ఆ రెండంటే చాలా చిరాకు : అనుపమ

పదేళ్ల క్రితం సినిమా ఇండస్ట్రీలో మలయాళ మూవీ 'ప్రేమమ్‌'తో అడుగు పెట్టిన ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్‌.

Update: 2024-12-24 04:57 GMT

పదేళ్ల క్రితం సినిమా ఇండస్ట్రీలో మలయాళ మూవీ 'ప్రేమమ్‌'తో అడుగు పెట్టిన ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్‌. ఈ పదేళ్ల కాలంలో మలయాళం, తెలుగు, కన్నడం, తమిళ్ భాషల్లో సినిమాలు చేసి అన్ని సౌత్‌ భాషల్లోనూ అభిమానులను సొంతం చేసుకున్నారు. ఉంగరాల జుట్టుతో వావ్‌ అనిపించే అందం ఈ అమ్మడి సొంతం. నటనతోనూ ఈ అమ్మడు మెప్పించిన విషయం తెల్సిందే. టాలీవుడ్‌లో యంగ్‌ హీరోలకి మోస్ట్‌ వాంటెడ్‌ హీరోయిన్‌గా పేరు దక్కించుకున్న ఈ అమ్మడు గత కొంత కాలంగా లేడీ ఓరియంటెడ్‌ సినిమాలను చేస్తూ మంచి పేరు సొంతం చేసుకుంటూ ఉంది. ఆకట్టుకునే అందం, పాత్రల ఎంపిక విషయంలో కాస్త తెలివి చూపించడం ద్వారా పదేళ్లు అయినా ఇండస్ట్రీలో వరుస సినిమాలు చేస్తుంది.

ప్రస్తుతం ఈ అమ్మడు సోషల్‌ మీడియాలో భారీ ఫాలోయింగ్‌ను సొంతం చేసుకుంది. దాదాపుగా 16 మిలియన్‌ల ఫాలోవర్స్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో కలిగి ఉన్న ఈ అమ్మడు రెగ్యులర్‌గా అందాల ఫోటోలను షేర్‌ చేయడం మనం చూస్తూ ఉంటాం. కానీ ఆ ఫోటోల్లో ఎక్కువ శాతం ఇష్టం లేకుండానే తీయించుకున్న ఫోటోలుగా చెప్పుకొచ్చింది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో అనుపమ పరమేశ్వరన్‌ మాట్లాడుతూ తనకు ఫోటో షూట్స్ అంటే ఇష్టం ఉండదని చెప్పుకొచ్చింది. సినిమా ప్రమోషన్స్‌ కోసం ఇంటర్వ్యూలు అంటూ కెమెరా ముందు కూర్చోబెడతారు. అప్పుడు చాలా ఇబ్బందిగా ఉంటుంది. పదే పదే అవే ప్రశ్నలతో చాలా సార్లు చిరాకు తెప్పించిన సందర్భాలు ఉన్నాయి అంది.

హీరోయిన్స్ అన్నప్పుడు అందాల ఆరబోత ఫోటో షూట్స్‌తో సోషల్‌ మీడియాలో కన్నుల విందు చేయాల్సి ఉంటుంది. అంతే కాకుండా ఎప్పుడూ వార్తల్లో ఉండాలి అంటే ఏదో ఒక మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇవ్వాల్సి ఉంటుంది. కానీ అనుపమ మాత్రం ఆ రెండు అంటే తనకు చిరాకు అంటూ చెప్పడం విడ్డూరంగా ఉంది. ఆమెకు ఆ రెండు అంటే చాలా చిరాకు అయినా సినిమాల ప్రమోషన్స్ కోసం ఇంటర్వ్యూలు ఇవ్వడం, ఫోటో షూట్స్ ఇవ్వడం రెగ్యులర్‌గా చేస్తూ ఉంటుంది. తాజాగా ఆమె తన మనసులో మాట బయట పెట్టడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షించింది. ముందు ముందు ఆమెను ఇంటర్వ్యూలు చేసే వారు కాస్త ఆలోచించాల్సి ఉంటుంది.

కార్తికేయ 2, 18 పేజెస్‌, బటర్‌ఫ్లై సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ విజయాలను సొంతం చేసుకున్న అనుపమ పరమేశ్వరన్‌ ఈ ఏడాది ఈగల్‌, సైరన్‌, టిల్లు స్వైర్‌ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. టిల్లు సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకోవడంతో పాటు ఆమె అందానికి మంచి మార్కులు పడ్డాయి. ఇక ఈ అమ్మడి చేతిలో ఆరు ఏడు సినిమాలు ఉన్నాయి. అందులో ఒకటి తెలుగు సినిమా కాగా మలయాళ, తమిళ్‌ సినిమాలు ఎక్కువ ఉన్నాయి. హీరోయిన్‌గా మరో పది సంవత్సరాలు కొనసాగాలి అంటే ఈ అమ్మడు అందాల ఆరబోత ఫోటో షూట్స్‌ను ఇష్టం లేకున్నా, చిరాకు అయినా కంటిన్యూ చేయాల్సిందే. సినిమాల ప్రమోషన్స్‌కి ఇంటర్వ్యూలు ఇవ్వాల్సిందే.

Tags:    

Similar News