8 వసంతాలు టీజర్.. ఎవరి తుఫాన్లు వారికుంటాయి!

ఇటీవలే విడుదలైన గ్లింప్స్ తో ఈ చిత్రం ప్రేక్షకుల మనసును తాకింది. షుద్ధి అయోధ్య పాత్రలో అనంతిక సనీల్కుమార్ తనదైన ముద్ర వేశారు.

Update: 2025-01-24 07:19 GMT

వెండితెరపై ఎమోషనల్ ఆర్ట్ లవ్ సినిమాలు వచ్చి చాలా కాలమైంది. అలాంటి సినిమాలు క్లిక్కయితే బాక్సాఫీస్ వద్ద ట్రెండ్ సెట్ చేస్తుంటాయి. ఇక అలాంటి మేకింగ్ విధానంతో ఇదివరకే పలు షార్ట్ ఫిలిమ్స్ తో ఫణీంద్ర నర్సెట్టి మంచి గుర్తింపుని అందుకున్నాడు. గతంలో అతను మధురం అనే షార్ట్ ఫిల్మ్ తెలుగు యూట్యూబ్ లవర్స్ ను బాగానే ఎట్రాక్ట్ చేసింది. ఇక ఇప్పుడు అతను "8 వసంతాలు" అనే సినిమాతో రాబోతున్నాడు..


ఇటీవలే విడుదలైన గ్లింప్స్ తో ఈ చిత్రం ప్రేక్షకుల మనసును తాకింది. షుద్ధి అయోధ్య పాత్రలో అనంతిక సనీల్కుమార్ తనదైన ముద్ర వేశారు. తాజాగా విడుదలైన టీజర్ ప్రేక్షకులను ఒక కొత్త ప్రయాణానికి తీసుకెళ్లింది. ఓ హార్ట్ బ్రేక్ గురించి ఓ స్నేహితుడితో మాట్లాడుతున్న అనంతిక.. అతడిని ఓదార్చేందుకు తన కథను రివర్స్‌లో చూపించడం ఓ అందమైన ఆలోచనగా హైలెట్ అయ్యింది.

ఓ గులాబి రేకు వరదనీటిలో కొట్టుకుపోతున్న దృశ్యం ఆ ప్రేమకు ప్రతీకగా మారుతుంది. "ఎవరి తుఫాన్లు వారికుంటాయి లోపల. కొందరు బయటడతారు, మరికొందరు ఎప్పటికి పడరు.. అంతే తేడా" అని అనంతిక చెప్పే డైలాగ్ ప్రేక్షకుల హృదయాలను తాకుతుంది. ఈ టీజర్‌లో దర్శకుడు ఫణీంద్ర నర్సెట్టి తన సృజనాత్మకతతో మరోసారి మెప్పించారు. ప్రేమలోని భావోద్వేగాలను, బాధలను, ఓ తుఫానుగా చూపిస్తూ.. కథను ముందుకు తీసుకెళ్లే తీరు నిజంగా అద్భుతం.

అనంతిక అభినయం ఈ టీజర్‌కు ప్రధాన బలం. ఆమె చెప్పిన ప్రతి మాటలోనూ ఆ బాధను హైలెట్ చేస్తోంది. మ్యూజిక్లో కూడా ఈ సినిమా తన ప్రత్యేకతను చూపిస్తోంది. హెషామ్ అబ్దుల్ వహాబ్ అందించిన నేపథ్య సంగీతం సాఫ్ట్ టోన్‌లో భావోద్వేగాలకు జీవం పోసింది. ప్రేమలోని విషాదం, ఆనందం రెండింటినీ చక్కగా హైలైట్ చేస్తుంది. "8 వసంతాలు"లోని కథ, సంగీతం కలయికతో ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించనుందని అర్ధమవుతుంది.

మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రతీ సన్నివేశం ఎక్కడా తగ్గకుండా భారీ సాంకేతిక ప్రమాణాలతో రూపొందుతోందని తెలుస్తోంది. రవి తేజ దుగ్గిరాల, హాను రెడ్డి, కన్నా పసునూరి వంటి వారు సినిమాలో నటించారు. ఈ చిత్రం ప్రేక్షకుల మనసులో ప్రేమ గురించి ఉన్న భావాలను కొత్తగా తిరగరాస్తుందనే నమ్మకం ఉందని మేకర్స్ చెబుతున్నారు. "8 వసంతాలు" మన జీవితంలోని భావోద్వేగాలకు అద్దం పట్టే ప్రయాణం అని టీజర్ ని హైలెట్ చేశారు. మరి సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రెస్పాన్స్ ను అందుకుంటుందో చూడాలి.

Full View
Tags:    

Similar News