పిక్‌టాక్ : శోభిత ఢిల్లీలో ఉన్నప్పుడు..!

తెలుగు నటి శోభిత దూళిపాల ఇటీవల హీరో నాగ చైతన్యను వివాహం చేసుకోవడం ద్వారా వార్తల్లో నిలిచింది.

Update: 2025-01-24 09:23 GMT

తెలుగు నటి శోభిత దూళిపాల ఇటీవల హీరో నాగ చైతన్యను వివాహం చేసుకోవడం ద్వారా వార్తల్లో నిలిచింది. బాలీవుడ్‌లో ఎక్కువ సినిమాలు, సిరీస్‌లు చేయడం ద్వారా నార్త్‌ ఇండియాలో మంచి ఫాలోయింగ్‌ దక్కించుకున్న ఈమె ఇప్పటికీ అక్కడ వరుసగా సినిమాలు, సిరీస్‌లు చేస్తూ బిజీగా ఉంది. తెలుగు అమ్మాయిలు హీరోయిన్స్‌గా రాణించలేరు అనే అభిప్రాయం మార్చుతూ శోభిత ఏకంగా బాలీవుడ్‌లోనే జెండా పాతింది. అక్కడ శోభితకి ఉన్న ఫాలోయింగ్‌ మామూలుగా ఉండదు. బాలీవుడ్‌లో స్టార్స్‌తో కలిసి వర్క్ చేసిన శోభిత టాలీవుడ్‌లోనూ సినిమాలు చేయాలని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు.

నాగ చైతన్యతో వివాహం జరిగిన తర్వాత చాలా రోజుల వరకు ఆమె సోషల్‌ మీడియాలో ఎక్కువగా కనిపించలేదు. తిరిగి సోషల్‌ మీడియా ద్వారా శోభిత యాక్టివ్‌ అయ్యారు. మోడలింగ్‌తో ఎప్పుడూ కొత్తగా కనిపించేందుకు ప్రయత్నిస్తూ ఉండే శోభిత తాజాగా ఢిల్లీకి వెళ్లింది. ఢిల్లీలో ఉన్నప్పుడు అంటూ ఒక సెల్ఫీని శోభిత సోషల్ మీడియాలో షేర్‌ చేసింది. ఆ ఫోటో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. మోడ్రన్‌ డ్రెస్‌లో శోభిత ఫోటోలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఇంతకు ఢిల్లీ ఎందుకు వెళ్లింది అనేది మాత్రం శోభిత క్లారిటీ ఇవ్వలేదు.

శోభిత ప్రస్తుతం చేస్తున్న సినిమా లేదా సిరీస్‌ కోసం అక్కడకు వెళ్లి ఉంటుంది అనేది కొందరి అభిప్రాయం. ఆమె ఏదో షూటింగ్‌ నిమిత్తం వెళ్లి ఉంటుంది. నాగ చైతన్యతో పెళ్లి తర్వాత శోభిత సినిమాలకు దూరం అవుతుందని కొందరు అనుకున్నారు. కానీ ఆమె తన నటన కొనసాగిస్తాను అంటూ పలు సార్లు చెప్పుకొచ్చింది. అన్నట్లుగానే పెళ్లి అయిన వెంటనే కొన్ని వారాల్లోనే షూటింగ్‌కి జాయిన్‌ అయ్యింది. వరుసగా ఆమె నుంచి ఈ ఏడాది సినిమాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి.

శోభిత ప్రస్తుతం ఢిల్లీలో బిజీగా ఉంటే మరోవైపు నాగ చైతన్య తండేల్‌ సినిమా ప్రమోషన్‌లో పాల్గొంటున్నారు. ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న తండేల్‌ నుంచి ఇటీవల మరో పాటను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు. నాగ చైతన్యకు జోడీగా తండేల్‌ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్‌గా నటించింది. చందు మొండేటి దర్శకత్వంలో బన్నీ వాసు ఈ సినిమాను నిర్మించగా అల్లు అరవింద్‌ సమర్పిస్తున్నారు. ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్‌ సంగీతాన్ని అందిస్తున్నారు.

Tags:    

Similar News