నాభి అందాలతో అను పాప హీటెక్కించే స్టెప్పులు

చీరలో తన నడుము, నాభి అందాలు చూపిస్తూ, కవ్విస్తూ డ్యాన్స్ చేసింది. ఆమెను అలా చూసి ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.

Update: 2023-09-11 16:14 GMT

మళయాళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ అందరికీ సుపరిచితమే. ఆమెకు తెలుగులో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. మళయాళ మూవీ ప్రేమమ్ తో సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిది. ఆ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో, ఇతర భాషల్లోనూ ఆమెకు ఆఫర్లూ క్యూ కట్టాయి. తెలుగులో నితిన్ సరసన అఆ మూవీలో సెకండ్ హీరోయిన్ గా నటించింది. అది తన మొదటి సినిమా అయినప్పటికీ, సొంతంగా డబ్బింగ్ చెప్పుకొని షాకిచ్చింది. ఇక, ఆమె అమాయకత్వం, అందానికి అందరూ ఫిదా అయిపోయారు.

ఆ తర్వాత నుంచి తెలుగుతో పాటు, దక్షిణాది భాషల్లో హీరోయిన్ గా చాలా సినిమాలు చేసింది. ఆమె కెరీర్ మొదలుపెట్టిన సమయంలో కొంచెం బొద్దుగా, ముద్దుగా ఉండేది. కానీ, ఈ మధ్య బాగా సన్నపడింది. నిజానికి చక్కగా, అందంగా ఉన్నవారు సడెన్ గా బరువు తగ్గితే, ముఖంలో కళ తప్పుతుంది. కానీ, అనుపమ మాత్రం చక్కనమ్మ చిక్కినా అందమే అన్న చందంగా , మరింత అందంగా మారిపోయింది.

ఇప్పుడు మరింత సన్నజాజి తీగలా మారి, తన ఫ్యాన్స్ ని మురిపిస్తోంది. ఇక, సోషల్ మీడియాలో చాలా చురుకుగా ఉంటుంది. అందరు హీరోయిన్లలో కంటే, అనుపమ సోషల్ మీడియాను చాలా ఎక్కువగా వాడుతుంది. ఫ్యాన్స్ వేసే మీమ్స్ , కామెంట్స్ కూడా చూస్తూ ఉంటుంది. ఇక, అప్పుడప్పుడు రీల్స్ కూడా చేసి ఆకట్టుకుంటూ ఉంటుంది.

తాజాగా నీలి రంగు చీర కట్టుకొని కనిపించింది. ఈ మధ్యకాలంలో తనకు ఓ పాట బాగా నచ్చిందట. ఇంకేముంది ఆ పాటకు డ్యాన్స్ వేసేసింది. చీరలో తన నడుము, నాభి అందాలు చూపిస్తూ, కవ్విస్తూ డ్యాన్స్ చేసింది. ఆమెను అలా చూసి ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఆమె అందానికి ఫిదా అయిపోతున్నారు. ఆ ఉంగరాల జుట్టు, దానిని ఆమె , ప్లెయిన్ బ్లూ కలర్ సారీ, స్లీవ్ లెస్ జాకెట్, ఇలా అన్నీ ఆమెకు కరెక్ట్ గా సెట్ అయ్యాయి. ఇప్పుడు ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

ఇదిలా ఉండగా, కెరీర్ మొదలుపెట్టినప్పటి నుంచి పద్దతైన రోల్స్ చేస్తూ వచ్చిన అనుపమ ఈ మధ్య తనలోని గ్లామర్ యాంగిల్ కూడా బయటపెట్టడం మొదలుపెట్టింది. రౌడీ బాయ్స్ లో ఏకంగా లిప్ లాక్ సీన్స్ లోనూ నటించింది. ఇప్పుడు డీజే టిల్లు సీక్వెన్స్ టిల్లూ స్క్వేర్ లో నటించింది. ఇది త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులోనూ చాలా గ్లామర్ గా కనపడనుందని తెలుస్తోంది.

Tags:    

Similar News