యానిమల్ బ్యూటీ మతి పోగొట్టే అందాల ఫోజ్‌

తృప్తి డిమ్రి యొక్క అందాల ఆరబోత ఫోటో షూట్‌ ఈ మధ్య కాలంలో రెగ్యులర్ గా వైరల్‌ అవుతున్న విషయం తెల్సిందే.

Update: 2024-02-29 09:26 GMT

యానిమల్‌ సినిమాతో ఓవర్‌ నైట్ స్టార్‌ అయిన ముద్దుగుమ్మ తృప్తి డిమ్రి. సినిమాలో ఈ అమ్మడు కనిపించేది కొద్ది సమయం అయినా కూడా అత్యంత కీలకమైన పాత్రలో కనిపించింది. అంతే కాకుండా తన అందంతో ఆకట్టుకుంది. కుర్రకారు హృదయాలను బేజారు చేసింది.


తృప్తి డిమ్రి యొక్క అందాల ఆరబోత ఫోటో షూట్‌ ఈ మధ్య కాలంలో రెగ్యులర్ గా వైరల్‌ అవుతున్న విషయం తెల్సిందే. తాజాగా ప్రముఖ మ్యాగజైన్‌ కవర్‌ పేజ్‌ పై ఇలా సందడి చేసింది. ఆకట్టుకునే ఫిజిక్‌ తో పాటు అందుకు తగ్గ ఔట్‌ ఫిట్ తో తృప్తి భలే అందంగా ఉందే అన్నట్లుగా నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

యానిమల్‌ సినిమాకు సీక్వెల్‌ గా రూపొందబోతున్న యానిమల్‌ పార్క్ లో తృప్తి పాత్ర మరింత ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయని బాలీవుడ్‌ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. యానిమల్‌ సినిమా తర్వాత తృప్తికి బాలీవుడ్ నుంచి పలు ఆఫర్లు వస్తున్నాయని కూడా తెలుస్తోంది.

ఇలాంటి అందాల ఆరబోత ఫోటోలు షేర్ చేస్తూ ఉండటం ద్వారా మరింత ఈ అమ్మడు పాపులారిటీని సొంతం చేసుకున్నట్లు అవుతుందని కొందరు అంటున్నారు. ఇక హీరోయిన్‌ గా ముందు ముందు తృప్తి స్టార్‌ హీరోయిన్స్ కి పోటీగా నిలవడం ఖాయం అంటూ ఈమె అందాల ఫోటోలు చూసిన వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.


Full View


Tags:    

Similar News