అంజలి.. అందంలో నీకెవరు సాటి
తాజాగా ఈ బ్యూటీ రెడ్ కలర్ చీరలో స్టన్నింగ్ లుక్స్ తో ఫోటో పెట్టింది. ఈ ఫోటోలో ఆమె చేస్తోన్న సినిమాలో క్యారెక్టరైజేషన్ కి సంబంధించింది అని తెలుస్తోంది.
సౌత్ లో ఇండియాలో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న తెలుగమ్మాయి అంటే వెంటనే అంజలి పేరు గుర్తుకొస్తుంది. ఈ దశాబ్దంలో తెలుగమ్మాయిలలో సక్సెస్ ఫుల్ కెరియర్ ని లీడ్ చేసింది అంజలి మాత్రమే. తమిళంలో ఈ బ్యూటీ ఎక్కువ సినిమాలు చేసింది. స్టార్ హీరోలతో జత కట్టింది. తెలుగులో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో వెంకటేష్ కి జోడీగా నటించి మెప్పించింది.
తరువాత చాలా గ్యాప్ తీసుకొని బలుపు సినిమాలో రవితేజకి జోడీగా నటించింది. నెక్స్ట్ మసాలా, గీతాంజలి చిత్రాలలో అంజలి మెరిసింది. గీతాంజలి మూవీ సోలోగా అంజలికి సక్సెస్ అందించింది. ఆ తరువాత డిక్టేటర్ చిత్రంలో బాలయ్యతో అంజలి జతకట్టింది. ఈ మూవీ హిట్ టాక్ తెచ్చుకుంది. అయితే తెలుగులో సక్సెస్ లు వచ్చిన కూడా ఈ బ్యూటీ మెజారిటీ సినిమాలు తమిళంలోనే ఉండటం విశేషం.
మరల చాలా గ్యాప్ తర్వాత తెలుగులో గీతాంజలి మళ్ళీ వచ్చింది సినిమాతో ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. ఈ సినిమాలో మరోసారి ఈ బ్యూటీ భయపెట్టడానికి రెడీ అయ్యింది. అలాగే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చిత్రంలో కీలక పాత్రలో కనిపిస్తోంది. రామ్ చరణ్ పాన్ ఇండియా మూవీ గేమ్ చేంజర్ లో కూడా మంచి ప్రాధాన్యత ఉన్న పాత్రలో అంజలి నటిస్తోంది.
ఈ మూడు సినిమాలు సక్సెస్ అయితే తెలుగులో ఈ బ్యూటీకి అవకాశాలు పెరిగే ఛాన్స్ ఉంది. అంజలి ఎలాంటి క్యారెక్టర్ చేసినా కూడా అందిలో ఏదో ఒక కొత్తదనాన్ని హైలెట్ చేస్తుంది. అలాగే లేడి ఓరియెంటెడ్ ప్రాజెక్టులు కూడా చేస్తోంది. గీతాంజలి మళ్ళీ వచ్చింది సినిమా కూడా రాబోతోంది. పోటీగా ఎంతమంది హీరోయిన్స్ ఉన్నా కూడా అంజలి డడిఫరెంట్ క్యారెక్టర్లు సెలెక్ట్ చేసుకుంటోంది.
ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో ఈ అమ్మడు యాక్టివ్ గా ఉంటుంది. రెగ్యులర్ గా ఇన్ స్టాగ్రామ్ లో తన ఫోటోలని షేర్ చేస్తుంది. తాజాగా ఈ బ్యూటీ రెడ్ కలర్ చీరలో స్టన్నింగ్ లుక్స్ తో ఫోటో పెట్టింది. ఈ ఫోటోలో ఆమె చేస్తోన్న సినిమాలో క్యారెక్టరైజేషన్ కి సంబంధించింది అని తెలుస్తోంది.
రెడ్ శారీలో అమ్మడు అందం మరింతగా మెరిసిపోతోంది. లుక్స్ లో ట్రెడిషనల్ ఫీల్ తో పాటు కాన్ఫిడెంట్ కూడా కనిపిస్తోంది. ఇంత అందాన్ని తెలుగు దర్శక, నిర్మాతలు కరెక్ట్ గా వినియోగించుకోలేకపోయారని ఆమె అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఈ సారి మాత్రం ఆమెకి గేమ్ చేంజర్, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలతో బ్రేక్ రావడం గ్యారెంటీ అనే మాట వినిపిస్తోంది.