క్రేజీ బ్యూటీ కాళ్లు ప‌ట్టి లాగుతున్నారు

ఇప్పుడు అలాంటి ఒక ద‌శ‌లో ఉంది ట్రిప్తి దిమ్రీ. ఈ బ్యూటీ ఏడెనిమిదేళ్లుగా ప‌రిశ్ర‌మ‌లో ఉన్నా ర‌ణ‌బీర్ లాంటి పెద్ద హీరోతో యానిమ‌ల్ లో న‌టించాకే త‌న‌కు ప‌రిస్థితులు అనుకూలంగా మారాయి.

Update: 2025-01-13 05:36 GMT

రంగుల ప్ర‌పంచం ఒక పాము నిచ్చెన‌ల ఆట‌. ఈ ఆట‌లో ఎవ‌రు బాగా ఆడ‌గ‌ల‌రో ఎవ‌రూ నిర్ణయించ‌లేరు. కొన్నిసార్లు కాలం నిర్ణ‌యిస్తుంది. ప్ర‌తిభ‌, ల‌క్ క‌లిసొస్తే కొంద‌రు స్టార్లు త‌మ‌కు న‌చ్చిన విధంగా ఆడ‌గ‌ల‌రు. కానీ ఎవ‌రు ఎంత‌గా ఆడినా ఎదిగేవాళ్ల‌ను కాళ్లు ప‌ట్టి లాగే పాముల్ని స‌మ‌ర్థంగా ఎదుర్కోవాల్సి ఉంటుంది.

ఇప్పుడు అలాంటి ఒక ద‌శ‌లో ఉంది ట్రిప్తి దిమ్రీ. ఈ బ్యూటీ ఏడెనిమిదేళ్లుగా ప‌రిశ్ర‌మ‌లో ఉన్నా ర‌ణ‌బీర్ లాంటి పెద్ద హీరోతో యానిమ‌ల్ లో న‌టించాకే త‌న‌కు ప‌రిస్థితులు అనుకూలంగా మారాయి. యానిమ‌ల్ బ్లాక్ బ‌స్ట‌ర్ అవ్వ‌డం, ఆ చిత్రంలో త‌న పాత్ర‌కు గుర్తింపు ద‌క్క‌డంతో వ‌రుస‌గా అర‌డ‌జ‌ను పైగానే సినిమాల‌కు ఈ బ్యూటీ సంత‌కాలు చేసింది. వీటిలో కొన్ని సెట్స్ పై ఉన్నాయి.

ఆషిఖి 3, ధ‌డ‌క్ 2 లాంటి సీక్వెల్ చిత్రాల్లో ట్రిప్తీ న‌టిస్తోంది. ఒక‌వేళ ఈ రెండు సినిమాలు విజ‌యం సాధిస్తే త‌న‌ రేంజ్ మ‌రింత‌గా ఎదుగుతుంది. కానీ ఇంత‌లోనే ఈ బ్యూటీ కాళ్లు ప‌ట్టి లాగేవాళ్లు ర‌క‌ర‌కాలుగా ప్ర‌చారం చేస్తున్నారు. ముఖ్యంగా ఆషిఖి 3 నుంచి ఈ భామ వైదొలిగింద‌ని ఒక పుకార్ షికార్ చేసింది. ఇది ఎదిగే స‌మ‌యంలో నెగెటివ్ ప్ర‌చారం. దీనివ‌ల్ల చాలా డ్యామేజ్ జ‌రుగుతుంది. కానీ అదృష్ట‌వ‌శాత్తూ ద‌ర్శ‌కుడు అనురాగ్ బ‌సు దీనిని ఖండించారు. త‌న పాత్ర‌ను దాచ‌డం వ‌ల్ల అంతగా ప‌బ్లిసిటీ రాలేద‌ని కూడా అన్నారు. ఆషిఖి 3 ఈ ఏడాదిలోనే విడుద‌ల కానుంది. అలాగే ధ‌డ‌క్ 2లోను ట్రిప్తీ న‌టిస్తోంది. వీటితో పాటు ట్రిప్తీకి ఇత‌ర ఆఫ‌ర్లు ఉన్నాయి. కానీ నెగెటివ్ ప్ర‌చారం కార‌ణంగా కొన్నిసార్లు పెద్ద డ్యామేజ్ జ‌రిగే అవ‌కాశం ఉంది. కానీ దీనిని యువ‌న‌టి స‌మ‌ర్థంగా తిప్పి కొడుతుందేమో చూడాలి.

Tags:    

Similar News