యానిమ‌ల్‌కి బాబీ ముద్దు సీన్ అన్‌క‌ట్ ఓటీటీలో

అయితే చివ‌రిగా త‌న సోద‌రుడు ర‌ణ్ విజ‌య్‌ ను ఎలా ముద్దుపెట్టుకోవలసి వచ్చిందో కూడా బాబీ తెలిపారు.

Update: 2023-12-15 02:30 GMT

ఇటీవల విడుదలైన `యానిమల్` బాక్సాఫీస్ వ‌ద్ద సంచ‌ల‌న విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే. ఈ యాక్షన్ చిత్రం నుండి నటుడు బాబీ డియోల్ ఎంట్రీ సాంగ్ `జమాల్ కుడు..` వైరల్ గా మారింది. సినిమాపై విమర్శలు వచ్చినప్పటికీ భయంకరమైన విల‌న్ అబ్రార్ హక్ పాత్రలో బాబీ నటనకు ప్రశంసలు అందాయి. సినిమా క్లైమాక్స్‌లో రణబీర్ కపూర్ రణ్‌విజయ్ సింగ్ తో భీక‌ర‌మైన ఫైట్ చేస్తాడు. అయితే చివ‌రిగా త‌న సోద‌రుడు ర‌ణ్ విజ‌య్‌ ను ఎలా ముద్దుపెట్టుకోవలసి వచ్చిందో కూడా బాబీ తెలిపారు.

ది క్వింట్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో బాబీని ఎందుకు ఈ పాత్రను అంగీకరించారని అడిగారు. బాబీ డియోల్ ఇలా అన్నాడు. సందీప్ రెడ్డి వంగా దానిని (అబ్రార్ పాత్ర) నాకు చెప్పడానికి ముందే నేను ఆ పాత్ర‌కు ఓకే చెప్పేసాను చెప్పాను.. ఎందుకంటే అతడు నాకు చెప్పబోయేది చాలా అద్భుతంగా ఉంటుందని నాకు తెలుసు అని అన్నారు.

అతడు (సందీప్ రెడ్డి వంగా) పాత్రల గురించి నాతో మాట్లాడటం ప్రారంభించినప్పుడు..ఈ ఇద్దరు అన్నదమ్ములు.. ఒకరినొకరు చంపాలనుకుంటారు.. కానీ వారికి ఒకరిపై ఒకరికి సోద‌ర ప్రేమ ఉంది. క్లైమాక్స్ సీక్వెన్స్‌ని షూట్ చేసిన‌ప్పుడు.. ఇది ప్రేమ గురించిన పాటతో ప్లే అవుతుంది! అని బాబీ చెప్పాడు. నేను పోరాడుతున్నాను.. నేను అకస్మాత్తుగా అతడిని ముద్దుపెట్టుకుంటాను. ఆపై అత‌డిని వదలను.. చివ‌రికి అతడు న‌న్ను చంపుతాడు!.. అని క్లైమాక్స్ సీన్ ని వివ‌రించాడు. అయితే ఈ సీన్ నుంచి ద‌ర్శ‌కుడు ఆ ముద్దును తొలగించాడు. ఒక ముద్దు సీన్ ఉంది. అది అన్‌కట్ నెట్‌ఫ్లిక్స్ వెర్షన్‌లో రావచ్చు అని నేను అనుకుంటున్నాను... అని కూడా బాబీ అన్నారు. సందీప్ నాకు క‌దంతా చెప్పి `యు ఆర్ మ్యూట్` అన్నాడు అని కూడా తెలిపారు.

గ‌త‌ ఇంటర్వ్యూలో బాబీ యానిమల్‌లో తన పాత్రను ప్రతీకారంతో క‌క్ష తీర్చుకునే వ్యక్తిగా అభివర్ణించాడు. తీర్పు ఇవ్వ‌లేని స్పేస్ నుండి ఈ పాత్ర కోసం సంప్రదించినట్లు చెప్పాడు. అబ్రార్ ప్రతీకారంతో నిండి ఉన్నాడు. కాబట్టి బాగా మునిగిన‌ప్పుడు మంచి చెడు విచ‌క్ష‌ణ‌ ఏమిటో చూడరు. ఎవరి ప‌ని అయినా పూర్తి చేయాలని కోరుకుంటారు. ఈ చిత్రంలో అబ్ర‌ర్ ఎంతో బాధకు గుర‌య్యాడు ... ఇది అతడిని ఈ రకమైన వ్యక్తిగా మార్చడానికి ఒక గాయం లాంటిది అని చెప్పాడు.

యానిమల్‌లో బాబీ , రణబీర్‌లతో పాటు రష్మిక మందన్న, ట్రిప్తి డిమ్రీ, శక్తి కపూర్, సురేష్ ఒబెరాయ్ , ప్రేమ్ చోప్రా త‌దిత‌రులు న‌టించారు. డిసెంబరు 1న విడుదలైనప్పటి నుండి ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద అసాధార‌ణ వ‌సూళ్ల‌ను సాధించింది. విమ‌ర్శ‌లు ఎదురైనా కానీ, సమస్యాత్మకమైన తండ్రి-కొడుకుల సంబంధం చుట్టూ తిరిగే క‌థ‌తో సందీప్ మ్యాజిక్ చేసాడు. ఈ చిత్రం భారతదేశంలో రూ.500 కోట్ల నెట్ మార్క్‌కు చేరువలో ఉంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రూ.772 కోట్లకు పైగా వసూలు చేసింది.

Tags:    

Similar News