పిక్ టాక్ : ఏంజిల్ అవతారంలో అందాల 'రాశి'
పేరుకు తగ్గట్లుగానే అందాన్ని రాసి పోసినట్లుగా ఉంటుంది అంటూ మొదటి సినిమా నుంచే తెలుగు ప్రేక్షకులు ఈమెను అభిమానించడం మొదలు పెట్టారు.
ఊహలు గుసగుసలాడే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ రాశి ఖన్నా. పేరుకు తగ్గట్లుగానే అందాన్ని రాసి పోసినట్లుగా ఉంటుంది అంటూ మొదటి సినిమా నుంచే తెలుగు ప్రేక్షకులు ఈమెను అభిమానించడం మొదలు పెట్టారు.
టాలీవుడ్ లో రానించాలంటే బరువు కాస్త తక్కువ అవ్వాలని భావించిన రాశి ఖన్నా చాలా కష్టపడి తక్కువ సమయంలోనే సన్నగా నాజూకుగా మారింది. అయితే అదృష్టం కలిసి రాకపోవడంతో ఒక్కటి రెండు మినహా పెద్ద హీరోల సినిమాల్లో నటించే అవకాశం ఈ అమ్మడికి దక్కలేదు.
ప్రస్తుతం టాలీవుడ్ కంటే కోలీవుడ్ లో ఎక్కువగా కనిపిస్తున్న ముద్దుగుమ్మ రాశి ఖన్నా సోషల్ మీడియా ద్వారా రెగ్యులర్ గా తన అందాల ఆరబోత ఫోటోలను షేర్ చేస్తూ అన్ని భాషల ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతోంది. తాజాగా ఈ అమ్మడు ఇలా ఏంజిల్ లుక్ లో కనిపించి వైరల్ అయింది.
వైట్ డ్రెస్ లో రాశి ఖన్నా ఫోటోలు నిజంగా ఏంజిల్ అన్నట్లుగా ఉన్నాయి అనిపిస్తోంది. బ్లాక్ అండ్ వైట్ లో పూర్తి వైట్ డ్రెస్ లో రాశి ఖన్నా భలే ఉంది. మరో సారి పేరు కు సార్థకం అన్నట్లుగా అందాల రాశి అనిపించుకుంది అంటూ నెటిజన్స్ మరియు అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఏంజిల్ అవతారంలోని అందాల రాశి పై మీరు ఒక లుక్కేయండి.