బేబమ్మకు అనిరుథ్ లవ్‌లీ గిఫ్ట్

టాలీవుడ్‌లోకి అడుగు పెట్టిన చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన ఈ పిల్ల.. ఎన్నో ఆఫర్లను అందుకుని సత్తా చాటుకుంది.

Update: 2024-10-16 07:56 GMT

సినీ రంగంలో ఇప్పుడున్న పోటీ కారణంగా స్టార్ హీరోయిన్లుగా మారాలంటే చాలా కష్టం అనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కానీ, కొందరు మాత్రం కెరీర్ మొదలెట్టిన కొత్తలోనే సంచలనంగా మారిపోతున్నారు. అలాంటి వారిలో క్యూట్ లేడీ కృతి శెట్టి ఒకరు. టాలీవుడ్‌లోకి అడుగు పెట్టిన చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన ఈ పిల్ల.. ఎన్నో ఆఫర్లను అందుకుని సత్తా చాటుకుంది.

తెలుగు చిత్ర పరిశ్రమలో ఆరంభంలోనే హ్యాట్రిక్ హిట్లను అందుకున్న కృతి శెట్టి.. ఆ తర్వాత మాత్రం వరుస ఫ్లాపులతో ఇబ్బంది పడింది. దీంతో ఇప్పుడు పెద్దగా అవకాశాలను సొంతం చేసుకోలేకపోతోంది. ఫలితంగా వేరే ఇండస్ట్రీల వైపు చూస్తోంది. ఈ పరిస్థితుల్లోనే ఇప్పుడు కృతి శెట్టి తమిళంలో ‘లవ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ’ (Love Insurance Kompany) అనే సినిమాలో నటిస్తోంది.

‘లవ్ టుడే’ చిత్రంతో హీరోగా మారిన దర్శకుడు ప్రదీప్ రంగనాథన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీనే ‘లవ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ’. విఘ్నేష్‌ శివన్‌ దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రం యూత్‌ను ఆకట్టుకునే కంటెంట్‌తో తెరకెక్కుతోంది. దీంతో ఈ సినిమా ఆరంభంలోనే అందరి దృష్టిని ఆకట్టుకుంది. ఈ చిత్రం ద్వారానే కృతి శెట్టి తమిళంలోకి హీరోయిన్‌గా పరిచయం అవుతోంది.

ప్రేమ కోసం టైం ట్రావెల్ చేసే వ్యక్తి కథతో తెరకెక్కుతోన్న ‘లవ్ ఇన్యూరెన్స్ కంపెనీ’ సినిమాకు సంబంధించి ప్రమోషన్స్ ఇప్పటికే మొదలు పెట్టేశారు. ముఖ్యంగా దీని నుంచి హీరో ఫస్ట్ లుక్‌తో పాటు ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తోన్న ఎస్‌జే సూర్య లుక్‌ను కూడా మేకర్స్ రివీల్ చేశారు. వీటికి మంచి రెస్పాన్స్ లభించడంతో ఇప్పుడు ఈ చిత్రం నుంచి అదిరిపోయే లవ్ సాంగ్‌ను విడుదల చేశారు.

ప్రదీప్ రంగనాథన్ - కృతి శెట్టి జంటగా నటిస్తోన్న ‘లవ్ ఇన్యూరెన్స్ కంపెనీ’ మూవీ నుంచి ‘ధీమా ధీమా’ అంటూ సాంగే ఫీల్ గుడ్ లవ్ సాంగ్‌ను వదిలారు. దీనికి విఘ్నేష్ శివన్ లిరిక్స్ అందించగా.. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుథ్ రవిచందర్ కంపోజ్ చేయడంతో పాటు స్వరాన్ని అందించాడు. ఇక, ఈ పాట డిఫరెంట్ థీమ్‌తో వచ్చింది. ట్యూన్ కూడా వినసొంపుగా ఉండడంతో దీనికి భారీ స్థాయిలో రెస్పాన్స్ లభిస్తోంది.

‘లవ్ ఇన్యూరెన్స్ కంపెనీ’ సినిమాను రౌడీ పిక్చర్స్, సెవెన్ స్క్రీన్ స్టూడియో బ్యానర్లపై నయనతార, లలిత్ కుమార్, విష్ణు కుమార్‌లు నిర్మిస్తున్నారు. ఇందులో ఎస్‌జే సూర్య, యోగి బాబు, మిస్కిన్, సీమన్ తదితరులు నటిస్తున్నారు. వాస్తవానికి ఈ చిత్రానికి ‘ఎల్ఐసీ’ అనే టైటిల్ పెట్టగా.. అప్పుడు అభ్యంతరాలు వచ్చాయి. దీంతో దీన్ని ‘ఎల్ఐకే’ అని మార్చిన విషయం తెలిసిందే.

Full View
Tags:    

Similar News