పిక్‌టాక్‌ : గేమ్‌ ఛేంజర్‌లో అంజలి ఇలా..!

అంజలి గేమ్‌ ఛేంజర్ లుక్‌ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

Update: 2024-12-19 14:30 GMT

రామ్‌ చరణ్‌ డ్యూయెల్‌ రోల్‌లో నటించిన గేమ్‌ ఛేంజర్‌ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాలో చరణ్‌ మొదటి సారి తండ్రి, కొడుకు పాత్రల్లో కనిపించబోతున్నాడు. తండ్రి పాత్ర పోషించిన రామ్‌ చరణ్‌కి జోడీగా తెలుగు అమ్మాయి అంజలి హీరోయిన్‌గా నటించగా కొడుకు రామ్‌ చరణ్ పాత్రకు జోడీగా కియారా అద్వానీ హీరోయిన్‌గా నటించింది. రామ్‌ చరణ్‌ రెండు పాత్రల లుక్‌లు ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు టీజర్ ద్వారా వచ్చిన విషయం తెల్సిందే. తాజాగా అంజలి లుక్‌ను రివీల్‌ చేశారు. అంజలి గేమ్‌ ఛేంజర్ లుక్‌ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

తెలుగు అమ్మాయి అయినా ఎక్కువగా కోలీవుడ్‌ సినిమాలు చేయడం ద్వారా ఈమె తమిళ ముద్దుగుమ్మ అనే పేరును సొంతం చేసుకుంది. తెలుగులో ఈమె ఇప్పటికే పలు సినిమాల్లో నటించింది. ముఖ్యంగా సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, గీతాంజలి ఇంకా కొన్ని స్టార్‌ హీరోల సినిమాల్లోనూ నటించింది. చాలా కాలం తర్వాత యంగ్‌ టాలీవుడ్‌ స్టార్‌ హీరో సినిమాలో అంజలికి చోటు దక్కింది. 1970 కాలంలో తెలుగు పల్లెటూరు వ్యక్తిగా చరణ్ కనిపించగా, ఆయన భార్యగా పల్లెటూరుకి చెందిన గృహిణిగా అంజలి కనిపించబోతుంది. అందుకు తగ్గట్లుగానే చీర కట్టులో పెద్ద బొట్టుతో, జడలో పూలతో ఆకట్టుకుంది.

అంజలి లుక్‌ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. నిజంగానే అంజలి చాలా అందంగా హుందాగా ఉంది అంటున్నారు. సినిమాలో ఆమె పాత్ర ఎక్కువ సమయం ఉండాలి అని కొందరు కోరుకుంటున్నారు. సినిమాలో ఈమె పాత్ర నిడివి 20 నుంచి 30 నిమిషాలు ఉండే అవకాశం ఉంది. ప్లాష్ బ్యాక్ ఎపిసోడ్‌లో చరణ్‌ ఉన్న సన్నివేశాల్లో ఈమె కనిపించే అవకాశాలు ఉన్నాయి. ఇక కియారా కంటే అంజలి పాత్రకు, లుక్‌కి మంచి స్పందన వచ్చే అవకాశాలు ఉన్నాయి అంటూ మొదటి నుంచి ఇండస్ట్రీ వర్గాల వారు యూనిట్‌ సభ్యులు నమ్మకంగా చెబుతున్నారు.

శంకర్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా దర్శకుడు రూపొందించాడు. తమన్‌ అందించిన సంగీతం సినిమాకు ప్రధాన ఆకర్షణగా ఉండే అవకాశం ఉంది. అంతే కాకుండా సినిమాపై అంచనాలు పెంచే విధంగా పాటలు ఉన్నాయి. బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌తో తమన్‌ కుమ్మేయడం ఖాయం. అదే విషయాన్ని యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. సినిమా ప్రీ రిలీజ్ వేడుకను యూఎస్‌ఏలో నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. దిల్‌ రాజు ఈ సినిమాతో భారీ లాభాలను సొంతం చేసుకుంటాను అనే నమ్మకంతో కనిపిస్తున్నారు.

Tags:    

Similar News