టాలీవుడ్ నుంచి ఆ ఇద్దరికే ఆహ్వానమా?
ప్రారంభోత్సవ సమయం దగ్గర పడటంతో ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేస్తుంది.
అయోధ్యలో రామమందిర్ ప్రారంభోత్సవం అంగరంగ వైభంగా జనవరి 22న భారీ ఎత్తున జరుగుతున్నసంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ప్రజలు హాజరయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుంది. ప్రారంభోత్సవ సమయం దగ్గర పడటంతో ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేస్తుంది. ఇక ఈ ప్రారంభోత్స కార్యక్రమానాకి టాలీవుడ్..కోలీవుడ్...శాండిల్ వుడ్..మాలీవుడ్ బాలీవుడ్ వరకూ చాలా మంది సెలబ్రిటీలకు ఆహ్వానం అందినట్లు తెలుస్తోంది.
అన్ని పరిశ్రమల అగ్ర నటులకు ప్రభుత్వం తరుపున ఆహ్వానం వెళ్లినట్లు తెలుస్తోంది. తెలుగు పరిశ్రమ నుంచి మెగాస్టార్ చిరంజీవికి..డార్లింగ్ ప్రభాస్ కి ప్రత్యేక ఆహ్వానం అందింది. కోలీవుడ్ నుంచి సూపర్ స్టార్ రజనీకాంత్..ధనుష్..మాలీవుడ్ నుంచి మోహన్ లాల్ కు..కన్నడ నుంచి యశ్.. `కాంతార` నటుడు రిషబ్ శెట్టికి ఆహ్వానాలు అందాయి. ఇక బాలీవుడ్ నుంచి బిగ్ బీ అమితా బచ్చన్..అక్షయ్ కుమార్..అజయ్ దేవగణ్..రణబీర్ కపూర్..టైగర్ ష్రాప్ ..మాధురీ దిక్షిత్..అనుపమ్ ఖేర్.. రాజ్ కుమార్ హిరాణీ..సంజయ్ లీలా భన్సాలీ.. రోహిత్ శెట్టిలకు ఆహ్వానాలు అందాయి.
అయితే తెలుగు పరిశ్రమ నుంచి కేవలం ఇద్దరికే ఆహ్వానాలు అందాయా? ఇంకా ఎవరికైనా అందాయా? అన్నది క్లారిటీ రావాలి. ఒకవేళ ఇద్దరు నటులకే ఆహ్వానం వెళ్లినట్లు అయితే అది చర్చకు దారి తీసే అవకాశం ఉంటుంది. ఇప్పటికే తెలుగు పరిశ్రమ నటులకు కేంద్ర ప్రభుత్వం నిర్వహించే కొన్ని కార్యక్ర మాల్లో సరైన గుర్తింపు దక్కడం లేదని పలుసందర్భాల్లో విమర్శలు తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే.
ఆ మధ్య ఓ పెద్దింటి కుటుంబానికి చెందిన కోడలు బాలీవుడ్ నటుల ముందు ఇంకే పరిశ్రమ నటులు ..ముఖ్యంగా తెలుగు పరిశ్రమ నటులు కనిపించలేదా? అనే పాయింట్ ని తెరపైకి తెచ్చారు. ఆమె వ్యాఖ్యలకు టాలీవుడ్ నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభించింది. అప్పట్లో అది సంచలన అంశంగానూ మీడియాలో హైలైట్ అయింది.