అనిఖా బ్లూ లవ్.. ఎంత అందంగా ఉందో..

అనిఖా సురేంద్రన్.. ఈ మాలీవుడ్ బ్యూటీ గత ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన బుట్టబొమ్మ మూవీతో టాలీవుడ్ కు హీరోయిన్ గా పరిచయమైన సంగతి తెలిసిందే.

Update: 2024-12-02 05:09 GMT

అనిఖా సురేంద్రన్.. ఈ మాలీవుడ్ బ్యూటీ గత ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన బుట్టబొమ్మ మూవీతో టాలీవుడ్ కు హీరోయిన్ గా పరిచయమైన సంగతి తెలిసిందే. మలయాళం చిత్రం కప్పెలకు రీమేక్ కా తెరకెక్కిన ఆ సినిమాలో అనిఖా తన యాక్టింగ్ తో అందరినీ మెప్పించారు. తెలుగు డెబ్యూతో హిట్ అందుకోకపోయినా.. ప్రశంసలు మాత్రం దక్కించుకున్నారు.

14 ఏళ్ల క్రితం ప్రేక్షకుల ముందుకు వచ్చిన కథ తుడరను మూవీతో చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ స్టార్ట్ చేసిన అనిఖా సురేంద్రన్.. ఆ తర్వాత వరుసగా అనేక మలయాళ చిత్రాల్లో నటించారు. స్టార్ చైల్డ్ ఆర్టిస్ట్ గా మారిపోయారు. ఎంతో మంది మేకర్స్ కు బెస్ట్ సెలెక్షన్ గా మారారు. 2015లో కోలీవుడ్ లోకి అజిత్ ఎన్నై అరిందల్ మూవీతో అడుగుపెట్టారు.

ఆ తర్వాత అజిత్ విశ్వాసం మూవీలో ఆయన కుమార్తె రోల్ లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే నాగార్జున గోస్ట్ మూవీతో తెలుగు సినీ ఇండస్ట్రీలోకి వచ్చిన అమ్మడు.. బుట్ట బొమ్మ మూవీలో హీరోయిన్ గా సందడి చేశారు. ఇప్పుడు తమిళ, మలయాళ చిత్రాల్లో నటిస్తున్నారు. 2024లో రెండు మూవీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ నిర్మాతగా వ్యవహరిస్తున్న.. నిలవకు ఎన్ మిల్ ఎన్నడు కోబమ్ మూవీతో తమిళ హీరోయిన్ గా మారుతున్నారు. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఆ సినిమా వచ్చే ఏడాది విడుదల కానుంది. దాంతోపాటు మరిన్ని సినిమాల్లో కూడా యాక్ట్ చేస్తున్నారు అనిఖా సురేంద్రన్.

అదే సమయంలో సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటున్నారు. ఎప్పటికప్పుడు కొత్త కొత్త పిక్స్ తో సందడి చేస్తున్నారు. ఎక్కువగా ట్రెడిషనల్ వేర్ లో దిగిన పిక్స్ ను పోస్ట్ చేస్తున్నారు. లంగా ఓణీలు, చీరల్లో ఫోటోస్ దిగి షేర్ చేస్తున్నారు. తన క్యూట్ లుక్స్ తో ఆకట్టుకుంటున్నారు. తాజాగా కొత్త ఫోటోస్ పంచుకున్నారు.

బ్లూ కలర్ ప్లెయిన్ శారీలో దిగిన పిక్స్ ను పోస్ట్ చేశారు అనిఖా. అందులో హెయిర్ లీవ్ చేసుకుని సింపుల్ గా కనిపించారు. ప్రస్తుతం ముద్దుగుమ్మ ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. మేడమ్ సార్ మేడమ్ అంతే అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. పిక్స్ సూపర్బ్ గా ఉన్నాయని చెబుతున్నారు.

Tags:    

Similar News