65 ఏళ్ల ఏఎన్నార్ సువర్ణ సుందరి.. ఈ విశేషాలు మీకు తెలుసా..?

ఇదిలా ఉంటే నవంబర్ 7 1958 అంటే దాదాపు 65 ఏళ్ల క్రితం ఏఎన్నార్ నటించిన సువర్ణ సుందరి సినిమా హిందీలో రీమేక్ అయ్యింది.

Update: 2023-11-07 10:04 GMT

తెలుగు చలన చిత్ర పరిశ్రమకు ఎన్.టి.ఆర్, ఏఎన్నార్ ఇద్దరు రెండు కళ్లు లాంటి వారు. ఎన్.టి.ఆర్ కన్నా ముందే ఏఎన్నార్ సినీ రంగ ప్రవేశం చేసి రాణించారు. తెలుగు చలన చిత్ర పరిశ్రమ హైదరాబాద్ కు తీసుకొచ్చేందుకు చాలా కృషి చేశారు. ఏఎన్నార్ చేసిన ప్రతి సినిమా అప్పట్లో ఒక సెన్సేషన్ అవుతుంది. ఏఎన్నార్ శత జయంతి సందర్భంగా ఇటీవల అన్నపూర్ణ స్టూడియోస్ లో ఆయన జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ నివాళి సమర్పించారు.


ఇదిలా ఉంటే నవంబర్ 7 1958 అంటే దాదాపు 65 ఏళ్ల క్రితం ఏఎన్నార్ నటించిన సువర్ణ సుందరి సినిమా హిందీలో రీమేక్ అయ్యింది. ఇప్పుడేదో పాన్ ఇండియా సినిమాలని హడావిడి చేస్తున్నాం కానీ 60 ఏళ్ల క్రితమే ఆ ప్రయత్నాలు జరిగాయి. వేదాంతం రాఘవయ్య దర్శకత్వంలో వచ్చిన సువర్ణ సుందరి సినిమాలో ఏఎన్నార్, అంజలి దేవి కలిసి నటించారు. ఈ సినిమాను హిందీలో డబ్ చేసి రిలీజ్ చేయాలని అనుకున్నారు. కానీ హిందీ డబ్బింగ్ కాదు రీమేక్ చేయాలని సలహా ఇచ్చారట లెజెండరీ గాయని లతా మంగేష్కర్.

ఆమె ఇచ్చిన సలహా మేరకే సువర్ణ సుందరిని హిందీలో డబ్ చేయకుండా రీమేక్ చేసి రిలీజ్ చేశారట. ఇది ఏఎన్నార్ కెరీర్ లో 66వ సినిమా. ఇప్పుడు తెలుగు సినిమా నేషనల్ వైడ్ రిలీజ్ చేస్తున్నారు కానీ అప్పట్లోనే తెలుగు సినిమాలు హిందీలో కూడా రీమేక్ అయ్యి సంచలనాలు సృష్టించాయి. సువర్ణ సుందరి సినిమా 65 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఏఎన్నార్ శత జయంతి ఉత్సవాల్లో భాగంగా అక్కినేని అభిమానులంతా ఆ సినిమాను గుర్తు చేసుకుంటున్నారు. ఏఎన్నార్ తన నట వారసులు నాగ చైతన్య, అఖిల్ తో కలిసి మనం సినిమాలో నటించారు. అదే ఆయన చివరి సినిమా. ఆయన ఎవర్ గ్రీన్ ఎనర్జీతో సినీ ప్రస్థానాన్ని కొనసాగించారు.

ఏఎన్నార్ లైవ్స్ ఆన్ అంటూ 65 ఏళ్ల క్రితం ఈరోజు రిలీజైన సువర్ణ సుందరి సినిమా విశేషాలను సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. ఏఎన్నార్ తర్వాత ఆయన నట ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నారు నాగార్జున. టాలీవుడ్ కింగ్ గా కేవలం వెండితెర మీదే కాదు బుల్లితెర మీద కూడా అయనకు సాటి లేరని ప్రూవ్ చేసుకున్నారు.

Tags:    

Similar News