పెళ్లి చేసుకోని మరో సీనియర్ ప్రసాద్!
తాజాగా ఆయన కెరీర్ జర్నీ...వ్యక్తిగత జీవితం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.
క్యారెక్టర్ ఆర్టిస్ట్ అనీష్ కురువిల్లా సుపరిచితమే. 'ఆనంద్', 'గోదావరి', 'గుఢచారి', 'పెళ్లిచూపులు' లాంటి చిత్రాలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు దక్కించుకున్న నటుడు. వైవిథ్యమైన నటనతో అలరి స్తుంటాడు. సహజంగా నెరిసిన తల గెడ్డం లుక్ అతడిని స్పెషల్ గా ఫోకస్ చేస్తుంది. మంచి పర్సనాలిటీ .. ఆకట్టుకునే డైలాగ్ డెలివరీ అనీష్ సొంతం. ఆయన ఎంపిక చేసుకునే పాత్రలు ఎంతో హుందాగా ఉంటాయి. కనిపించేది కాసేపే అయినా ప్రేక్షకుల్లో ఎగ్జైట్ మెంట్ తీసుకురాగల నటుడు. తాజాగా ఆయన కెరీర్ జర్నీ...వ్యక్తిగత జీవితం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. అవేంటో ఆయన మాటల్లోనే..
'చిన్నప్పటి నుంచి సినిమాలు అంటే ఇష్టం. కాలేజ్ రోజుల్లో సినిమాలను ఎక్కువగా చూసేవాడిని. అదే సమయంలో నా దృష్టి డైరెక్షన్ దిశగా వెళ్లింది. ఒక వైపున నటిస్తూనే, మరో వైపున డైరెక్షన్ పై దృష్టిపెట్టాను. నటుడిగా 'ఆనంద్' , ' గోదావరి', 'గూఢచారి' , 'పెళ్లి చూపులు' వంటి సినిమాలు నాకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. నేను పెళ్లి చేసుకోలేదు. పెళ్లి అనేది నాకు ఇష్టం లేదు. పెళ్లి చేసుకోమని మా ఇంట్లో వాళ్లు చాలాసార్లు చెప్పారు.
కానీ ఎందుకో పెళ్లి అనేది నాకు సెట్ కాదని అనిపించింది. అందువల్లనే నేను దాని గురించిన ఆలోచన చేయలేదు. ఇక మా ఇంట్లో వాళ్లు కూడా నా నిర్ణయానికే వదిలేశారు. ప్రస్తుతం నేను నా కెరియర్ గురించే ఆలోచిస్తున్నాను' అన్నారు. ఆ రకంగా ఇండస్ట్రీలో మరో పెళ్లి కానిప్రసాద్ నమోదయ్యాడు. ఇప్పటికే పెళ్లి చేసుకోని నటులు కొందరున్నారు. నటుడు సుబ్బరాజ్ పెళ్లిచేసుకోలేదు. అతడికి పెళ్లి అంటే ఇష్టం లేదు. అలాగే సల్మాన్ ఖాన్ కూడా పెళ్లి చేసుకోలేదు. రాంగోపాల్ వర్మ, పూరి జగన్నాధ్, హరీష్ శంకర్ లాంటి వారు పెళ్లిచేసుకున్నా? తమకు తెలియక చేసుకున్నామని...జీవితానికి పెళ్లి అవసరం లేదని చెబుతున్న వారే.