రేమ వ్య‌వ‌హారాల‌తోనే ఎక్కువ‌గా చ‌ర్చ‌ల్లో నిలుస్తోంది

Update: 2024-09-27 03:30 GMT

లైగ‌ర్ చిత్రంతో ద‌క్షిణాదికి సుప‌రిచిత‌మైన అన‌న్య పాండే, ఇటీవ‌ల సినిమాల‌తో కంటే ప్రేమ వ్య‌వ‌హారాల‌తోనే ఎక్కువ‌గా చ‌ర్చ‌ల్లో నిలుస్తోంది. ఆదిత్య రాయ్ క‌పూర్ నుంచి విడిపోయిన ఈ బ్యూటీ ఆ త‌ర్వాత హార్థిక్ పాండ్యాతో డేటింగ్ మొద‌లెట్టింద‌ని గుస‌గుస‌లు వినిపించాయి. అయితే త‌న‌పై వ‌చ్చే పుకార్ల‌ను ఈ భామ ఖండించ‌నూ లేదు.. నిజ‌మేన‌ని అంగీక‌రించ‌లేదు. క‌నీసం స్పందించ‌నూ లేదు.

ఇటీవ‌లే `కాల్ మీ బే` అనే చిత్రంతో ఈ స‌న్న‌జాజి సోయ‌గం అభిమానుల ముందుకు వ‌చ్చింది. ఈ సినిమా పాజిటివ్ టాక్ ని తెచ్చుకుంది. అన‌న్య న‌ట‌న‌కు మంచి పేరొచ్చింది. ఇది ప్ర‌స్తుతం అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగు అవుతోంది. కిల్ లాంటి విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు పొందిన చిత్రంతో పాటుగా కాల్ మీ బే ఓటీటీలోను చక్క‌ని ఆద‌ర‌ణ పొందుతోంది. ఇక త‌న సినిమాల ప్ర‌చారంలో భాగంగా నిరంత‌రం అన‌న్య సోష‌ల్ మీడియాల్లో వ‌రుస ఫోటోషూట్ల‌ను షేర్ చేస్తోంది.

ఈ బ్యూటీ తాజా ఫోటోషూట్ ఇప్పుడు ఇంట‌ర్నెట్ ని షేక్ చేస్తోంది. అన‌న్య కిల్లింగ్ లుక్ అభిమానుల్లో వైర‌ల్ గా మారుతోంది. స్లిమ్ గా ఫిట్ గా క‌నిపించే అన‌న్య పాండే ఈ ఫోటోషూట్ లో మ‌రింత‌ అందంగా క‌నిపిస్తోంది. బ్లాక్ డెనిమ్స్ దానిపై బ్లాక్ క‌ల‌ర్ డిజైన‌ర్ టాప్ ని ధ‌రించి కిల్ చేస్తోంది ఈ బ్యూటీ. ప్ర‌స్తుతం యువ‌త‌రం సోష‌ల్ మీడియాల్లో ఇది జోరుగా వైర‌ల్ అయిపోతోంది.

Tags:    

Similar News