స్టార్ కపుల్ కొట్లాటతో 1330 కోట్ల విలువైన వోడ్కా వ్యాపారం నట్టేట!
ఈ ఇద్దరి గొడవలు రచ్చకెక్కడంతో సుమారు 1330 కోట్ల విలువైన వోడ్కా వ్యాపారం నట్టేట మునిగింది. వారి ప్రతిష్ఠ మసకబారడంతో వ్యాపారం నష్టాల్లోకి వెళ్లింది.
ప్రముఖ స్టార్ హీరో.. పాపులర్ స్టార్ హీరోయిన్.. వారి ప్రేమాయణం, పెళ్లి, పిల్లలు అనంతర కాలంలో బ్రేకప్ వ్యవహారం సంచలనంగా మారాయి. అయితే ఈ విడాకుల ప్రహసనం ఎంకి చావు సుబ్బికొచ్చిన చందంగా అయింది. ఈ ఇద్దరి గొడవలు రచ్చకెక్కడంతో సుమారు 1330 కోట్ల విలువైన వోడ్కా వ్యాపారం నట్టేట మునిగింది. వారి ప్రతిష్ఠ మసకబారడంతో వ్యాపారం నష్టాల్లోకి వెళ్లింది. ఇంతకీ ఎవరా స్టార్ కపుల్ అంటే వివరాల్లోకి వెళ్లాలి.
ఏంజెలీనా జోలీ ..బ్రాడ్ పిట్‌ల పోరాటంతో 1330 కోట్ల ($160 మిలియన్ల)కు పైగా వైన్ వ్యాపారం అధ్వాన్నంగా మారిందని పాపులర్ హాలీవుడ్ వెబ్ సైట్ నివేదించింది. బ్రాడ్ పిట్ - ఏంజెలీనా జోలీ, ఒకప్పుడు ఎంతో అందమైన అభిమానించే జంట. కానీ ఇప్పుడు ఈ హై ప్రొఫైల్ కపుల్ విడిపోవడానికి రెడీ అయ్యారు. కొన్ని సంవత్సరాలుగా వీరి మధ్య గొడవ కోర్టు పరిధిలో ఉంది. నిరంతరం మీడియా హెడ్ లైన్స్ లోకి వస్తోంది ఈ గొడవ.
వారి ఆస్తుల పంపకం ఇప్పుడు పెద్ద ప్రహసనంగా ఉంది. ఇటీవలి సంఘటనలలో డైలీ మెయిల్ పత్రిక ఏంజెలీనా -రష్యన్ వోడ్కా వ్యాపారవేత్త యూరి షెఫ్లర్ మధ్య ఊహించని స్నేహంపై వెలుగునిచ్చే ఇమెయిల్ ఎక్స్ఛేంజ్ ల వ్యవహారాన్ని వెలికితీసింది. తనకు వ్యతిరేకంగా ఇద్దరూ కుట్ర పన్నారని బ్రాడ్ ఆరోపించడంతో ఈ ఇమెయిల్‌లు వెలుగు చూసాయి. 25 మే 2022 నాటి ఒక నిర్దిష్ట ఇమెయిల్, బ్రాడ్ కి చెందిన న్యాయ బృందం దాఖలు చేసిన కోర్టు పత్రాలలో కనిపించింది. స్కాట్లాండ్‌లోని స్పేసైడ్ ప్రాంతంలోని తుల్చాన్ ఎస్టేట్‌లోని తన స్కాటిష్ కోటను సందర్శించమని ఏంజెలీనాకు షెఫ్లర్ చేసిన ఆహ్వానాన్ని ఈమెయిల్ బహిర్గతం చేసింది.
ఈ ఆహ్వానానికి కొన్ని నెలల ముందు ఏంజెలీనా తన ఫ్రెంచ్ వైనరీ 'చాటే మిరావల్'ను షెఫ్లర్‌కు 8.5 మిలియన్ డాలర్లకు విక్రయించింది. ఈ ఒప్పందం బ్రాడ్‌కు కోపం తెప్పించింది. దీని కారణంగా అతడు ఒప్పందాన్ని ఉల్లంఘించినందుకు దావా వేశారు. న్యాయ పోరాటంలో, ఇన్గ్లోరియస్ బాస్టర్డ్స్ స్టార్ షెఫ్లర్ కంపెనీ తన మాజీ భార్యతో షేరింగులో ఉన్న వైన్ వ్యాపారాన్ని స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నించిందని ఆరోపించారు. మరోవైపు షెఫ్లర్ - ఏంజెలీనా మధ్య వ్యాపార సంబంధాన్ని దెబ్బతీసేందుకు బ్రాడ్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడని షెఫ్లర్ పేర్కొన్నాడు.
