కొత్త హెయిర్ స్టైల్.. క్రేజీ శారీ.. అనసూయ అదుర్స్!

ఎంతో మంది ఆమె ఫాలోవర్స్.. అనసూయ శారీ మూమెంట్స్ కోసం వెయిట్ చేస్తుంటారు.

Update: 2024-10-06 03:12 GMT

ఎన్ని మోడ్రన్ డ్రెస్సులు వేసినా.. చీరలో తెలుగు అమ్మాయిలు భలేగా ఉంటారు! ఎంతో అందంగా కనిపిస్తూ కనువిందు చేస్తారు! అందుకే చీరలకు అంతలా క్రేజ్ ఉంటుంది. ఏ మోడల్ శారీ అయినా పర్లేదు.. అందులో ఉండే అందమే వేరు! అయితే యాంకర్ కమ్ నటి అనసూయ చీర కడితే.. అందమే అసూయ పడేలా ఉంటుంది. చీరలో ఆమె అందాల ఆరబోతకు ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంది. ఎంతో మంది ఆమె ఫాలోవర్స్.. అనసూయ శారీ మూమెంట్స్ కోసం వెయిట్ చేస్తుంటారు.


ఇప్పుడు వారి కోసమే అనసూయ కొత్త పిక్స్ షేర్ చేశారు. పర్పుల్ కలర్ చీరలో దిగిన ఫోటోలను పోస్ట్ చేశారు. అందులో అనసూయ ఎంతో అందంగా కనిపిస్తున్నారు. కొత్త హెయిర్ స్టైల్ తో క్రేజీగా మైమరపిస్తున్నారు. తన లుక్స్ తో మాయ చేస్తున్నారు. రకరకాల పోజులతో ఆకట్టుకుంటున్నారు. షైనింగ్ స్కిన్ టోన్ తో అట్రాక్టివ్ గా కనిపిస్తున్నారు. అదే సమయంలో చక్కటి ఫిలాసఫీని రాసుకొచ్చారు. ఏపీ నర్సంపేటలోని ఓ షాప్ ఓపెనింగ్ కు ముద్దుగుమ్మ.. ఇలా రెడీ అయ్యి వెళ్లారు.


"వయసు పెరిగే కొద్దీ.. జ్ఞానం ఎక్కువ అయ్యి కొద్దీ.. నా ఫోకస్ అంతా నేను ఏ విధమైన మహిళగా ఉండాలి.. ఇతరులకు ఏ విధంగా ఆదర్శంగా ఉండాలనే అంశం మీద ఉంది. నన్ను నేను జడ్జ్ చేసిన ప్రతిసారి కూడా ఎదుట వ్యక్తులను అర్థం చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. నన్ను షేమింగ్ చేసిన ప్రతిసారీ నా మనసును నిశ్చలంగా ఉంచుకోవడానికి కృషి చేశాను. ఎవరైనా నన్ను రిజెక్ట్ చేస్తే యాక్సెప్ట్ చేయడం నేర్చుకున్నాను. నా ఎక్స్పీరియన్సెస్ నన్ను మార్చాయి" అంటూ రాసుకొచ్చారు.


అదే సమయంలో తాను హర్ట్ అయిన ప్రతిసారి కూడా ప్రజలు తనను హార్ట్ చేస్తున్నారని అనుకోవడం లేదని అనసూయ తెలిపారు. వాళ్ల గురించి ఆలోచించి తానే తనను హార్ట్ చేసుకుంటున్నట్టు గుర్తించానని చెప్పారు. ప్రస్తుతం అనసూయ కొత్త పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆమె పిక్స్ సూపర్ గా ఉన్నాయని కొందరు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఫిలాసపీ అదిరిపోయిందని మరికొందరు చెబుతున్నారు. ఇన్స్పిరేషనల్ గా ఉందని ఇంకొందరు అంటున్నారు.


అయితే బుల్లితెరపై యాంకర్ గా ఓ వెలుగు వెలిగిన ముద్దుగుమ్మ.. సడెన్ గా సినిమాల్లోకి వచ్చేశారు. స్మాల్ స్క్రీన్ కు పూర్తిగా గుడ్ బై చెప్పారు. ఇప్పుడు పలు షోస్ లో మళ్లీ కనిపిస్తున్నారు. బుల్లితెర ప్రియులను అలరిస్తున్నారు. అదే సమయంలో వరుస సినిమా అవకాశాలు అందుకుంటున్నారు. మేకర్స్ కు ఫేవరేట్ యాక్ట్రెస్ గా మారిపోయారు! త్వరలో రానున్న పుష్ప-2 మూవీలో కీలక పాత్ర పోషిస్తున్నారు. మరి అందులో ఆమె రోల్ ఎలా ఉంటుందో వేచి చూడాలి.

Tags:    

Similar News