యానిమల్.. ఆమెను కాదని రష్మీకకు ఛాన్స్.
సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రణబీర్ కపూర్ హీరోగా వచ్చిన యానిమల్ మూవీ సూపర్ పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది
సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రణబీర్ కపూర్ హీరోగా వచ్చిన యానిమల్ మూవీ సూపర్ పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. రణబీర్ కపూర్ ఇంటెన్స్ యాక్టింగ్, సందీప్ రెడ్డి వంగా అదిరిపోయే మేకింగ్, స్క్రీన్ ప్లే ఆడియన్స్ కి భాగా కనెక్ట్ అయ్యాయి. ఈ కారణంగానే సినిమాలో వైలెన్స్ ఎక్కువగా ఉన్న కూడా ఆడియన్స్ బ్రహ్మరథం పడుతున్నారు.
ముఖ్యంగా నార్త్ ఇండియన్ ఆడియన్స్ అయితే యానిమల్ సినిమాకి ఓ రకంగా డీప్ గా కనెక్ట్ అయిపోయారు. ఈ సినిమా తీసుకెళ్ళిన ట్రాన్స్ నుంచి వారం, పదిరోజుల పాటు వారు బయటకి రాకపోవచ్చని బిటౌన్ లో వినిపిస్తోంది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన రష్మిక మందన కూడా సూపర్ పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకుంది.
చాలా రోజుల తర్వాత ఒక కమర్షియల్ సినిమాలు ఆమెకి యాక్టింగ్ కి స్కోప్ ఉన్న పాత్ర లభించిందనే మాట వినిపిస్తోంది. అయితే రష్మిక పోషించిన ప్రీతి పాత్రకి ముందుగా పరిణీతి చోప్రాని ఖరారు చేశారంట. ఆమెతో అగ్రిమెంట్ కూడా అయిపోయిందంట. కాని ఆ పాత్రకి పరిణీతి లుక్స్, పెర్ఫార్మెన్స్ సెట్ కాకపోవడంతో సారీ చెప్పి ఆమెని తప్పించాల్సి వచ్చిందని సందీప్ రెడ్డి ఒక ఇంటర్వ్యూలో చెప్పారు.
నిజానికి పరిణీతి చోప్రా పెర్ఫార్మెన్స్ కి నేను పెద్ద ఫ్యాన్. ఆమె యాక్టింగ్ చూసి యానిమల్ మూవీకి ఎంపిక చేసాను. ఆడిషన్స్, రెండు, మూడు స్క్రీన్ టెస్ట్ లు చేసిన తర్వాత కూడా నేను ఎక్స్ పెక్ట్ చేసే రేంజ్ లో ఆమె నుంచి పెర్ఫార్మెన్స్ రావడం లేదు. ఇక ప్రీతి పాత్రకి ఆమె సెట్ కాదని అర్ధమైంది. దీంతో ఆమెకి సారీ చెప్పి రష్మికకి స్క్రీన్ టెస్ట్ చేసి ఎంపిక చేయడం జరిగిందని సందీప్ రెడ్డి వంగా క్లారిటీ ఇచ్చారు.
అలా యానిమల్ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అవకాశం కోల్పోవడంతో రష్మిక మందన ఛాన్స్ కొట్టేసింది. మూవీ సూపర్ హిట్ కావడం, ఆమె పెర్ఫార్మెన్స్ కి మంచి మార్కులు పడటంతో బాలీవుడ్ లో ఆమెపై ఫోకస్ పెరిగింది.