ఏంజెలీనా జోలీ తన స్కాటిష్ కోటను సందర్శించడానికి యూరి షెఫ్లర్ ఆహ్వానాన్ని అంగీకరించిందా లేదా అనే దానిపై ఎలాంటి వివరం కానీ, రహస్యం కానీ అంతు చిక్కలేదు. ఇంతలో ఏంజెలీనా- బ్రాడ్ పిట్ 2008లో సుమారు 27 మిలియన్ డాలర్లకు భూమిని కొనుగోలు చేశారు. ఆ సమయంలో వారు ద్రాక్షతోట దాని వ్యాపారానికి సమాన యజమానులుగా మారారు. చట్టపరమైన కేసులో ఏంజెలినా తనకు తెలియజేయకుండానే తన వాటాను విక్రయించాలని నిర్ణయించిందని బ్రాడ్ పేర్కొన్నాడు. ఏంజెలినా చర్యలు వ్యాపారం ప్రతిష్టను దెబ్బతీయడానికి బ్రాడ్ పెట్టుబడిని తగ్గించడానికి ఉద్దేశపూర్వక ప్రయత్నమని పేర్కొంది.
ఈ వ్యవహారంలో బ్రాడ్ లాయర్లు ఇలా పేర్కొన్నారు. ''బ్రాడ్ - ముఖ్యమైన ఆర్థిక పెట్టుబడి సంవత్సరాలుగా శ్రమించిన స్వేదం నుంచి ఈక్విటీ ద్వారా - అత్యంత విజయవంతమైన కుటుంబ యాజమాన్య వ్యాపారాన్ని నిర్మించారు. మిరావల్ 2008 నుండి తదనుగుణంగా విలువలో భారీగా పెరిగింది. ఇప్పుడు వందల మిలియన్ల డాలర్ల విలువైనది. యాంజెలీనా రహస్యంగా క్రయవిక్రయాలు జరిపింది. ఉద్దేశపూర్వకంగా బ్రాడ్‌ను చీకటిలో ఉంచింది. చట్టం గురించి తెలిసి అతని ఒప్పంద హక్కులను ఉల్లంఘించింది.
వానిటీ ఫెయిర్ ద్వారా లీకైన ఇమెయిల్‌లో ఏంజెలీనా జోలీ 21 జనవరి 2021న బ్రాడ్ పిట్‌తో మాట్లాడుతూ, మద్యంతో కూడిన వ్యాపారం నుండి తనను తాను దూరం చేసుకోవాలనే ఉద్దేశం గురించి షేర్ చేసారు. దీనికి ప్రతిగా బ్రాడ్ ఆమె నుండి భూమిని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపాడు. అయినప్పటికీ విమానంలో వారి మధ్య జరిగిన గొడవలను బహిరంగంగా చర్చించకుండా నిరోధించే నాన్-డిస్‌క్లోజర్ అగ్రిమెంట్ (NDA)పై సంతకం చేయడానికి ఆమె నిరాకరించడంతో ఒప్పందం కుప్పకూలింది. తమ షేర్ల విక్రయం గురించి మీడియా ద్వారా తెలుసుకున్నానని కోర్టు పత్రంలో బ్రాడ్ ఆరోపించారు. అతడి ప్రకారం, వారు తమ 160 మిలియన్ డాలర్ల వ్యాపారానికి సంబంధించి 'పరస్పరం కట్టుబడి ఉండే నిబద్ధత' కలిగి ఉన్నారు. ఒకరి సమ్మతి లేకుండా ఒకరు విక్రయించకూడదని అంగీకరించారు. అయితే అలాంటి ఒప్పందాలు లేవని ఏంజెలీనా పేర్కొంది. ఆమె లాయర్లు ఇలా అన్నారు. ''ఇప్పటికీ ఆ అదృష్టకరమైన విమాన ప్రయాణం నుండి ఏడేళ్లలో బ్రాడ్ వ్యక్తిగతంగా ఆ తప్పు జరిగిందని ఎప్పుడూ బహిరంగంగా ఖండించలేదు. వాస్తవమేమిటంటే ఎంజెలీనా హక్కుల దుర్వినియోగం గురించి మౌనంగా ఉండటానికి అంగీకరించనంత వరకు ఆమెతో మిరావల్ విక్రయాన్ని పూర్తి చేయడానికి పిట్ నిరాకరించాడు.
బ్రాడ్ పిట్ - ఏంజెలీనా జోలీ మధ్య న్యాయపోరాటం మరో మలుపు తిరిగింది. యాంజెలినీ పెట్టుబడి సంస్థ నౌవెల్ .... బ్రాడ్‌పై జూలైలో $350 మిలియన్ల దావా వేసింది. అతడు 'కంపెనీ ఆస్తులను వృధా చేసాడు'..యు స్విమ్మింగ్ పూల్ పునరుద్ధరణ మరియు ఆస్తిపై రికార్డింగ్ స్టూడియో నిర్మాణం కోసం పెద్ద మొత్తంలో ఖర్చు చేసారని వారు ఆరోపించారు. పిట్ వైన్ వ్యాపారాన్ని దోచుకున్నాడని.. దానిని తన వ్యక్తిగత క్యాష్‌బాక్స్‌గా పరిగణించాడని వారు ఆరోపించారు.