నటుడు మృతి.. తండ్రి చనిపోయిన వారం రోజులకే!
హాలీవుడ్ యువ నటుడు అగ్నస్ క్లౌడ్ హఠాన్మరణం చెందాడు. తండ్రి చనిపోయిన వారం రోజులకే కుమారుడు కూడా తిరిగిరాని లోకాల కు వెళ్లిపోవడంతో కుటుంబం
హాలీవుడ్ యువ నటుడు అగ్నస్ క్లౌడ్ హఠాన్మరణం చెందాడు. తండ్రి చనిపోయిన వారం రోజులకే కుమారుడు కూడా తిరిగిరాని లోకాల కు వెళ్లిపోవడంతో కుటుంబం..అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. అగ్నస్ మరణం పట్ల కళాకారులంతా సంతాపం ప్రకటించారు. వారం క్రితం తండ్రి అంత్యక్రియలు ఐర్లాండ్ లో నిర్వహించి..ఆమెరికా లోని ఓక్లాండ్ లోని ఇంటికి వచ్చాడు అగ్నాస్. తండ్రి మరణం అగ్నస్ ని మానసిక కృంగిబాటుకు గురించేసిందని కుటుంబీకులు తెలిపారు.
అంతకు ముందు నుంచే అగ్నస్ మానసిక సమస్యలు ఎదుర్కుంటున్నారని గుర్తు చేసారు. దీనికి సంబంధించి ఓ ప్రకటన విడుదల చేసారు. 'మంచి మనిషికి బరువెక్కిన హృదయంతో వీడ్కోలు పలుకుతున్నాము. అగ్నస్ ఒక స్నేహితుడిగా..సోదరుడిగా..కుమారుడిగా ఎన్నో రకాలు మాకు ప్రత్యేకం. తండ్రికుమారులు ఇద్దరు ఆ రిలేషన్ కంటే మంచి స్నేహితులుగా ఉండేవారు. ఇప్పుడు అగ్నస్ తన బెస్ట్ ప్రెండ్ వద్దకే చేరుకున్నాడు.
అగ్నస్ పడిన మానసిక క్షోభ.. మానసిక సమస్యల పై ఎల్లపుడూ బహిరంగంగానే ఉండేవాడు. ఇలాంటి సమస్యలతో బాధపడేవారు ఎప్పుడూ ఒంటరిగా ఉండొద్దని ..మనసు లో భావాలు ఇతరులతో పంచుకోండని చెప్పేవాడు' అని ప్రకటన లో ఉంది. అయితే అగ్నస్ మృతికి కారణాలు ఏవై ఉంటాయి? అన్నది ఇంకా ధృవీకరించలేదు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
అగ్నస్ కెరీర్ విషయానికి వస్తే ప్రముఖ వెబ్ సిరీస్ 'యుఫోరియా'లో నటించి గుర్తింపు తెచ్చుకున్నాడు. హెచ్ బీవో లో ప్రసారమయ్యే యుఫోరియా వెబ్ సిరీస్‌లో ఫెజ్కో అనే పాత్రలో డ్రగ్ డీలర్ గా తన విలక్షణమైన నటన తో ఆకట్టుకున్నాడు. ఆయన మాట తీరు ప్రత్యేకమైన గుర్తింపు తీసుకొచ్చింది.
ఇందులో నటి జెండాయా ప్రధాన పాత్ర పోషించింది. ఈ సిరీస్‌కి ముందు అగ్నస్ ఎటువంటి సినిమాల్లోనూ నటించలేదు. తన నటన తోనే ఐఎండీబీ లో 6 రేటింగ్ తెచ్చుకున్నాడు. మొదటి సారిగా 'ద లైన్' అనే సినిమా లోనూ నటించాడు.