రాష్ట్ర ప్రభుత్వానికే షాక్ ఇచ్చిన స్టార్ హీరో!
తాజాగా ఇప్పుడు ఏకంగా రాష్ట్ర ప్రభుత్వానికే సుదీప్ షాక్ ఇచ్చాడు. కర్ణాటక స్టేట్ బెస్ట్ అవార్డును రిజెక్ట్ చేసి సంచలనం అయ్యాడు.
కన్నడ సంచలనం సుదీప్ 'బిగ్ బాస్' హోస్టింగ్ బాధ్యతల నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. 11 సీజన్లను దిగ్విజయంగా హోస్ట్ చేసి ఒక్కసారిగా ఎగ్జిట్ నిర్ణయంతో మీడియాలో సంచలనం అయ్యాడు. కన్నడ స్థానికులకు ప్రాముఖ్యతనివ్వకుండా బయటవారిని బిగ్ బాస్ నెత్తినపెట్టుకోవడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ బిగ్ బాస్ కి గుడ్ బై చెప్పాడు. దీంతో ఒక్కసారిగా సుదీప్ నెట్టింట హాట్ టాపిక్ అయ్యాడు. స్థానికుల విషయంలో సుదీప్ ఎంత పట్టుదలతో ఉన్నాడు? అన్నది కోట్ల రూపాయల పారితోషికం వదులు కోవడంతో జనాలకు అర్దమైంది.
తాజాగా ఇప్పుడు ఏకంగా రాష్ట్ర ప్రభుత్వానికే సుదీప్ షాక్ ఇచ్చాడు. కర్ణాటక స్టేట్ బెస్ట్ అవార్డును రిజెక్ట్ చేసి సంచలనం అయ్యాడు. కర్ణాటక ప్రభుత్వం 2019కి ఏడాది గాను బేస్ట్ యాక్టర్ స్టేట్ అవార్డును సుదీప్ కి ప్రకటించింది. దీంతో ఆయన వెంటనే సోషల్ మీడియా ద్వారా ఈ అవార్డు నాకొద్దు అంటూ రిజెక్ట్ చేసి వేరే వాళ్లకు ఇవ్వండని కోరాడు. 'ప్రభుత్వం తరుపున అవార్డు ప్రకటించింనదుకు కృతజ్ఞునడిని. కానీ వ్యక్తిగత కారణాలుగా కొంత కాలంగా ఎలాంటి అవార్డులు తీసుకోకూడదని నిర్ణయించుకున్నా.
నాకంటే బాగా నటించిన వారికి ఈ అవార్డు ఇవ్వండి. ఎవరిని ఎంపిక చేసినా నాకు సంతోషమే. అవార్డులతో పని లేకుండా ప్రేక్షకాభిమానులు ఎంటర్ టైన్ చేస్తాను. నటుడిగా నాపై ఉన్న బాధ్యత ఇది. కమిటీ నన్ను ఎంపిక చేసి ప్రోత్సహించింనుకు సంతోషం గా ఉంది. నా నిర్ణయంతో ప్రభుత్వం, జ్యూరీని నిరాశపరిచినట్లైతే క్షమించగలరు. మీపై నాకెప్పుడు గౌరవం ఉంటుంది. అన్యదా భావించొద్దు' అని అన్నారు.
దీంతో ఇప్పుడీ వార్త హాట్ టాపిక్ గా మారింది. ప్రతిష్టాత్మక రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన అవార్డునే తిరస్కరించడం సమజసం కాదంటూ కొందరు సుదీప పై మండిపడుతుండగా. మరికొంత మంది ఆయన నిర్ణయాన్ని స్వాగ తిస్తున్నారు. అవార్డుతో ఇప్పుడాయన కొత్తగా సాధించేది ఏం లేదని, మరొకరికి అవార్డు ఇస్తే ఆ గుర్తింపు అతడికి ఎంతగానో ఉపయోగ పడుతుందని సమర్దిస్తున్నారు.