అనిరుధ్ అసలు ఆయుధం.. ఇక దేవరనే..

ప్రస్తుతం స్టార్ డమ్ ను ఎంజాయ్ చేస్తున్న అనిరుధ్ రవిచందర్ ఖాతాలో ఉన్న బిగ్ బడ్జెట్ సినిమాల్లో దేవర ఒకటి

Update: 2024-02-27 11:30 GMT

సాధారణంగా ఏదైనా సినిమాను స్టోరీ హిట్ అయ్యేలే చేస్తోంది.. లేకుంటే హీరో హిట్ అయ్యేలే చేస్తారు.. ఒక్కోసారి డైరెక్టర్లు కూడా హిట్లు చేస్తారు.. కానీ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ మాత్రం తన బాణీలతో సినిమాలను బ్లాక్ బస్టర్లు చేస్తున్నారు. విక్రమ్, జైలర్, జవాన్ అంతటి హిట్స్ అవ్వడానికి ముఖ్య కారణం అనిరుధ్ అని చెప్పవచ్చు. తన టాలెంట్ తో ఆ చిత్రాలకు ప్రాణం పోశారు. ఇండియాలోనే టాప్ మ్యూజిక్ డైరెక్టర్ పేరు సంపాదించుకున్నారు.

ప్రస్తుతం స్టార్ డమ్ ను ఎంజాయ్ చేస్తున్న అనిరుధ్ రవిచందర్ ఖాతాలో ఉన్న బిగ్ బడ్జెట్ సినిమాల్లో దేవర ఒకటి. అనిరుధ్ ఏదైనా సినిమా చేస్తున్నారని తెలిస్తే చాలు.. మ్యూజిక్ పై భారీ ఆశలు పెట్టుకుంటున్నారు మూవీ లవర్స్. దేవర విషయంలో కూడా అనిరుధ్ ఫైనల్ అయ్యారనే అనౌన్స్మెంట్ రాగానే.. ఎగిరి గంతేశారు తారక్ ఫ్యాన్స్. టీజర్ చూసిన తర్వాత మరిన్ని అంచనాలు పెంచుకున్నారు. తారక్ స్టెప్పులకు అనిరుధ్ సౌండ్ సెట్టయితే స్క్రీన్స్ హీటెక్కిపోవడం పక్కా.

యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబోలో తెరకెక్కుతున్న దేవర మూవీ ఏప్రిల్ 5న రిలీజ్ కావాల్సి ఉండగా.. ఇటీవల మేకర్స్ కొత్త డేట్ ను ప్రకటించారు. అక్టోబర్ 10వ తేదీన విడుదల చేస్తున్నట్లు తెలిపారు. అయితే దేవర పోస్ట్ పోన్ కావడానికి ముఖ్యమైన కారణం అనిరుధ్ అని సోషల్ మీడియాలో టాక్ తెగ నడుస్తోంది. పూర్తి స్థాయిలో మ్యూజిక్ వర్క్స్ ను అనిరుధ్ ఇంకా స్టార్ట్ చేయలేదని, అందుకే సినిమా రిలీజ్ పోస్ట్ పోన్ అయిందని అంటున్నారు.

దేవర సినిమాకు అనిరుధ్ వేగంగా గానీ ట్యూన్స్ ఇస్తే ఈ సినిమా రిలీజ్ డేట్ ప్రీ పోన్ కూడా అవ్వొచ్చని అంటున్నారు. అసలు విషయం తెలియకుండా అనిరుధ్ పైనే కామెంట్లు చేస్తున్నారు. దేవరతో తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలనుకుంటున్న అనిరుధ్ పై ఈ కామెంట్స్ ఎఫెక్ట్ చూపిస్తాయని సినీ పండితులు చెబుతున్నారు. అనిరుధ్ వర్క్ బాగుంటుందని, ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదని అంటున్నారు.

దేవర వాయిదా పై అనిరుధ్ ప్రభావం ఎంతవరకు ఉందనే విషయం పక్కన పెడితే.. అతను ఈ సినిమాతో తప్పక నిరూపించికోవాల్సిన అవసరం ఉంది. కొన్ని సినిమాలకు ఇటీవల అనిరుధ్ ఇచ్చిన మ్యూజిక్ అనుకున్నంత స్థాయిలో క్లిక్ కాలెదు. కాబట్టి దేవర ను ఆయుధంగా చేసుకొని విమర్శలకు కౌంటర్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. అలాగే లేటైనా కూడా అనిరుధ్ మ్యూజిక్ తో బజ్ క్రియేట్ చేస్తే ఈ రూమర్స్ అన్ని మర్చిపోతారు. మరి అనిరుధ్ ఎన్టీఆర్ వేగాన్ని అందుకునేలా మ్యూజిక్ తో మ్యాజిక్ క్రియేగ్ చేయగలరో లేదో చూడాలి.

Tags:    

Similar News