ఆరెంజ్ గౌనులో అంజలి హై గ్లామర్ డోస్

రీసెంట్ గా న్యూయార్క్ లో దిగిన మరికొన్ని గ్లామరస్ ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది.

Update: 2024-10-18 13:59 GMT

టాలీవుడ్ ఇండస్ట్రీలోనే కాకుండా సౌత్ ఇండియా మొత్తంలో బ్యూటిఫుల్ లుక్స్ తో ఆకట్టుకునే వారిలో అంజలి ఒకరు. తెలుగమ్మాయి అయినప్పటికీ కూడా అటు తమిళంలో కూడా మంచి హీరోయిన్ గా గుర్తింపును తెచ్చుకుంది. కెరీర్ మొదట్లోనే ఆమె జర్నీ లాంటి కంటెంట్ ఉన్న సినిమాలలో నటించి ప్రేక్షకులకు దగ్గరైంది. అంజలి ఏదైనా సినిమా చేస్తోంది అంటే తప్పకుండా అందులో ఒక మంచి కథాంశం ఉంటుంది అని చెప్పవచ్చు.

 

ఆ విధంగా ఆమె తన స్టోరీ సెలక్షన్స్ తో ఎంతగానో అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది. ఇక అంజలి సోషల్ మీడియాలో అప్పుడప్పుడు పోస్ట్ చేసే ఫోటోలు కూడా ఫాలోవర్స్ ను ఎంతగానో ఆకట్టుకుంటూ ఉంటాయి. అంజలి కేవలం ట్రెడిషనల్ గానే కాకుండా గ్లామరస్ లుక్స్ తో కూడా తనకు తానే పోటీ అనేలా కనిపిస్తూ ఉంటుంది. ఆమె ఎలాంటి ఫోటో పోస్ట్ చేసినా కూడా చాలా కొత్తగా ఉంటుంది.

 

రీసెంట్ గా న్యూయార్క్ లో దిగిన మరికొన్ని గ్లామరస్ ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది. ఆరెంజ్ గౌనులో అంజలి గతంలో ఎప్పుడూ లేనంత అందంగా కనిపించింది అంటూ మరి కొందరు ప్రశంసలు అందిస్తున్నారు. అంజలి అందం ముందు ఎవరైనా పోటీ రాగలరా అంటూ మరికొందరు వారి స్టైల్ లో పొగిడేస్తున్నారు. తన క్యూట్ లుక్స్ తో ఎంతగానో ఎట్రాక్ట్ చేస్తున్న అంజలి ప్రస్తుతం తెలుగులోనే కాకుండా తమిళ సినిమాల్లో కూడా బిజీగా ఉన్న విషయం తెలిసిందే.

 

ముఖ్యంగా మెగా పవర్ స్టార్ తో ఆమె నటించిన గేమ్ ఛేంజర్ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఆ సినిమాలో అంజలి క్యారెక్టర్ చాలా డిఫరెంట్ గా ఉండబోతుందట. ఇక రీసెంట్ గా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలో కూడా ఒక ప్రయోగాత్మకమైన పాత్రలో కనిపించి విమర్శకుల ప్రశంసలు సొంతం చేసుకుంది. కేవలం సినిమాల వరకే పరిమితం కాకుండా అప్పుడప్పుడు మంచి కంటెంట్ ఉన్న వెబ్ సిరీస్ లు కూడా చేస్తోంది. మరి రాబోయే రోజుల్లో అంజలి ఇంకా ఎంత కొత్తగా కనిపిస్తుందో చూడాలి.

Tags:    

Similar News