వెంకీ మూవీ టైటిల్.. అనిల్ రావిపూడి ఆలోచన అదా?
టాలీవుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్, స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబోలో ఇప్పుడు ఓ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.
టాలీవుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్, స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబోలో ఇప్పుడు ఓ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే వీరిద్దరూ కలిసి వర్క్ చేసిన సినిమాలు ఎఫ్-2, ఎఫ్-3 మంచి హిట్స్ అయ్యాయి. దీంతో వెంకీ-అనిల్ కాంబోలో మరో ప్రాజెక్ట్ వస్తుందని అనౌన్స్మెంట్ వచ్చాక సినీ ప్రియులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. మరోసారి వారి కలయికతో ఆడియన్స్ కు కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ అందనుందని అంతా ఫిక్సయిపోయారు!
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్న ఆ సినిమాలో మీనాక్షీ చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే మేకర్స్ ఆ విషయాన్ని అనౌన్స్ చేయగా.. విడుదల చేసిన గ్లింప్స్ లో ఇద్దరూ వెంకీ సరసన కనిపించారు. అందులో ఒకరు వెంకటేష్ భార్యగా.. మరొకరు ప్రియురాలిగా నటిస్తున్నట్లు తెలుస్తోంది. అలా ఫ్యామిలీతోపాటు కామెడీ, సస్పెన్స్ జోనర్ లో అనిల్ రావిపూడి సినిమాను తెరకెక్కిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.
అయితే ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ చేస్తామని మేకర్స్ ఎప్పుడో ప్రకటించినా.. ఆ తర్వాత ఎలాంటి చప్పుడు చేయలేదు. దీంతో పోస్ట్ పోన్ అవుతుందని అంతా అనుకున్నారు. ఇంతలో నిన్న వెంకటేష్.. డబ్బింగ్ చెబుతున్న గ్లింప్స్ ను పోస్ట్ చేసి.. సంక్రాంతికి కలుద్దాం అని క్యాప్షన్ ఇచ్చారు. దీంతో పొంగల్ కు వెంకీ మామ సందడి చేయనుండడం ఫిక్సే అన్నమాట. అదే సమయంలో మూవీకి సంక్రాంతికి వస్తున్నాం అనే టైటిల్ ను ఫిక్స్ చేసినట్లు ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి.
కానీ ఇప్పుడు మరో రెండు టైటిళ్లను కూడా పరిశీలిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే దిల్ రాజు.. సంక్రాంతికి వస్తున్నాంతో పాటు ఇంట్లో ఇల్లాలు- పోలీస్ స్టేషన్ లో ప్రియురాలు, ఇక్కడ ఇల్లాలు.. అక్కడ ప్రియురాలు టైటిళ్లను ఫిల్మ్ ఛాంబర్ లో రిజిస్టర్ చేయించారట. అది కాకుండా అనిల్, వెంకీ మూవీ కథ అంతా.. భార్య, ప్రేయసి చుట్టూ తిరుగుతోంది. దీంతో ఆ రెండింట్లో ఒక టైటిల్ పెట్టాలని మేకర్స్ అనుకుంటున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.
దీపావళి స్పెషల్ గా టైటిల్ ను ప్రకటించాలని మేకర్స్ ఫిక్స్ అయ్యారని, అందుకోసం ఇప్పుడు చర్చల్లో ఉన్నారని సమాచారం. అయితే దివంగత దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ పెట్టే టైటిల్స్ ఎంత వెరైటీగా ఉంటాయో అందరికీ తెలిసిందే. ఏవండీ ఆవిడ వచ్చింది, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు అంటూ తన మార్క్ చూపిస్తూ పెట్టేవారు. ఇప్పుడు రావిపూడి కూడా ఆయన స్టైల్ లోనే వెంకీ మూవీకి టైటిల్ ను పెడుతున్నారని, దిల్ రాజు గ్రీన్ సిగ్నల్ ఇస్తే అనౌన్స్ చేస్తారని వినికిడి.